ETV Bharat / state

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు వద్దు: ఈసీ - EC Orders TO Petrol Bunks IN AP - EC ORDERS TO PETROL BUNKS IN AP

EC Orders on Petrol Bunks No Loose Sale: రాష్ట్రంలోని ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు జరపకూడదని పెట్రోలు బంకు నిర్వాహకులకు ఈసీ ఆదేశించింది. జూన్‌ 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేస్తూ అందుకోసం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

EC_Orders_on_Petrol_Bunks_No_Loose_Sale
EC_Orders_on_Petrol_Bunks_No_Loose_Sale (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 18, 2024, 10:32 PM IST

EC Orders on Petrol Bunks No Loose Sale: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేంత వరకు రాష్ట్రంలోని బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. జూన్‌ 10వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు పౌరసరఫరాల శాఖ, పోలీసు అధికారులకు, రాష్ట్రంలోని పెట్రోలు బంక్ యజమానులకు నోటీసులు పంపారు.

కేవలం వాహనాలకు మాత్రమే పెట్రోల్, డీజిల్‌ సరఫరా చేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కంటైనర్లు, సీసాలు, డ్రమ్ములు, ఎలాంటి పాత్రలకు విడిగా పెట్రోలు, డీజిల్‌ సరఫరా చేయడం లైసెన్సు నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఫ్లయిండ్‌ స్క్వాడ్‌ బృందాలతో బంకులపై నిఘా ఉంచాలని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తే పెట్రోలు బంక్ లైసెన్సు రద్దు కోసం సిఫార్సు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

ఉపాధికల్పన శాఖ జేడీ నివాసంపై పెట్రోల్ సీసాలు విసిరిన దుండగులు - Petrol Attack On Chaitanya House

పెట్రోలు, డీజిల్​ను సీసాలు, క్యాన్లలో పోయెద్దని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని ఏపీ పెట్రోలు బంకుల యజమానులు స్వాగతించారు. అయితే నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డీజిల్​ను క్యాన్లలో ఇవ్వకపోతే వ్యవసాయ ట్రాక్టర్లు, జనరేటర్లకు ఇబ్బందులు వస్తాయన్నారు. ద్విచక్ర వాహనం ఎక్కడైనా ఆగిపోతే వాహనదారుడు పెట్రోల్ కోసం బాటిల్‌ తీసుకువస్తారని అలాంటి సందర్భాల్లో గొడవలు తలెత్తే అవకాశం ఉందన్నారు.

మరోవైపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు విజయవాడలోని పలు పెట్రోలు బంకుల వద్ద ప్రత్యేకంగా నోటీసులు అంటించారు. విడిగా పెట్రోల్, డీజల్‌ అమ్మకాలు చేయబోమని బంకుల్లో పనిచేస్తోన్న సిబ్బంది చెబుతుండడంతో కొందరు ఆకతాయిలు ఎదురు తిరుగుతున్నారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో రాఘవయ్యపార్కు సమీపంలోని ఐఓసీ బంకు వద్ద బ్లేడ్‌బ్యాచ్‌కు చెందిన కొందరు విడి పెట్రోలు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంకు సిబ్బందిపై దుర్భాషలాడారు. రాత్రి వేళ బంకుపై పెట్రోలు పోసి తగులబెడితే ఎవరు అడ్డుకుంటారంటూ ఆ వ్యక్తి మాట్లాడడంపై బంక్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసాలో పెట్రోలు కోసం వచ్చిన వ్యక్తి కదలికలు అన్నీ సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో ఆ దృశ్యాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.

నాటు బాంబులు, పెట్రోల్ సీసాల దాడులతో రక్తసిక్తమైన పల్నాడు - YSRCP attacks in Palnadu

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.