Electricity Charges Increased Under YCP Gov: పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్ విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలపై అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీల భారం పడిందని, తాను అధికారంలోకి వచ్చాక భారాన్ని తగ్గిస్తానంటూ జగన్ నమ్మబలికారు. అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే పేదలు, సామాన్యులు, పరిశ్రమలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాలకు షాక్ ఇచ్చారు.
ఐదేళ్లలో ఐదు సార్లు విద్యుత్ చార్జీల పెంపు - పేదలపై ₹4వేల కోట్ల భారం
వేలల్లో విద్యుత్ ఛార్జీలు: అల్లూరి జిల్లా పాడేరులో విద్యుత్ బిల్లులు సగటు కుటుంబాలకు భారంగా మారాయి. వివిధ చార్జీల పేర్లతో విద్యుత్ బిల్లులు సగటు కుటుంబానికి గుదిబండగా మారాయని వాపోతున్నారు. గతంలో వందల్లో ఉండే బిల్లులు జగనన్న హయాంలో వేలల్లోకి మారిపోయాయి. ఏ వ్యాపారిని అడిగినా ఒకటే మాట. ఏ నెల సక్రమ పద్ధతిలో బిల్లులు రాలేదని, ఒక్కో నెలా ఒక్కో విధంగా వస్తుందని సమాధానం ఇస్తున్నారు. వేలల్లో కరెంటు బిల్లులు వస్తే సామాన్యులు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ప్రతి దుకాణంలోని ఇదే పరిస్థితి.
No Consumption Of Electricity Charges In Thousands: మాది చిన్న చికెన్ సెంటర్, మాది పాన్ షాప్ ,మాది చిరు హోటల్. పేరుకో చిరు వ్యాపారం అయినా బిల్లులు వేలల్లో వస్తున్నాయి. వాడలేని రోజులు కరెంటు బిల్లు మరింత అధికంగా వస్తుందని వాపోతున్నారు. నాలుగు నెలల పాటు ఓ దుకాణం తెచ్చుకోలేదు. మీటర్ తిరగకపోయినా గతంలో తిరిగిందని బిల్లు ఇచ్చారు. బిల్లు చెల్లించకపోతే మీటరు తీసేస్తారని భయంతో ఎక్కువ ఛార్జీలు వచ్చినా చెల్లిస్తున్నామని స్థానికులు తెలిపారు. ఇలా ప్రతి వినియోగదారుడు మీద మోయలేని భారం పడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఏజెన్సీలో కొన్ని నెలలపాటు ఫ్యాన్లు గాని ఏసీలు గాని అవసరం ఉండదు అయినప్పటికీ బిల్లులు వేలల్లో వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి'
"గతంలో 600, 700 వచ్చే బిల్లు ప్రస్తుతం 1200,1300 వస్తోంది. కరెంటు వినియోగించని సమయంలోనే ఎక్కువ వస్తోంది. ఎక్కువ ఛార్జీలు వస్తున్నాయని ప్రశ్నిస్తే మీటర్ మార్పు చేసుకోమని చెప్పారు. అయినా ఛార్జీల్లో మార్పు లేదు."
-స్థానికులు