ETV Bharat / state

ఎండలు మండుతున్న వేళ గ్రామాల గొంతెండుతోంది! పట్టించుకోని అధికారులు - Drinking Water Problems in Prakasam

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 1, 2024, 8:21 AM IST

Drinking Water Problems in Prakasam District : ఓ వైపు ఎండలు మండిపోతుంటే రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు కనీసం తాగునీరు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొంతెండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా ప్రజల దాహం కేకలు రోజురోజు తీవ్రంగా మారుతున్నాయి.

drinking_water_problems_in_prakasam
drinking_water_problems_in_prakasam (ETV Bharat)
నిప్పులు చెరిగే ఎండల్లోనూ తాగునీరు కరవే- గ్రామాల్లో గొంతెండుతోంది (ETV Bharat)

Drinking Water Problems in Prakasam District : ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. సాగర్‌ నుంచి నీటి పంపిణీ సక్రమంగా జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వారం, పదిరోజులకోసారి అరకొరగా సరఫరా చేస్తున్న నీరు ఏ మూలకు చాలడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Water Scarcity in Kanigiri People Facing Problems : ప్రకాశం జిల్లాలోని కనిగిరి , మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో దాహం కేకలు ఆగడం లేదు. సాగర్‌ నుంచి కాలువల ద్వారా గ్రామాల్లో చెరువులకు నీటిని మళ్లించి, ఆ నీటిని కొళాయిలు ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలి. సాగర్‌ కాలువలు లేని చోట్ల డీప్‌ బోర్లు వేసి నీటిని సరఫరా చేయాలి. ప్రస్తుతానికి పశ్చిమ ప్రకాశంలో ఈ రెండు విధానాలు సక్రమంగా అమలుకాకపోవడంతో ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు.

No Sufficient Drinking Water facility in AP : కనిగిరి నియోజకవర్గంలో సాగర్‌ కాలువలకు నీటి పంపిణీ సక్రమంగా జరగడంలేదు. ఫలితంగా గ్రామాల్లో కొళాయిలకు వారానికో, పదిరోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చేతులెత్తేశారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీటి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. సరిపడా నీరు లేకపోవడంతో పాడిరైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయి.

అసలే ఎండాకాలం, ఆపై నీటికొరత - మన్యం జిల్లాలో గిరిజనుల దాహం కేకలు - Tribals Drinking Water Problem

కనీసం ఎండల తీవ్రత చూసైనా తాగునీరు అందించలేరా? అని బాధిత ప్రజలు వాపోతున్నారు. రాష్ట్రంలో ఓ వైపు కలుషిత నీరు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరో వైపు గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు దొరకక అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు చీమకునట్టైనా లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కనిగిరి ప్రజలు, ప్రకాశం జిల్లా వాసులు కోరుతున్నారు.

పైపులైన్లు వేసి ఓట్లు వేయించుకున్నారు- ఎన్నికలయ్యాక గొంతెండుతున్న గుంటూరు శివారు - DRINKING WATER CRISIS

రాష్ట్రంలో దాహం కేకలు - తాగునీటి కోసం మారణాయుధాలతో కొట్టుకున్న టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయులు - Water problems in andhra pradesh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.