DSC Candidates Agitations Against CM Jagan : ఉపాధ్యాయ ఖాళీలను భర్తీచేసేందుకు 6,100 పోస్టులకు రాష్ట్రమంత్రివర్గం తీర్మానం చేయడంపై డీఎస్సీ అభ్యర్థులు భగ్గుమన్నారు. ప్రతిపక్షనేత జగన్ ఊరూవాడా తిరుగుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి తీరా ఐదేళ్ల తర్వాత 6వేల పోస్టులు భర్తీ చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP DSC Notification 2024 : కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు వందలాదిగా రోడ్డెక్కారు. బస్టాండ్ సెంటరులో ఆందోళన, మానవహారం చేపట్టారు. మెగా డీఎస్సీ విడుదల చేయకుండా సీఎం జగన్ మోసం చేశారని, డౌన్ డౌన్ సీఎం అంటూ నినాదాలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో ఊరు వాడ తిరిగి 25 వేల పోస్టులు ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మేగా డీఎస్సీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులను దగా చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మేగా డీఎస్సీ ఇవ్వకపోతే వైఎస్సార్సీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Unemployed Youth in AP : నిరుద్యోగులు జగన్ పాలనలో మోసపోయారని అన్నారు. ప్రభుత్వం తక్షణం నిర్ణయం మార్చుకుని నెలరోజుల్లో 25వేల పోస్టులతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకపోతే, రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామన్నారు. ఒక్క డీఎస్సీ అభ్యర్థులే 7 లక్షల మంది ఉన్నారని మొత్తం నిరుద్యోగులు 20 లక్షలకు పైగానే ఉంటారని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీకి తిలోదకాలు - ఎన్నికల గుమ్మంలో మినీ డీఎస్సీతో 'జగన్నాటకాలు'!
CM Jagan Cheating Unemployed : ముఖ్యమంత్రి జగన్ మాటలు నమ్మి ఐదేళ్లుగా అవనిగడ్డలోనే కోచింగ్ తీసుకుంటున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో కోచింగ్ కోసం వచ్చిన ఒక్కో విద్యార్ధి కోచింగ్ కోసం 15 వేలు, రూమ్ అద్దె, ఇతర ఖర్చుల నిమిత్తం ప్రతి నెల 5 వేలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. డబ్బులు లేక రోజువారీ కూలి పనులకు, కిరాణా దుకాణాల్లో పనికి వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాటలు నమ్మి పూర్తిగా మోసపోయామన్న నిరుద్యోగులు ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామన్నారు.
మెగా డీఎస్సీకి మంత్రి వర్గం ఆమోదం - కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి చెల్లుబోయిన
AP TET 2024 : ప్రస్తుతం అవనిగడ్డలో సుమారు 2 వేల మంది కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధులు ఉన్నారు. కోచింగ్ కోసం వచ్చి అయిదు సంవత్సరాల నుండి కూడా అవనిగడ్డలోనే నివాసం ఉంటూ నాలుగు లక్షలు పైగా ఖర్చు చేసామని, ఆర్ధిక పరిస్థితి లేని విద్యార్ధులు రోజువారి కూలిపనులకు, కిరాణా షాపుల్లో పనులు చేసుకుంటున్నామని అన్నారు. అటు ఇంటికి వెళ్ళలేక ఆర్ధిక ఇబ్బందులు వల్ల ఇక్కడ ఉండలేక అనేక కష్టాలు పడుతున్నామని, జగన్ మాట నమ్మి మోసపోయామని, ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మెగా డీఎస్సీ ఇచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
25 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలి - 'మేం మోసపోయాం' అంటూ నిరుద్యోగుల ఆందోళన