ETV Bharat / state

వేసవి రాక ముందే మొదలైన కరెంటు కష్టాలు - మరోవైపు గిర్రున తిరుగుతున్న స్మార్ట్‌ మీటర్లు

Electricity Problems in Kadapa District: వేసవి ఇంకా రాకముందే ఉమ్మడి కడప జిల్లాలో విద్యుత్ డిమాండ్, వాడకం పెరుగుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాగుకు ఇవ్వాల్సిన 9 గంటల కరెంటులోనూ కోత విధిస్తున్నారు. దీనికి తోడు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్ మీటర్లు గిర్రున తిరుగుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

Electricity_Problems_in_Kadapa_District
Electricity_Problems_in_Kadapa_District
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 8:59 AM IST

వేసవి రాక ముందే మొదలైన కరెంటు కష్టాలు - మరోవైపు గిర్రున తిరుగుతున్న స్మార్ట్‌ మీటర్లు

Electricity Problems in Kadapa District: ఉమ్మడి కడప జిల్లాలో 12 లక్షల 39 వేల 214 విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఉమ్మడి కడప జిల్లాలో 12,39,214 విద్యుత్తు సర్వీసులు ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, రాజంపేట, రాయచోటి, మైదుకూరు డివిజన్లలో 33/11 కేవీ సామర్థ్యమున్న ఉప కేంద్రాలు 318 ఉండగా, 22 చోట్ల 33 కేవీ ఉపకేంద్రాలు పనిచేస్తున్నాయి.

ఈ నెల రోజువారీగా కరెంటు కోటా 11.9 మిలియన్ యూనిట్లు కాగా గత 10 రోజులుగా వినియోగం పెరుగుతోంది. కేటాయించిన కోటా దాటిపోవడంతో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతుండటంతో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం

జిల్లాలో చిన్న, మధ్యతరహా, పెద్ద జలాశయాలు 14 ఉండగా, వీటి నిల్వ సామర్థ్యం 84 టీఎంసీలు కాగా ప్రస్తుతం 29 టీఎంసీల నీరు ఉంది. కొన్ని జలాశయాల్లో కనిష్ఠ స్థాయికి నీటిమట్టాలు పడిపోయాయి. రానున్న వేసవిలో తాగు, సాగు నీటి వెతలు తలెత్తే అవకాశం లేకపోలేదు. పంటలకు నీటిని ఇవ్వాల్సి ఉండగా, జలవనరుల పరిధిలో ప్రధాన, ఉప, పంట కాలువలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు.

ఆయకట్టుకు నీరు అందించే పరిస్థితుల్లేవు. లోటు వర్షపాతం వల్ల జలవనరుల్లో నీటిమట్టాలు తరిగిపోతున్నాయి. కరెంటు వాడకంలో కోటాకు మించి వినియోగిస్తున్నారు. మీటర్లు గిర్రున తిరుగుతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రానున్న వేసవిలో తలెత్తే కరెంటు కష్టాలను తలుచుకుని పల్లె, పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిలో కరెంటు కష్టాలు రాకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

స్వల్పకాలిక ఒప్పందాలతో అధిక ధరకు విద్యుత్‌ కొంటున్న ప్రభుత్వం-బాదుడే బాదుడు

"ఒకవైపు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మరోవైపు ఛార్జీలు పెంచి విద్యుత్ భారం ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్​ను సక్రమంగా పంపిణీ చేయడంలోనూ, నాణ్యమైన విద్యుత్​ను అందించడంలోనూ, పంటలు ఎండిపోకుండా నీరు అందించడంలోనూ ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. - కడప వాసి

"పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కరెంటు కోతలు వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కరెంటు బిల్లులు చాలా తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వ భారీగా ఛార్జీలు పెంచి, పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. కష్టపడి కూలీ పనులు చేసి తెచ్చుకున్న డబ్బులలో ఎక్కువ శాతం కరెంటు బిల్లులకే సరిపోతుంది. పథకాలు అంటూ చెప్పడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు". - రాజంపేట వాసి

"ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత చాలా సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. దీని వలన ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడైనా రిపేర్లు వచ్చినా సరే చేయడం లేదు. అధిక ఛార్జీలు కట్టుకోలేక అప్పులు చేయాల్సి వస్తోంది". - రాజంపేట వాసి

స్మార్ట్​ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.