ETV Bharat / state

ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళనపై సర్కార్‌ కార్యచరణ - రాబడికి గండి కొడుతున్నవారిపై ఉక్కుపాదం - TS EXCISE DEPARTMENT REVENUE

Excise Department Focus On Belt Shops : ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళన ప్రక్రియను పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సర్కిళ్ల వారీగా మద్యం అమ్మకాలపై అధ్యయనం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కులకు కళ్లెం వేయడం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు స్థానచలనం కల్పించడం వంటివి చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Illegal Liquor Supply Control in Telangana
Excise Department Focus On Belt Shops (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2024, 7:15 AM IST

ఎక్సైజ్‌ శాఖ ప్రక్షాళనపై సర్కార్‌ కార్యచరణ - రాబడికి గండి కొడుతున్నవారిపై ఉక్కుపాదం (ETV Bharat)

Illegal Liquor Supply Control in Telangana : ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టే అతిపెద్ద రెండో వనరు ఎక్సైజ్‌ శాఖ. గత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌, లైసెన్స్‌లు, మద్యం దరఖాస్తుల ద్వారా 36 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ తరుణంలో అబ్కారీ శాఖను శాస్త్రీయంగా ప్రక్షాళన చేయడం, తద్వారా ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. విమర్శలకు తావు లేకుండా ప్రక్షాళన చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే దీర్ఘకాలికంగా ఒకే చోట పాతుకుపోయిన ఆబ్కారీ అధికారులను కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక బదిలీ చేసింది.

Excise Department Purge In Telangana : సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు, సహాయ ఎక్సైజ్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, సహాయ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్ల వరకు బదిలీ ప్రక్రియ పూర్తి చేసింది. కల్తీ కల్లు, గుడుంబా అమ్మకాల పెరుగుదల వల్ల మద్యం అమ్మకాలపైనా ప్రభావం పడుతోంది. అక్రమార్కులకు సహకరిస్తూ ప్రభుత్వ రాబడికి గండి కొట్టే అధికారులు, సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్‌ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

అక్రమ మద్యం సరఫరాపై ఆబ్కారీ శాఖ ఫోకస్​ - ఇప్పటివరకు 13వేలకు పైగా కేసులు నమోదు - ILLEGAL LIQUOR SUPPLY IN TELANGANA

Excise Department Surveillance On Liquor : ప్రక్షాళన పద్ధతి ప్రకారం, వివాద రహితంగా, శాస్త్రీయంగా చేపట్టాలని అబ్కారీ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని 141 ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో మూడేళ్ల నుంచి మద్యం అమ్మకాలు బ్రాండ్ల వారీగా పరిశీలన చేస్తారు. సర్కిళ్ల వారీగా డిమాండ్‌కు తగినట్లు ఆయా బ్రాండ్లను సరఫరా చేసే చర్యలు తీసుకుంటారు. ఉమ్మడి వరంగల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, కరీంనగర్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలో గుడుంబా తయారీ, రవాణా జరుగుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపైనా దృష్టిసారించారు. కింది స్థాయిలో కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు దీర్ఘకాలికంగా పనిచేస్తూ కొందరు అక్రమార్కులకు సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రక్షాళనను ఎన్నికల కోడ్‌ పూర్తికాగానే చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 6వ తేదీ లోపు ఆబ్కారీ శాఖలో అక్రమార్కుల భరతం పడతామని ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరిస్తున్నారు.

ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్​శాఖను మరింత ప్రక్షాళన చేస్తాం. ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. అందుకే మేము పరిశీలించలేదు. విమర్శలకు తావు లేకుండా ఎక్సైజ్​శాఖ పనిచేస్తుంది. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్​ను పటిష్ఠంగా నివారిస్తాం. వచ్చే నెల 6వ తేదీ లోపు ఆబ్కారీ శాఖలో అక్రమార్కుల భరతం పడతాం. - జూపల్లి కృష్ణారావు, ఎక్సైజ్ శాఖ మంత్రి

ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖ మరింత ప్రక్షాళన : మంత్రి జూపల్లి - Jupally on Excise Department

2023-24లో మద్యం ఆదాయం రూ.36 వేల కోట్లకు పైనే - అక్రమ దందా అరికడితే అదనంగా మరో రూ.2000 కోట్లు! - Illegal Liquor Supply Control in TS

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.