Elephant Herbs Roaming In Chittoor District Attacks Farmers And Destroy Crops : అదో ఏనుగుల గుంపు తలకోన అటవీ ప్రాంతం నుంచి అప్పుడప్పుడు జిల్లా సరిహద్దులోని గ్రామాల్లోకి చొరపడుతుంటుంది. వాటి కంట పడితే అంతే సంగతులు. అవి గ్రామంలోకి వస్తే విధ్వంసమే, పంట పొలాలపై పడితే సర్వ నాశనమే, మనుషులు ఎదురు పడితే మరణశాసనమే. అంత ప్రమాదం లేదులే అనుకున్న ప్రతిసారీ తమ ఉనికిని చాటుకుంటూ గజగజ వణిస్తుందీ గజరాజం గ్యాంగ్. మంగళవారం మరో రైతు భయం'కరి'’ ధాటికి మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గుంపు నుంచి రక్షణ కల్పించాలని సరిహద్దు గ్రామాల ప్రజలు అర్థిస్తున్నారు.
Elephant Menace in Vizianagaram Agency Area : గిరిశిఖరాల్లో మళ్లీ గజరాజులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. బుధవారం తిత్తిరి పంచాయతీ సీడిగూడ తదితర గిరిజన గ్రామాల్లో నాలుగు ఏనుగులు సంచరించడంతో ఒక్కసారిగా గిరిజన ప్రజలు భయాందోళన చెందారు. చీకటి పడితే జనవాసాల్లోకి, పంట పొలాల్లోకి ఏనుగులు రావడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. గిరిజన రైతులు పండించే చిరుధాన్యాల పంటలు, జీడి తోటలను ఏనుగుల గుంపు నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. సీతంపేట, భామిని అటవీ ప్రాంతాల్లో సంచరించిన నాలుగు కరిరాజులు మళ్ళీ కురుపాం మండలం ఏజెన్సీ ప్రాంతంలో ప్రవేశించాయి. ఆయా పరిసర గ్రామాల్లో ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి గిరిశిఖరాల్లో సంచరిస్తూ ఏనుగుల గుంపును తరలించాలని గ్రామస్థులు కోరుతున్నాను.
ఏనుగుల దాడిలో రైతు మృతి - మామిడితోటలో తిష్ఠవేసిన గుంపు
పీలేరు మండలంలో ఏనుగుల గుంపు సంచారం సంచలనం రేకెత్తించింది. సుమారు 15 నుంచి 20 వరకు ఏనుగులు సోమవారం రాత్రి పీలేరు మండలంలోకి ప్రవేశించాయి. వారం రోజులుగా చిత్తూరు జిల్లా పులిచెర్ల మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఏనుగులు సంచరిస్తున్నట్లు అక్కడి ప్రజలు తెలుపుతున్నారు. పక్కనే పీలేరు మండలం ఉండడంతో ఆ గుంపు ఇక్కడికి ప్రవేశించింది. పీలేరు మండల పరిధిలో ఏనుగుల సంచారం ఇదే మొదటిసారి. ఇవి ఒకసారి ప్రవేశించాయంటే ఆ ప్రాంతంలో ఉండే పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తాయి. కనపడిన మనుషులను తొక్కి చంపేస్తాయి.
గతంలో జరిగిన కరి ఘోరాలివి : ఫిబ్రవరిలో కలికిరి-వాల్మీకిపురం మండలాల సరిహద్దులోని గుట్టపాళెం, మేకలవారిపల్లె అటవీ ప్రాంతంలోకి రెండు ఏనుగులు దారి తప్పి వచ్చాయి. అటవీ శివారు ప్రాంతంలోని అరటి, వరి, టమాట పొలాలను తొక్కి రైతన్నలను తీవ్రంగా నష్టపరిచాయి. చిత్తూరు జిల్లా సోమల, చౌడేపల్లె అటవీ ప్రాంత సరిహద్దుల నుంచి దారి తప్పిన ఏనుగులు ఇక్కడికి రావడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు. పొలాల వద్ద ఏనుగుల సంచారాన్ని చూసిన పలువురు రైతులు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారు.
