ETV Bharat / state

పథకాల నిధులు పోలింగ్‌ తర్వాతే - స్పష్టం చేసిన ఈసీ - EC On Schemes Funds Release

EC Questioned State Govt on Deposit of Scheme Funds: ఎన్నికల కోడ్ కంటే ముందే పథకాల కోసం బటన్ నొక్కినా నిధుల జమ ఎందుకు ఆలస్యమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది. ఎన్నికల తర్వాతే సంక్షేమ పథకాల నగదును జమ చేయాలని ఆదేశించింది. పోలింగ్‌కు 2 రోజుల ముందు జమ చేస్తే కోడ్ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. మే 13 తర్వాత వీటిని లబ్ధిదారులకు జారీ చేసేలా మార్గదర్శకాలు ఇస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

ec_on_schemes_funds
ec_on_schemes_funds (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 9, 2024, 7:48 PM IST

EC Questioned State Govt on Deposit of Scheme Funds: పోలింగ్ తేదీకి ముందు సంక్షేమ పథకాల డబ్బు జమ చేయాలన్న వైసీపీ కుట్రలకు ఈసీ (Election Commission) అడ్డుకట్ట వేసింది. పోలింగ్‌కు ముందు లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు వేసి ఓటర్లకు ఎర వేయాలని జగన్ కుయుక్తులు పన్నారు. అయితే దీన్ని తిప్పికొట్టేలా డీబీటీ పథకాల అమలుపై ఎన్నికల సంఘం కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు పథకాలకు సంబంధించి నిధుల విడుదల పోలింగ్‌కు ముందు జరగకుండా నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ముగిసే వరకు లబ్ధిదారులకు పథకాల సొమ్మును జమ చేయొద్దంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్ద సీబీఐ - ముగిసిన వాదనలు - CM Jagan Foreign Tour Petition

వాస్తవానికి ఎన్నికల కోడ్ కంటే ముందే వివిధ పథకాల కోసం ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కారు. మొత్తంగా ఆరు పథకాలకు సంబంధించి 14 వేల 165 కోట్ల రూపాయలను ఎన్నికల కోడ్‌కు ముందే బటన్ నొక్కారని ఈసీ పేర్కొంది. ఆరు పథకాలకు ఎప్పుడెప్పుడు బటన్ నొక్కారనే అంశంపై జాబితా విడుదల చేసింది. 'ఆసరా' ద్వారా 6వేల 394 కోట్ల జమకు జనవరి 23న జగన్ బటన్ నొక్కినట్లు జాబితాలో వెల్లడించింది. 'కల్యాణమస్తు' ద్వారా రూ 78.5 కోట్ల జమకు ఫిబ్రవరి 28న, 'విద్యా దీవెన' ద్వారా 708 కోట్ల జమకు మార్చి 1న బటన్ నొక్కినట్లు ఈసీ తెలిపింది. ఇన్ పుట్ సబ్సిడీ కింద 1294 కోట్ల జమకు మార్చి 6న, 'చేయూత' ద్వారా 5 వేల 60 కోట్లకు జమకు మార్చి 7న, 'ఈబీసీ నేస్తం' ద్వారా 629 కోట్ల రూపాయల జమకు మార్చి 14న జగన్ బటన్ నొక్కినట్లు ఈసీ వివరించింది.

పథకాల నిధులు పోలింగ్‌ తర్వాతే - స్పష్టం చేసిన ఈసీ (Etv Bharat)

జగన్‌ మీ బిడ్డ కాదు- రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్‌ గడ్డ: చంద్రబాబు - CHANDRABABU fire on JAGAN

ఎన్నికల కోడ్ రాకముందే బటన్ నొక్కి విడుదల చేసిన ఈ పథకాలకు నిధులు జమ కాకపోవటంపై ఈసీ విస్మయం వ్యక్తం చేసింది. బ్యాంకు ఖాతాల ద్వారా జమ చేసే డీబీటీ నిధులు కూడా 48 గంటల్లోగా లబ్ధిదారులకు వెళ్లకపోవడానికి గల జాప్యంపై శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశాల్లో పేర్కొంది. ప్రచారం పూర్తయిన తర్వాత పోలింగ్ ముందు 11, 12 తేదీల్లో నిధులు విడుదలయ్యేలా ప్రయత్నాలు జరిగాయన్న సమాచారం తమకు ఉందని ఈసీ పేర్కొంది. అది ముమ్మాటికీ కోడ్ ఉల్లంఘనేనని (Violation of Election Code) ఈసీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే ఎన్నికలు పూర్తయ్యాకే లబ్ధిదారులకు నగదు జమ చేయాలని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో ఎన్నికల సంఘం పనిచేస్తుందా!- ఓట్లు వేయించే వాళ్ల ఓట్లే గల్లంతయితే ఎలా?: నిమ్మగడ్డ - Nimmagadda Ramesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.