Electricity AE Caught-red-handed-to-acb : ప్రజల నుంచి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా సేవలు అందించాల్సిన అధికారి డబ్బులు ఇస్తేనే పని జరుగుతుందని చెప్పటం జగనన్న ప్రభుత్వంలో కామన్ అయిపోయింది. ప్రజలు పని జరగటం కోసం మరో మార్గం లేక అధికారులు డిమాండ్ చేసినంత లంచం ఇచ్చి కొందరు పని చేయించుకుంటున్నారు. మరికొందరు అధికారులు డిమాండ్ చేసినంత చెల్లించుకోలేక నిరాశతో వెనుతిరుగుతున్నారు. తాజాగా విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఒక అధికారి లంచం (Bribing) తీసుకుంటూ ఏసీబీ అధికారుల (ACB Officers)కు గురువారం పట్టుబట్టాడు. అధికారులు నిందితుని వద్ద నుంచి ఇరవై వేల రూపాయిలు స్వాధీనం చేసుకుని, అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ వలలో సబ్ ఇంజినీర్ - రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు
Anantapur Electricity Department Officer Demanded Bribe: ఏసీబీ అధికారి వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం చాబాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తనకున్న ఒకటిన్నర ఎకరం పొలంలో రెండు సంవత్సరాల క్రితం బోరు వేయించారు. విద్యుత్ సప్లై కోసం వజ్రకరూరు విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ కోసం ఏడాది క్రితం అప్లై చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో పాటు మెటీరియల్ మంజూరు అయినప్పటికీ విద్యుత్ శాఖ ఏఈ (Assistant Engineer) చంద్రశేఖర్ రైతు ఆనంద్‌ను రూ. 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే రైతు నేను అంత ఇచ్చుకోలేనని రూ.20 వేల రూపాయలు ఇచ్చే విధంగా భేరసారాలు కుదుర్చుకున్నారు.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ దర్శి ఎస్ఐ రామకృష్ణ
చంద్రశేఖర్‌కు లంచం ఇవ్వటం ఇష్టం లేని రైతు ఈ విషయం ఏసీబీ అధికారులకు తెలియజేశారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద లంచం ఇవ్వడానికి చంద్రశేఖర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని రైతు ఏసీబీ అధికారులకు తెలియజేయటంతో కాపు కాశారు. ఈ తరుణంలో రైతు ఆనంద్ లంచం ఇస్తుండగా ముందుగా అక్కడే కాపు కాచిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న రూ. 20 వేల నగదును స్వాధీనం చేసుకొని గుత్తి పట్టణంలోని ఏపీఎస్పీడీసీఎల్ (AP Southern Power Distribution Company Limited) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వారి కార్యాలయానికి నిందితున్ని తరలించారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరిపి అనంతరం ఏసీబీ కోర్టుకు తరలిస్తామని ఏసీబీ అధికారి వెంకటాద్రి వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారి ఎవరైనా పని కోసం లంచం డిమాండ్ చేస్తే టోల్‌ఫ్రీ నెంబర్ 14400 డయిల్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారి సూచించారు.