- ఎడాది కిందట కూడా దారి తప్పిన ఒంటరి ఏనుగు కలికిరి-వాల్మీకిపురం మండలాల సరిహద్దులోని అరటి తోటపై పడి విధ్వంసం సృష్టించి పంటకు తీవ్ర నష్టాన్ని కలిగించింది.
- ఐదేళ్ల క్రితం పలమనేరు మొగిలి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒంటరి ఏనుగు రామసముద్రం సమీపంలో కొండపై చిక్కుకుపోవడంతో శిక్షణ పొందిన మరో రెండు ఏనుగుల సాయంతో అధికారులు దానిని కొండ దించారు. అయితే ఇదే ఏనుగు బుసానికురప్పల్లె గ్రామంపై పడి ఓ వృద్ధుడిని కాళ్లతో తొక్కి చంపేసిన ఘటన స్థానికులను కలిచివేసింది.
- మదనపల్లెలో డ్రామా చూసి సీటీఎం మీదుగా వాయల్పాడు వెళ్తున్న తండ్రీ కొడుకులపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. అయిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఇలా ఇప్పటికే అనేక మంది ఏనుగుల గుంపు దాడిలో మృత్యువాత పడ్డారు.
- పదేళ్ల కిందట ఇదే మండలం చిన్నకంపెడ్డిగారిపల్లె సమీపంలోని వ్యవసాయ పంట పొలాలపై ఏనుగుల గుంపు పడి పంటను ధ్వంసం చేశాయి.
- 15 ఏళ్ల క్రితం కంభంవారిపల్లె మండలం జిల్లేళ్లమంద సమీపంలోని వ్యవసాయ పొలాల్లో ఏనుగుల గుంపు సంచరించింది. వ్యవసాయ పంట పొలాలను ధ్వంసం చేయడమే కాక ఓ రైతును కూడా పొట్టన పెట్టుకున్న ఘోరం చోటు చేసుకుంది.
'దారి తప్పి పంట పొలాలపై పడే ఏనుగుల గుంపు పిల్ల ఏనుగుల రక్షణకు ప్రాధాన్యమిస్తాయి. ఈ క్రమంలో కంట పడ్డ వారిని సైతం ప్రాణ భయంతోనే తొక్కి చంపే పరిస్థితి ఉంటుంది. ఏనుగుల గుంపును చూడానికి జనాలు తరలి రావడంతో ఎటూ పోలేని స్థితిలో అవి ఉంటాయి. జనసంచారం తగ్గాక అవే వెళ్లిపోతాయి. వాటి జోలికి వెళ్లడం అత్యంత ప్రమాదకరం.' - శ్రీనివాసులు, ఏడీఎఫ్‌వో, మదనపల్లె
కుంకీ ఏనుగులు ఏమయ్యాయి?: అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగుల గుంపు దారి తప్పి గ్రామాల సమీపంలోకి వచ్చి పంటను ధ్వంసం చేయడం, ప్రాణ నష్టం కలిగించడం చేస్తుంటాయి. ఇలాంటి ఏనుగుల గుంపును తరమడానికి అటవీశాఖ అధికారులు పర్యవేక్షణలో శిక్షణ తీసుకున్న కుంకీ ఏనుగులను వినియోగిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఈ కుంకీ ఏనుగులు ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడ నక్కి ఉన్న ఏనుగుల గుంపును తరిమివేసే అవకాశం ఉన్నా అధికారులు ఈ చర్యలు ఎందుకు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో కుంకీ ఏనుగుల బృందంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిని రప్పించాలని కోరుతున్నారు.
బాధ్యులెవరు? : పులిచెర్ల మండలంలో ఏనుగుల గుంపు సంచారం విషయం అటవీశాఖ అధికారులకు తెలిసినా ముందస్తుగా సమీప ప్రాంతాలను హెచ్చరించి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదు. పులిచెర్ల, సోమల, చౌడేపల్లె, పులిచెర్ల అటవీ ప్రాంతాల్లో తరచూ ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది.
కుంకీలు వస్తే గజరాజులు పరారే - మగ ఏనుగుల మధ్య భీకర పోరు - KUMKI ELEPHANTS