RTC employees EPF Pension Problem in AP : ఆర్టీసీ ఉద్యోగులకు ఈపీఎఫ్ అధిక పింఛను అందని ద్రాక్షలా మారింది. దీన్ని అందుకోడానికి ఉద్యోగులు ఓ మినీ యుద్ధం చేయాల్సి వస్తోంది. డిమాండ్ నోటీసు మేరకు సొమ్ము చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ (EPF) అధికారులు చాలామంది దరఖాస్తులు తిరస్కరించారు. 1995 నాటి నుంచి వివరాలు కావాలంటూ మెలిక పెట్టి ఉద్యోగుల్ని ఆందోళనలోకి నెట్టారు.
అధిక పింఛను పొందాలనుకునే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను ఈపీఎఫ్ అధికారులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. రోజుకొక వివరాలు కావాలంటున్నారు. దీనికి గడువు కూడా తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికే పదవీ విరమణ పొందిన, మున్ముందు రిటైర్ కాబోయే ఉద్యోగులకు కొంతకాలం కిందటే ఈపీఎఫ్ అధిక పింఛన్ కోసం ఆప్షన్ ఇచ్చారు. పింఛన్ పొందడానికి ఎంతో చెల్లించాలో పేర్కొంటూ హైదరాబాద్ బర్కత్‌పురలోని పీఎఫ్ కార్యాలయం నుంచి గతంలో కొందరికి డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఉద్యోగులు ఆ మేరకు డీడీలు తీసి పంపించారు. వీటితో పాటు హయ్యర్ పింఛన్‌కు చెందిన ఫాం-10 డీ దరఖాస్తులనూ అందజేశారు. అయితే అనుహ్యంగా ఇటీవల వందల సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించి పీఎఫ్ అధికారులు వెనక్కి పంపారు.
సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికుల ఆందోళన
అధిక పింఛను కావాలంటే ఆయా ఉద్యోగులకు సంబంధించి 1995 నుంచి మూలవేతనం, కరవు భత్యం, వాటి బకాయిలు, ఇంక్రిమెంట్లు, వేతన సవరణ బకాయిలు, సమ్మెలో పాల్గొన్న రోజులు, జీతం లేని రోజులు వంటి వివరాలన్నీ పంపాలని పీఎఫ్ అధికారులు తెలిపారు. దీనికి ఈ నెలఖారు వరకే గడువు ఇచ్చారు. కొంత మంది ఆర్టీసీ ఉద్యోగులు వేర్వేరు డిపోల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఆయా డిపోలకు వెళ్లి తమ సర్వీసుల్లో నెలల వారీగా జీతాల వివరాలను సేకరించి పీఎఫ్ అధికారులకు పంపడం అసాధ్యమని చెబుతున్నారు.
ఆర్టీసీ రథ చక్రాలకు కళ్లెం వేసిన జగన్ సర్కార్ - వేగంగా ప్రైవేటు పరం! - Jagan Destroyed RTC
సాధారణంగా అధిక పింఛను కోసం డిమాండ్ నోటీసు జారీచేశాక ఆ సొమ్ము డీడీ రూపంలో చెల్లించేందుకు, ఫాం-10 డీ ఇచ్చేందుకు 3 నెలల గడువు ఇస్తారు. కానీ చాలామంది ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు ఆలస్యంగా అందుతున్నాయి. కొందరికైతే గడువు దాటాక వస్తున్నాయి. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు ముందుగా డిమాండ్ నోటీసులు పంపకుండా సర్వీసులో ఉండి, భవిష్యత్‌లో రిటైర్ అయ్యేవారిలో చాలా మందికి పంపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతినెలా రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఇప్పటికీ డిమాండ్ నోటీసులు రాలేదు. ఫలితంగా లోయర్, హయ్యర్ పింఛన్లలో ఏదీ పొందలేకపోతున్నారు. కొందరు ఉద్యోగులు డీడీ తీసి, దానిని ఫాం-10డి దరఖాస్తుతో సహా పంపినప్పటికీ అది అందిందో? లేదో? అనే సమాచారం కూడా పీఎఫ్ అధికారులు ఇవ్వడం లేదు.
గాడి తప్పిన ఆర్టీసీ - విలీనం చేసి చేతులు దులుపుకున్న జగన్ - అయిదేళ్లుగా నియామకాలు నిల్