ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన- రేపటి నుంచే మూడు రోజుల్లో పూర్తి - AP Floods Damage

AP Floods Damage : వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టం గణన చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పీ సిసోదియా తెలిపారు. గణన సమయంలో నివాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తి స్ధాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. ఇందుకు సంబంధించి సిద్దం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం వేదికగాఒక రోజు శిక్షణ పూర్తి చేశారు.

AP Floods Damage
AP Floods Damage (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2024, 12:37 PM IST

Report on AP Floods Loss 2024 : రాష్ట్రంలో వరదల వల్ల రూ.6882 కోట్ల నష్టం వాటిల్లిందని సర్కార్ ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. సమగ్ర గణన అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందని రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్​పీ సిసోదియా తెలిపారు. పునరావాసం కోసం రూ.750 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా ఉందని పేర్కొన్నారు. గరిష్ఠగా రహదారులు భవనాల శాఖకు రూ.2165 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు.

ఆ తర్వాత రూ.1569 కోట్లతో నీటిపారుదల శాఖ, రూ.1160 కోట్లతో పట్టణాభివృద్ధి, పంచాయితీరాజ్ శాఖ ఉన్నాయని ఆర్​పీ సిసోదియా తెలిపారు. పశుసంవర్ధక శాఖకు రూ.12 కోట్లు, మత్స్య పరిశ్రమకు రూ.158 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.301 కోట్లు, ఉద్యానవనశాఖకు రూ.40 కోట్లు, ఇంధన రంగానికి రూ.481 కోట్లు, గ్రామీణ నీటి పారుదల విభాగానికి రూ.76 కోట్లు, పంచాయితీరాజ్​ రహదారులకు రూ.168 కోట్లు, అగ్నిమాపక శాఖకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. వరదలకు రాష్ట్రంలో 43 మంది చనిపోయారని సిసోదియా వెల్లడించారు.

Enumaration Flood Damage in AP : నష్టం అంచనాల విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఎటువంటి వ్యత్యాసం చూపవద్దని సీఎం చంద్రబాబు సూచించారని ఆర్​పీ సిసోదియా వివరించారు. ఆయా ఆస్తులకు గరిష్ఠ ధరనే నమోదు చేయాలని ముఖ్యమంత్రి సూచించనట్లు చెప్పారు. వరద సహాయ, పునరావాస చర్యలు నిరంతరం జరుగుతున్నాయని సిసోదియా పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి 3 రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని సిసోదియా పేర్కొన్నారు. నివాసితులంతా ఇళ్లలో అందుబాటులో ఉంటే పూర్తి స్ధాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని చెప్పారు. గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక జిల్లా స్ధాయి అధికారి నేతృత్వం వహిస్తూ రాండమ్‌గా తనిఖీ చేపడతారని సిసోదియా వివరించారు.

ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్‌ : ప్రతి రెండు వార్డులకు ఒక ఐఏఎస్‌ అధికారి పర్యవేక్షిస్తారని సిసోదియా అన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయని పేర్కొన్నారు. వారు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని గృహస్తుల నుంచి తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రధానంగా నివాసాలకు తాళం వేసి ఉంటే గణన కష్టమవుతుందని తెలిపారు. అందుకే బాధితులు గుర్తింపు కోసం తమ అధార్ కార్డును అందుబాటులో ఉంచుకుని ఇంటిలో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు. మొత్తం సమాచారాన్ని వారి సమక్షంలోనే ప్రత్యేకంగా రూపొందించిన యాప్​లో నిక్షిప్తం చేస్తామన్నారు. ప్రభుత్వపరంగా నిర్వహించే కార్యక్రమానికి బాధితులు పూర్తి సహకారం అందించాలని సిసోదియా కోరారు.

వరదలతో రూ. 6,880 కోట్లు నష్టం - ప్రాథమిక నివేదిక సిద్ధం - Report on AP Floods Loss

ప్రజల ప్రాణాలు కాపాడేందుకు 'మేమున్నామంటారు' - ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యక్ష దైవమంటున్న జనం - NDRF Save Lots of People in Floods

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.