ETV Bharat / state

తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్‌ ర్యాంకుల్లో బాలుర సత్తా - TS EAPCET Results 2024 - TS EAPCET RESULTS 2024

TS EAPCET Results 2024 : హైదరాబాద్‌లో ఈఏపీ సెట్‌ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.98 శాతం మంది, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఇంజినీరింగ్‌ ర్యాంకుల్లో బాలురు సత్తా చాటారని, తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకున్నారని ఆయన చెప్పారు.

ts_eapcet_results_2024
ts_eapcet_results_2024 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 2:33 PM IST

Telangana EAPCET Results 2024 : తెలంగాణ ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్​లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. గతంలో ఎంసెట్ నిర్వహించేవాళ్లమని, మొదటిసారి ఈఏపీ సెట్ పేరుతో పరీక్ష నిర్వహించామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ పరీక్షకు 3,32,251 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు 91,633 మంది, ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది పరీక్ష రాశారని చెప్పారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌లో 74.98 శాతం , అగ్రికల్చర్‌, ఫార్మసీలో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.

ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దు : ఈఏపీ సెట్‌కు గత పదిసంత్సరాల్లో లేనతంగా విద్యార్థులు ఈసారి దరఖాస్తు చేసుకున్నారని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. గతంలో ఒక్కో షిఫ్ట్‌లో 25,000ల మంది మాత్రమే పరీక్ష రాసేవారని, కానీ ఇప్పుడు ఒక్కో షిఫ్ట్‌లో 50,000ల మంది పరీక్ష రాసినట్లు వివరించారు. ఫలితాలను చూసి విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఇంజినీరింగ్‌లో తొలి పది ర్యాంకుల్లో తొమ్మిదింటిని బాలురు కైవసం చేసుకున్నారని అన్నారు. ఇందులో మొదటి రెండు ర్యాంకులు ఏపీ విద్యార్థులకు వచ్చాయని బుర్రా వెంకటేశం వెల్లడించారు.

ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంకర్లు వీళ్లే :

  • మొదటి ర్యాంకు ఎస్‌.జ్యోతిరాదిత్య(శ్రీకాకుళం-పాలకొండ)
  • రెండో ర్యాంకు గొల్లలేఖ హర్ష(కర్నూలు-పంచలింగాల)
  • మూడో ర్యాంకు రిషి శేఖర్‌శుక్లా(సికింద్రాబాద్‌-తిరుమలగిరి)
  • నాలుగో ర్యాంకు భోగలపల్లి సందేశ్‌(హైదరాబాద్‌-మాదాపూర్‌)
  • ఐదో ర్యాంకు మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి(కర్నూలు)
  • ఆరో ర్యాంకు పుట్టి కుశల్‌కుమార్‌(అనంతపురం-ఆర్కేనగర్‌)
  • ఏడో ర్యాంకు హుండికర్ విదీత్‌(హైదరాబాద్‌-పుప్పాలగూడ)
  • ఎనిమిదో ర్యాంకు రోహన్‌(హైదరాబాద్‌-ఎల్లారెడ్డిగూడ)
  • తొమ్మిదో ర్యాంకు కొంతేమ్ మణితేజ(వరంగల్‌-ఘన్‌పూర్‌)
  • పదో ర్యాంకు ధనుకొండ శ్రీనిధి(విజయనగరం)

అగ్రికల్చర్‌, ఫార్మసీలో టాప్ టెన్ ర్యాంకర్లు వీళ్లే :

  • మొదటి ర్యాంకు ఆలూరు ప్రణీత(మదనపల్లె)
  • రెండో ర్యాంకు నాగుదాసరి రాధాకృష్ణ(విజయనగరం)
  • మూడో ర్యాంకు గడ్డం శ్రీవర్షిణి(హనుమకొండ)
  • నాలుగో ర్యాంకు సోంపల్లి సాకేత్‌ రాఘవ్‌(చిత్తూరు)
  • ఐదో ర్యాంకు రేపాల సాయి వివేక్‌(హైదరాబాద్‌-ఆసిఫ్‌నగర్‌)
  • ఆరో ర్యాంకు మహమ్మద్‌ అజాన్‌సాద్(హైదరాబాద్‌-నాచారం)
  • ఏడో ర్యాంకు వడ్లపూడి ముకేష్‌ చౌదరి(తిరుపతి-వెంగమాంబపురం)
  • ఎనిమిదో ర్యాంకు జెన్నీ భార్గవ్‌ సుమంత్‌(హైదరాబాద్‌-పేట్‌ బషీరాబాద్‌)
  • తొమ్మిదో ర్యాంకు జయశెట్టి ఆదిత్య(హైదరాబాద్‌-అల్విన్‌కాలనీ)
  • పదో ర్యాంకు పూల దివ్యతేజ(శ్రీసత్యసాయి జిల్లా-బలిజపేట)

Telangana EAMCET Results 2024 : రాష్ట్రం నుంచి ఉత్తీర్ణత సాధించిన అందరికీ ఇంజినీరింగ్‌ విభాగంలో సీట్లు వస్తాయని బుర్రావెంకటేశం తెలిపారు. వారం రోజుల్లోనే అడ్మిషన్ షెడ్యూల్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌ వేరిఫికేషన్ ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలతో సమర్ధంగా పనిచేసిన అధికారుల్ని బుర్రా వెంకటేశం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల- ర్యాంక్ కార్డ్​ చెక్​ చేసుకోండిలా - AP POLYCET RESULTS

బిగ్​ అప్​డేట్​ - అతి త్వరలో CBSE ఫలితాలు - ఇలా చెక్​ చేసుకోండి! - CBSE Results 2024 date

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.