ETV Bharat / state

ఊపందుకున్న కూటమి నేతల ప్రచారాలు- భారీగా తెలుగుదేశంలోకి చేరుతున్న వైఎస్సార్సీపీ నేతలు - Election Campaign Gaining Momentum - ELECTION CAMPAIGN GAINING MOMENTUM

Election Campaign has Gaining Momentum Across the State: రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. కూటమి నేతలు ప్రచారాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. పలుచోట్ల భారీగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి చేరికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అభ్యర్థుల ప్రచారాల్లో ప్రజలు పూలతో స్వాగతం పలుకుతున్నారు.

Election Campaign has Gaining Momentum Across the State

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 7:23 AM IST

ఊపందుకున్న కూటమి నేతల ప్రచారాలు- భారీగా తెలుగుదేశంలోకి చేరుతున్న వైఎస్సార్సీపీ నేతలు

Election Campaign has Gaining Momentum Across the State: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఇంటింటికీ వెళ్లి ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలతో ఆ పార్టీల్లో జోష్‌ నెలకొంది. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఎన్డీయే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు నిర్వహించిన బహిరంగ సభకు విశేష స్పందన లభించింది. ఈశ్వరరావును ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా గెలిపించాలని స్వామి శ్రీనివాసనంద సరస్వతి ప్రజలను కోరారు.

రాష్ట్రాభివృద్ధి కోసం బాబును గెలిపిద్దాం- జోరుగా కూటమి అభ్యర్థుల ఇంటింటి ప్రచారం

పార్వతీపురం జిల్లా పాచిపెంటలో సాలూరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణికి కూటమి నాయకులు పూర్తి మద్దతు తెలియజేశారు. రాజాం టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఎన్నిక ప్రచారంలో భాగంగా జయహో బీసీ సదస్సు నిర్వహించారు. అనంతరం బొద్ద గ్రామంలో ప్రచారం నిర్వహించగా ఆయన సమక్షంలో 20 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీలో చేరాయి.
గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్‌కు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం చేశారు. మేడికొండూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. బాపట్ల జిల్లా పర్చూరులో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్‌ వలపర్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశాన్ని గెలిపించాలని కోరారు. చీరాల మండలం దేవినూతలకు చెందిన వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. చీరాల టీడీపీ అభ్యర్థి ఎం.ఎం కొండయ్య సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రచారంలో దూసుకెళ్తున్న కూటమి నేతలు- టీడీపీలోకి భారీగా చేరికలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు వైసీపీ ఎంపీపీ కేతా వేణుగోపాల్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. వెంకటగిరి నియోజకర్గంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వింజమూరులో ఉదయగిరి ఎన్డీయే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. గెస్ట్‌ హౌస్ నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు.

కర్నూలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్‌ ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో గోనెగండ్లకు చెందిన 30 కుటుంబాలు వైసీపీను వీడి టీడీపీలో చేరాయి. పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గౌరు చరిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓర్వకల్లు మండలం లొద్దిపల్లెకు చెందిన 80 కుటుంబాలు ఆమె సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరాయి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి పర్యటించారు. టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంతో భేటీ అయ్యారు.

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మోదీ, చంద్రబాబును గెలిపించాలి : ఏలూరి సాంబశివరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.