ED Case Against Operation Mobility Organization : విద్యార్థులకు ఉచిత విద్య, ఆహారం అందిస్తున్నామని విదేశాల నుంచి సేకరించిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఆపరేషన్ మొబిలిటీ సంస్థపై ఈడీ మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా ఈనెల 21,22 తేదీల్లో హైదరాబాద్లోని ప్రధాన కార్యాలయం సహా 11 చోట్ల సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు ఆస్తుల డాక్యుమెంట్లు, బినామీ కంపెనీల లావాదేవీలు, డిజిటల్ పరికరాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
ఓమ్ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి రూ.300 కోట్ల మేర నిధులు సేకరించినట్లు గతంలో సీఐడీ గుర్తించింది. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జంటీనా, డెన్మార్క్, జర్మనీ, బ్రెజిల్, ఫిన్ లాండ్, ఐర్లాండ్, మలేషియా, రుమేనియా, సింగపూర్, నార్వే సహా మొత్తం 16 దేశాల నుంచి విరాళాలు సేకరించినట్లు గుర్తించింది. వారు సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న దళితులు, అనాధ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని తెలిపి ఆ సంస్థ విరాళాలు సేకరించింది.
ఆ పాఠశాలల్లో ఉచిత విద్య, ఆహారం సహా ఇతర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి విరాళాలు సేకరించారని సీఐడీ అంది. అయితే వీటిని కాగా కేసులో ఈడీ దర్యాప్తులో భాగంగా కీలక సమాచారాన్ని సేకరించింది. నిధులను, విరాళాలను పక్కదారి పట్టించి పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ట్యూషన్ ఫీజు సహా ఇతర ఫీజులు కింద రూ.1000 నుంచి రూ.1500 వసూలు చేసి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లు కోసం వాడుకున్నట్లు ఈడీ తెలిపింది. దీంతో పాటు విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం నుంచి పాఠశాలలకు నిధులు తీసుకున్నట్లు గుర్తించింది. పలు డొల్ల కంపెనీలు సృష్టించి వాటిపై రుణాలు తీసుకున్నట్లు పేర్కొంది. దీంతో పాటు గోవాలోని కార్యాలయం లేకుండానే జీతాలు చెల్లిస్తున్నట్లు రికార్డులు సృష్టించారంది. విరాళాల ద్వారా ఓమ్ సంస్థ తెలంగాణ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలలో ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.
ఇంట్లో మరిచిపోయిన ల్యాప్టాప్ తీసుకొచ్చేందుకు ర్యాపిడో బుక్ చేస్తే - డ్రైవర్ భలే షాకిచ్చాడుగా?