Rs. 30Cr Betting om Ap Election Result 2024 : 2024 సార్వత్రిర ఎన్నికల్లో ఫలితాలు అంచనాలను దాటి ప్రజల్లో సంతోషాన్ని నింపిన విషయం విధితమే. అత్యధిక మెజారిటీతో కూటమి విజయ బావుటా ఎగరవేయగా, మరోసారి వైఎస్సార్సీపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమాతో ఓ వ్యక్తి రూ. 30 కోట్లు బెట్టింగ్ కట్టాడు. చివరకు ఓటమి పాలై బలన్మరణానికి పాల్పడ్డాడు.
Election Betting Leads to Suicide in Nuziveedu : సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని. సుమారు రూ.30 కోట్ల పందెం వేసి తిరిగి చెల్లించ లేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడు. భార్య సర్పంచి. వీరు వైఎస్సార్సీపీ మద్దతుదారులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుందని వేణుగోపాల రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకు పందెం వేశారు. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు ఊరు విడిచి వెళ్లారు. పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో ఇంటికి తిరిగి రాలేదు.
ఉన్నది కాస్తా ఊడింది - సర్వమంగళం పాడింది! - political betting
Betting on Andhra Pradesh General Election : పందెం వేసిన వారు ఫోన్లు చేసినా స్పందించకపోవడం, గ్రామంలో లేకపోవడంతో ఈ నెల 7న పందెం వేసినవారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తదితర వస్తువులు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆదివారం పొలం వద్ద పురుగు మందు తాగారు. మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా తన భర్త మానసికంగా ఇబ్బంది పడుతున్నారని మృతిడి భార్య తెలిపింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నట్లు మృతుడి భార్య విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.