ETV Bharat / state

బదిలీ చేసిన అధికారుల స్థానాల్లో కొత్త నియామకాలు - జాబితా విడుదల - EC appointed new Collectors and SPs

EC Appointed New Collectors and SPs in AP : ఎన్నికల ప్రక్రియలో నిర్లక్ష్యంతో పాటు అధికార వైఎస్సార్సీపీకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా వారి స్థానంలో కొత్త నియమకాలు చేపట్టింది. పోస్టింగ్ వచ్చిన అధికారులంతా గురవారం రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని ఈసీ ఆదేశించింది.

EC_appointed_new_Collectors-and_SPs_in_ap

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 4:43 PM IST

Updated : Apr 4, 2024, 10:49 PM IST

EC Appointed New Collectors and SPs in AP : అధికార పార్టీ వైసీపీతో అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో బదిలీ వేటు పడిన కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన మొత్తం 9 మంది అధికారుల ప్యానల్ నుంచి కృష్ణా జిల్లా కలెక్టర్ గా డీకే బాలాజిని నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్ గా వి. వినోద్ కుమార్ ను ,తిరుపతి కలెక్టగా ప్రవీణ్ కుమార్ లను నియమించారు. ఇక గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ణ త్రిపాఠిని, ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ ను నియమించారు. పలనాడు ఎస్పీగా బిందుమాధవ్ గైకిపాటి, చిత్తూరు ఎస్పీగా వీఎన్ మణికంఠ, అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్, నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ లను నియమించారు. పోస్టింగ్ వచ్చిన అధికారులంతా ఈరోజు రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి : గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ట త్రిపాఠి విధులు నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు ఐజీ పాలరాజుపై వేటు వేయగా ఆయన స్థానంలో నూతన ఐజీగా సర్వశ్రేష్ణ త్రిపాఠికి బాధ్యతలు అప్పగించారు. ఎస్పీ తుషార్ డూడి, ఏఆర్ ఆడిషినల్ ఎస్పీ హనుమంతు, పలువురు జిల్లా అధికారులు ఐజీని గౌరవ పూర్వకంగా కలిశారు.

అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ : ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా అమిత్ బర్దార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల మేరకు జిల్లాలో సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి పెడతాం. జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎన్నికల నిబంధనలను ఎవరైన అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాని అమిత్ బర్దార్ హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ : ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా గరుడ్ సుమిత్ సునీల్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల వేళ అధికార పార్టీకి ఏకపక్షంగా పని చేస్తున్నారన్న ఆరోపణలతో ఇటీవల వరకు పనిచేసిన ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని 50 రోజులకే బదిలీ చేశారు. ఆయన స్థానంలో నూతనంగా సుమిత్ సునీల్​ను నియమితులయ్యారు. ఈరోజు సాయంత్రం ఉత్తర్వులు విడుదలైన వెంటనే హుటాహుటిన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ఆదేశాల అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని తెలిపారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.

Last Updated : Apr 4, 2024, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.