ETV Bharat / state

'మీ విచారణలో నిష్పాక్షికత కనిపించట్లేదు - మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు' - KCR Letter to Justice LN Reddy - KCR LETTER TO JUSTICE LN REDDY

Ex CM KCR Explanation of Notices to Power Purchase Deal : యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణంలో ఛత్తీస్​గఢ్​ విద్యుత్ కొనుగోలు అంశంలో వివరణ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​కు విచారణ కమిషన్ ఇప్పటికే నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. గడువు నేటితో ముగుస్తుండటంతో జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డికి కేసీఆర్ 12 పేజీల సుధీర్ఘ లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పే విషయంలో అన్ని రకాల చట్టాలను, నిబంధనలు పాటిస్తూ కేంద్ర, రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకుపోయామని, ఎలక్ట్రి సిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ, వీటన్నింటికీ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు పురోగమించామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

KCR Letter to Justice LN Reddy Commission
KCR Letter to Justice LN Reddy Commission (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 12:44 PM IST

Updated : Jun 15, 2024, 3:26 PM IST

KCR Letter to Justice LN Reddy Commission : రాజకీయ కక్షతో తనను, అప్పటి ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశాలపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆక్షేపించారు. గత ప్రభుత్వ విజయాలను తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. కమిషన్ ఏర్పాటు కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అప్పటి రాష్ట్రప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారని అసహనం వ్యక్తం చేశారు. బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని జస్టిస్‌ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. కమిషన్‌ ఇచ్చిన నోటీసులకు సమాధానంగా కేసీఆర్‌ సుదీర్ఘంగా 12 పేజీల లేఖను రాశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఉన్న విద్యుత్ పరిస్థితులు, ప్రజల ఇబ్బందులు, ప్రభుత్వ ఆలోచనలు, నిర్ణయాలకు గల కారణాలు సహా అనేక అంశాలను కేసీఆర్‌ లేఖలో ప్రస్తావించారు. అన్ని రకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ కేంద్రం నుంచి అనుమతులు తీసుకొని ముందుకెళ్లామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన దురుద్దేశాలను ఆపాదిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేసిందని మండిపడ్డారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయిందన్నారు. కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరమని ఆరోపించారు.

చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి, విషయాలను సమగ్రంగా పరిశీలించకుండా పలు అసంబద్ధ వ్యాఖ్యలు చేయడాన్నిఆక్షేపిస్తూ అభ్యంతరాలు తెలుపుతున్నట్లు కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఆసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన తెలిపారు. 2017 వరకు సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రాలపై ఎలాంటి ఆంక్షలు లేవన్న వాస్తవాన్ని విస్మరించారని చెప్పారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే విధంగా వ్యాఖ్యలు చేసి దురుద్దేశాలను ఆపాదించారని, విచారణార్హతను కోల్పోయారు కావున బాధ్యతల నుంచి విరమించుకోవాలని కేసీఆర్ సూచించారు.

విద్యుత్​ కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్​కు నోటీసులు - సమయం కోరిన మాజీ సీఎం - KCR SUMMONED IN POWER PURCHASE DEAL

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం తమ విధి : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడం తమ పార్టీ విధానమని కేసీఆర్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్‌కు నామినేషన్‌పై పనులు ఇచ్చినట్లు సమర్థించుకున్నారు. అత్యంత తీవ్ర కరెంట్ సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను బయటపడేయాలంటే ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్ సంస్థలతో పీపీఏ చేసుకోవడం, దాని ద్వారా పీజీసీఐఎల్ వద్ద కారిడార్ బుక్ చేసుకోవడం తప్ప మరో మార్గం లేకపోయిందని అన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోకుకండా మార్వా నుంచి విద్యుత్ కొనుగులులో వ్యవహారాన్ని తప్పు పట్టేలా ప్లాంటే లేదన్నట్లు వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఆశించిన మేర కరెంట్ సరఫరా కాకపోవడంతో రెండో వెయ్యి మెగావాట్ల కారిడార్‌ను రద్దు చేసినట్లు కేసీఆర్‌ తెలిపారు.

దాంతో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని కేసీఆర్‌ వివరించారు. ప్రజల అవస్థలు పరిగణనలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వ చర్యలను అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై కూడా వ్యాఖ్యానాలు చేయడం విచారకరమని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా ఛత్తీస్‌గఢ్‌తో మూడు రూపాయల 90 పైసలకే యూనిట్ కరెంట్ కొంటే అది ఎక్కువ ధర ఎలా అవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ హెవీ కాస్ట్ పే చేయాల్సి వచ్చిందని ఎలా వ్యాఖ్యానిస్తారని అడిగారు. విద్యుత్ కేంద్రాలను ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయమని అన్నారు.

'రవాణా వ్యయమే ప్రాతిపదిక అయితే రాయలసీమ ప్లాంటును ఎందుకు నిర్మించినట్లు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, ప్రైవేట్ కంపెనీలు కూడా బీహెచ్ఈఎల్‌కు నామినేషన్‌పై పనులు అప్పగించాయి. ఒక్క తెలంగాణ మాత్రమే బీహెచ్ఈఎల్‌కు నామినేషన్ పై పనులు అప్పగించినట్లు మాట్లాడారు. బీహెచ్ఈఎల్ పనికిమాలిన, ప్రైవేట్ సంస్థ అన్నట్లు, ప్రభుత్వ రంగ సంస్థలన్ని బలోపేతం చేయడమే తప్పన్నట్లు మాట్లాడారు. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుపట్టాలనే ముందస్తు ఆలోచనా వైఖరికి అద్దం పడుతోంది. అనుమతులు, కరోనా, ఎన్జీటీ స్టే లాంటి వాటిని పట్టించుకోకుండా యాదాద్రి ప్లాంటు సకాలంలో పూర్తి కాలేదని చెప్పడం అసమంజసం. వాస్తవాలకు విరుద్ధంగా పనులు కాలేదని దురుద్దేశాన్ని ఆపాదించారని' ఘాటుగా స్పందించారు.

Ex CM KCR Letter : కమిషన్ విధివిధానాల్లో లేని అంశాలపై కూడా మాట్లాడడం పరిధి దాటి వ్యవహరించడం, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణికి నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ బిడ్డగా జస్టిస్ నరసింహారెడ్డికి అప్పటి విద్యుత్ కోతల పరిస్థితి తెలుసని, చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మారడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో చూశారని కేసీఆర్ తెలిపారు. రాజకీయ కక్షతో నన్ను, అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జూన్ 15లోగా నా అభిప్రాయాలు సమర్పించాలని అనుకున్నానని అయితే, విచారణ పూర్తి కాకముందే సంప్రదాయాలకు విరుద్ధంగా మీడియా సమావేశంలో తన పేరు ప్రస్తావించారని కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

"లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో వ్యవధి అడిగితే దయదలిచి ఇచ్చినట్లు మాట్లాడడం బాధ కలిగించింది. విచారణ పవిత్ర బాధ్యత అని అన్ని కోణాల్లో సమగ్రంగా పరిశీలించి, పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌తో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాలి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందనట్లు మాట్లాడుతున్నారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా కమిషన్ తీరు ఉంది. విచారణ పూర్తి కాకముందే తీర్పు ప్రకటించినట్లు మాటలున్నాయి. విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. కమిషన్ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. విచారణ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డి విజ్ఞప్తి." - కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ అధినేత లేఖ

బీఆర్‌ఎస్‌ను బద్నాం చేసేందుకే వరుస విచారణలు - కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌కు నోటీసులు తప్పవా? - inquiries against previous BRS govt

Last Updated : Jun 15, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.