CM jagan Manner on Rayalaseema: 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అండగా నిలిచింది రాయలసీమ ప్రాంతం. 52 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాయలసీమలో వైసీపీ 49 స్థానాలు గెలుచుకుంది. అంత ఆదరణ చూపిన తన ప్రాంతానికి ముఖ్యమంత్రి అవగానే జగన్ ఏం మేలు చేశారు. వారి సమస్యలు ఏం పరిష్కరించారు. సీఎం పదవిలో కూర్చోవటం కోసం సీమకు చేసిన వాగ్దానాలు ఏంటి. ఎన్ని హామీలు నెరవేర్చారు. వైఎస్సార్సీపీ పాలనలో సీమ ప్రజలు సంతోషంగా ఉన్నారా అనేది నేటి ప్రతిధ్వని చర్చ. చర్చలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ నేత, గౌస్ దేశాయ్, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో రాయలసీమకు జగన్ చేసిన మేలు ఏంటి. రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం నవీన్‌కుమార్ రెడ్డి చాలా ఏళ్లుగా పోరాడుతున్నారు. జగన్ సీఎం అయ్యాకా రాయలసీమ అభివృద్ధి ఎలా సాగిందనే దానిపై ఆయన చర్చించారు. గత ప్రభుత్వం పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరిచ్చింది. రాయలసీమకు కృష్ణా జలాలు ఇచ్చింది. ఎండిపోయిన చెరువులు కూడా నింపింది. జగన్ వచ్చాకా ఏం చేశారని కూడా ఆయన చర్చలో వివరించారు.
క్రికెటర్లు కూడా రాష్ట్రం నుంచి పారిపోవాల్సిందేనా? - వైసీపీ దెబ్బకు హనుమ విహారి ఔట్
అనంతపురం నుంచి చిత్తూరు వరకు, కియా నుంచి హీరో వరకు పరిశ్రమలు టీడీపీ ప్రభుత్వంలో వచ్చాయి. మరి జగన్ సీఎం అయ్యాకా సీమకు కొత్తగా తెచ్చిన కంపెనీలు ఏవి అనే అశంపై గౌస్ చర్చించారు. కర్నూలులో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు కానీ, అతిపెద్ద సోలార్ పార్క్ కానీ గత ప్రభుత్వంలో జరిగినవే. వైఎస్సార్సీపీ వాళ్లు కర్నూలు జిల్లాను ఈ ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారనే అంశాన్ని చర్చలో వివరించారు.
సీఎం సొంత జిల్లా అయిన కడపకు ఉక్కు పరిశ్రమ విషయంలో జగన్ ఎన్నిసార్లు మాట మార్చారు. కనీసం సొంత జిల్లాకైనా ముఖ్యమంత్రి న్యాయం చేశారా అని ప్రతిధ్వని చర్చలో చర్చించారు. జగన్ సీఎం అయిన తర్వాత రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షనిజం, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియాలు పెరిగాయి. పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోందో నంద్యాలలో సలాం ఆత్మహత్యే చెబుతోంది. మూడు రాజధానులని చిచ్చు పెట్టాలని చూశారు. ఇవన్నీ సీమ వాసులు గ్రహించారా అనే ప్రశ్నలపై చర్చలు నిర్వహించారు.
అయ్యయ్యో ప్రారంభించిన మరునాడే తెగి - 300 మీ. కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
గత ప్రభుత్వంలో రాయలసీమలో ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య అప్పటి సీఎం చంద్రబాబు సయోధ్య చేసి వారిని ఒక తాటిపైకి తెచ్చారు. 2019లో జగన్ వచ్చాకా అధికారపార్టీ దౌర్జన్యాలు పెరిగాయి. మళ్లీ సీమవాసులు జగన్ రావాలని కోరుకుంటున్నారా అనే అంశంపై చర్చించారు.
కాక రేపుతున్న టీటీడీ వివాదం - ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు తొలగింపు
- " class="align-text-top noRightClick twitterSection" data="">