ETV Bharat / state

హిట్ అండ్ రన్​పై ఆందోళనలు - రద్దు చేయాలంటూ డ్రైవర్ల నిరసనలు - జీవో 106 పై డ్రైవర్ల వ్యతిరేకత

Drivers Protests against Bharatiya Nyaya Sanhita in Andhra Pradesh : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 106 ను రద్దు చేయాలంటూ కర్నూలులో డైవర్స్ అసోసియేషన్ జాతీయ రహదారిపై నిరసన తెలిపింది కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ జిఓ 106 చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ శివార్లలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో ఎదుట డ్రైవర్లు నిరసన తెలిపారు.

drivers_protests_against_bharatiya_nyaya_sanhita_in_andhra_pradesh

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 5:50 PM IST

హిట్ అండ్ రన్​పై ఆందోళనలు - రద్దు చేయాలంటూ డ్రైవర్ల నిరసనలు

Drivers Protests Against Bharatiya Nyaya Sanhita in Andhra Pradesh : కేెంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 106 పై దేశవ్యాప్తంగా డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా లారీల బంద్ బంద్​ చేపట్టారు. రాష్ట్రంలోనూ లారీ డ్రైవర్లు నిరసన బాట పడ్డారు. డ్రైవర్స్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో రహదారులపై ఆందోళనలకు దిగారు. దీనివల్ల పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఎదురైంది.

పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద ఆరో రోజు లారీ డ్రైవర్ల ఆందోళన

Drivers Protest in Kurnool District : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 106 ను రద్దు చేయాలంటూ కర్నూలులో (Kurnoo) డ్రైవర్స్ అసోసియేషన్ జాతీయ రహదారిపై నిరసన తెలిపింది. డ్రైవర్ల ఆందోళనతో (Strike) రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రోడ్డు ప్రమాదం జరిగితే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు 7 నుంచి 10 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ కేంద్ర చట్టం తీసుకురావంపై డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చట్ట వ్యతిరేకంగా జీవోలను తీసుకువస్తే దానికి సీఎం జగన్ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోనూ IOC డిపో ఎదుట ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ల నిరసనలు తెలిపారు. కేంద్రం తెచ్చిన చట్టంతో డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కడపలో చెత్త కష్టాలు.. కనీసవేతన డిమాండ్ తో విధులు బహిష్కరిస్తోన్న క్లాప్ డ్రైవర్లు

Drivers Protest in Anantapur District : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ (Hit And Run) జీఓ 106 చట్టం డ్రైవర్లకు శాపంగా మారిందని వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా (Anantapur) గుంతకల్లు పట్టణ శివార్లలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపో ఎదుట డ్రైవర్లు నిరసన (Drivers Protest) తెలిపారు. ఈ సందర్భంగా డ్రైవర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత 106-2 హిట్ అండ్ రన్ అనే చట్టాన్ని తీసుకొచ్చి డ్రైవర్లు రోడ్డు ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ డ్రైవరు ఉద్దేశ పూర్వకంగా ప్రమాదం చేయాలని ఆలోచించడని, అనుకోకుండా జరిగే ప్రమాదాలకు 10 ఏళ్లు జైలు, 7 లక్షల రూపాయలు నగదు విధించేలా ఆ చట్టం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టీరింగ్ డౌన్ పేరిట డ్రైవర్లు వాహనాలు నడపకుండా బంద్ చేస్తున్నామన్నారు.

జీవో నెం.21 రద్దు చేయాలని విశాఖలో ఆటో డ్రైవర్ల నిరసన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.