ETV Bharat / state

వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ శ్రీదేవి బదిలీ - వసూళ్లు పెరిగినా వేటు - ఏం జరిగింది? - IAS Officer Sridevi Transfer - IAS OFFICER SRIDEVI TRANSFER

IAS Officer Sridevi Transfer : వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీదేవిని ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆమెను ఆ పోస్టు నుంచి తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీదేవి బాధ్యతలు చేపట్టాక వాణిజ్య పన్నుల రూపంలో వసూళ్లు పెరిగాయి. కానీ ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటుకు కారణాలపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

IAS Officer Sridevi Transfer
IAS Officer Sridevi Transfer (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 4, 2024, 7:12 AM IST

Updated : Aug 4, 2024, 7:37 AM IST

Telangana Commercial Tax Commissioner Sridevi Transfer : వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీదేవికి స్థానచలనం కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆమె, అసెంబ్లీ ఎన్నికలకు ముందే వాణిజ్యపన్నుల శాఖకు వచ్చినా కొద్దికాలానికే ప్రభుత్వం శ్రీదేవిని ఆ పోస్టు నుంచి తప్పించింది. వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా నియమితులైన రిజ్వి ఇచ్చిన నివేదికతో, ఆమెపై బదిలీ వేటు పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఖజానాకు అత్యధిక ఆదాయాన్ని తెచ్చి పెట్టే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న శ్రీదేవిని, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా సర్కార్‌ నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, పలువురు అధికారులను మార్చినపుడు ఆమెకు కూడా స్థానచలనం కలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆమెనే వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించింది.

శ్రీదేవిని 8 నెలలకే ఆ పోస్టు నుంచి తప్పించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. శ్రీదేవి కమిషనర్‌గా వాణిజ్యపన్నులశాఖలో చేరిన తర్వాత ఆదాయం పెంచడానికి తీసుకున్న పలు నిర్ణయాలపై అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటికితోడు గతంలో పన్ను ఎగవేతలు, ఈ శాఖలో జరిగిన అక్రమాలపై మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు వాణిజ్య పన్నులశాఖ అధికారులపై ఇటీవల పోలీసు కేసు నమోదైంది. ఈ శాఖకు చెందిన అధికారే, వారిపై ఫిర్యాదు చేశారు. ఇలా కేసు నమోదుచేయడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

తెలంగాణ రెవెన్యూ రాబడులు గణనీయంగా 17 శాతం పెరిగాయి : కాగ్ రిపోర్ట్ - CAG Report in Telangana Assembly

ఎక్సైజ్‌ శాఖ మద్యం అమ్మకాలపై వ్యాట్‌ సరిగా వసూలు చేయడం లేదని ప్రభుత్వానికి శ్రీదేవి ఫిర్యాదుచేశారు. మద్యం తయారీ ఎంత, వ్యాట్‌ వసూళ్లు ఎంత, ప్రభుత్వానికి ఎంత చెల్లించాలనే వివరాలను ఇవ్వాలని సైతం ఎక్సైజ్‌శాఖకు ఆమె లేఖ రాశారు. ఈ విషయంలో వాణిజ్యపన్నులశాఖ తీరు సరిగా లేదని ఎక్సైజ్‌శాఖ సైతం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. 2017-22 మధ్యకాలంలో ఎక్సైజ్‌శాఖ పన్ను వసూళ్లలో 77 కోట్ల అక్రమాలు జరిగాయని రెండు రోజుల క్రితం శాసనసభకు సమర్పించిన కాగ్‌ నివేదిక సైతం వెల్లడించింది.

నివేదికను సభలో పెట్టిన మరుసటి రోజే, శ్రీదేవిని వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ పోస్టు నుంచి ప్రభుత్వం బదిలీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె బాధ్యతలు చేపట్టాక వాణిజ్య పన్నుల రూపంలో వసూళ్లు పెరిగాయి. అయితే, శ్రీదేవిని 8 నెలల్లోనే బదిలీ చేయడానికి అంతర్గత వ్యవహారాలే ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. వాణిజ్యపన్నులశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న రిజ్వీకే, కమిషనర్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.

అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption

Last Updated : Aug 4, 2024, 7:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.