ETV Bharat / state

ఈరోజే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? - సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఈసీ లేఖ - EC letter to ysrcp Govt on DBT - EC LETTER TO YSRCP GOVT ON DBT

EC letter to AP Govt on DBT Schemes: పథకాల నగదు బదిలీ ఇప్పటి వరకు ఎందుకు చేయలేపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నించింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. పోలింగ్‌ తేదీకి ముందు నగదు బదిలీ ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ రాసింది.

CEC_Letter_to_AP_Govt_on_DBT_Schemes
CEC_Letter_to_AP_Govt_on_DBT_Schemes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 1:21 PM IST

Updated : May 10, 2024, 7:21 PM IST

EC letter to AP Govt on DBT Schemes: నగదు బదిలీ పథకాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరో లేఖ రాసింది. ఇవాళే నగదు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని ఆదేశించింది. ఒకరోజే నిధుల బదిలీ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవడానికేనని వ్యాఖ్యానించింది.

పథకాల నిధులు పోలింగ్‌ తర్వాతే - స్పష్టం చేసిన ఈసీ - EC On Schemes Funds Release

ఇప్పటివరకు నగదు బదిలీ ఎందుకు చేయలేకపోయారో పోలింగ్‌ తేదీకి ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటారో వివరించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలని ఈసీ తేల్చిచెప్పింది. ఈ ఐదేళ్లలో బటన్‌ నొక్కిన సమయానికి నిధుల బదిలీకి మధ్య వ్యవధిని కోరింది. 'బటన్‌ నొక్కి చాలా వారాలైంది, ఇవాళే నిధులు జమ చేయకపోతే ఏమవుతుంది' అని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ప్రశ్నించింది.

నిధుల జమకు ఏప్రిల్‌, మే నెలలో కోడ్‌ ఇబ్బంది ఉంటుందని ముందే తెలుసు కదా అని సీఈసీ పేర్కొంది. వారాలపాటు ఆపి పోలింగ్‌ ముందురోజే జమ చేయకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమైందా, ఉంటే వాటి పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించిన ఈసీ నిధుల జమపై హైకోర్టు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదని లేఖలో పేర్కొంది.

HC on AP Schemes Funds Release Issue: మరోవైపు ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ ఇవాళ చేయటంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాలకు కూడా నిధులు విడుదల జరగకూడదని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కొన్ని తీర్పులను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈసీ కూడా ఎన్నికల పోలింగ్ పూర్తయ్యాక జమ చేయాలని చెప్పిందన్నారు. పెన్షన్లు ప్రతి నెలా ఇస్తున్నారు కదా అని న్యాయస్థానం ప్రశ్నించగా పెన్షన్లు వేరని, పథకాలు వేరే అని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎన్నికల సమయంలో నిధులు విడుదల చేస్తున్నారని, ఇది ఎన్నికలపై ప్రభావం పడుతుందని అన్నారు. ఇవాళ నగదు జమ చేయలేమని ప్రభుత్వ తరఫు ఏజీ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇప్పుడు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది.

సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీల్లో నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. ఇదంతా అకాడమిక్ మేటర్ అని తెలిపింది. డివిజన్ బెంచ్‍లో అప్పీల్‍పై తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు హైకోర్టు వాయిదా వేసింది. కాగా పలు పథకాల నగదు జమను నిలువరిస్తూ ఇచ్చిన ఆదేశాలను నేటి వరకు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఈ నెల 11 నుంచి 13 వరకు నగదు జమ చేయవద్దని సింగిల్ జడ్జి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై పలువురు హైకోర్టు డివిజన్ బెంచ్​ను ఆశ్రయించారు.

ఎన్నికలు పూర్తయ్యాకే డబ్బులు- రాష్ట్రంలో పథకాలపై ఈసీ నిర్ణయం - EC on schemes funds release in AP

Last Updated : May 10, 2024, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.