ETV Bharat / state

అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్

రాష్ట్రంలో శాంతిభద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు - అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటానని వెల్లడి

pawan_kalyan_sensation_comments
pawan_kalyan_sensation_comments (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 2:30 PM IST

Updated : Nov 4, 2024, 5:43 PM IST

Pawan Kalyan Comments on Law and Order: శాంతిభద్రతలు అదుపులో లేకపోతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. ఇళ్లలోకి వెళ్లి మహిళపై అత్యాచారం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ హైస్కూల్‌లో సైన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంకా అధికారులు వైఎస్సార్​సీపీలో వ్యవహరిస్తున్నట్లే ఇప్పుడూ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్​సీపీలో మాదిరిగా ప్రవర్తిస్తే నేను ఊరుకునేవాణ్ని కాదని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

అఘాయిత్యాలు ఇంకా కొనసాగితే నేనే హోంమంత్రి అవుతా - పోలీసులు ఏం చేస్తున్నారు? : పవన్ కల్యాణ్ (ETV Bharat)

నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉంటుంది: అవసరమైతే హోంమంత్రి పదవి కూడా తీసుకుంటానని నేను హోంమంత్రి అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి ఎమ్మెల్యే నిజాయతీతో ఉండాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో హోంమంత్రి అనిత మరింత చురుగ్గా వ్యవహరించాలని అన్నారు. వైఎస్సార్​సీపీ పాలనలో ఆడబిడ్డలపై జరిగిన అఘాయిత్యాలు ఇప్పుడూ కొనసాగుతున్నాయని అన్నారు. అలానే డీజీపీ, పోలీసు అధికారులు తీరు మార్చుకోవాలని అన్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టే ఆ పరిణామాలు ఇప్పుడు చూస్తున్నామని వ్యాఖ్యానించారు.

శాంతిభద్రతలపై అధికారులకు అలవాటు తప్పింది: గత ఐదేళ్లలో 30 వేలమంది ఆడపిల్లలు అదృశ్యమైతే అప్పటి సీఎం జగన్ కనీసం మాట్లడలేదని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులెలా వారసత్వంగా వస్తాయో గత ప్రభుత్వ తప్పిదాలు, నేరాలు కూడా అలానే వచ్చాయని అన్నారు. శాంతిభద్రతలను బలంగా అమలు చేయాలని పదేపదే చెప్పానని కాని శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు అలవాటు తప్పిందని పవన్‌ వివరించారు. గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు నియంత్రణ లేకుండా వ్యవహరించారని ఆరోపించారు. ఇవాళ ధర్మబద్ధంగా చేయండని ప్రాధేయపడుతున్నా మీనమేషాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. పోలీసు అధికారులు దేనికి మీనమేషాలు లెక్కపెడుతున్నారో అర్థం కావట్లేదని తెలిపారు.

చంద్రబాబుకు ముద్దు పెట్టబోయిన మహిళ- అడ్డుకున్న సెక్యూరిటీ

అత్యాచారాలు చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా: క్రిమినల్‌కు కులం, మతం ఉండవని ఈ విషయం పోలీసు అధికారులకు ఎన్నిసార్లు చెప్పాలని పవన్‌ అన్నారు. ఒకర్ని అరెస్టు చేయాలంటే కులం సమస్య వస్తుందని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. మూడేళ్ల ఆడబిడ్డను అత్యాచారం చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా అని ఆగ్రహించారు. పోలీసు అధికారులు చదువుకుంది ఐపీఎస్‌ కాదా ఇండియన్‌ పీనల్‌ కోడ్ మీకు ఏం చెబుతోంది, భారతీయ శిక్షాస్మృతి ఏం చెబుతోందని ప్రశ్నించారు. క్రిమినల్స్‌ను వెనకేసురావాలని శిక్షాస్మృతి చెబుతుందా అని అన్నారు. ఇళ్లలోకి వచ్చి రేప్‌ చేస్తామని అని సోషల్‌ మీడియాలో అంటుంటే భావప్రకటనా స్వేచ్ఛ అని వైఎస్సార్​సీపీ అంటోందని మండిపడ్డారు.

అధికారులు పదేపదే చెప్పించుకోవద్దు: ఈ ప్రభుత్వానికి సహనం ఎంత ఉందో తెగింపు కూడా అంతే ఉందని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం పాటిస్తున్నామని వివరించారు. ప్రజల ఆవేదనను డీజీపీ, ఇంటెలిజెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకొస్తున్నానని శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైందని ఎస్పీలు, కలెక్టర్లకు కూడా చెబుతున్నాని పవన్‌ అన్నారు. ఉన్నతాధికారులు పదేపదే మాతో చెప్పించుకోవద్దని హెచ్చిరించారు. తప్పులు చేసిన వారిని నా బంధువు, నా రక్తమని ఎవరైనా చెబితే మడతపెట్టి కొట్టండని అన్నారు. హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని సూచించారు. నేను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్నారు. మమ్మల్ని విమర్శించే నాయకులందరికీ చెబుతున్నా ఇలాగే ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉండండి హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

చిన్నారుల మరణాలను రాజకీయంగా వాడుకునే రాబందులు ఉన్నారు : మంత్రి అనిత

"ఆ ఉపాధ్యాయురాలికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశాం- నీకూ అదే గతి పడుతుంది" - మాజీ మంత్రిపై మహిళ ఫిర్యాదు

Last Updated : Nov 4, 2024, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.