ETV Bharat / state

ఏడాదిన్నర క్రితం హత్య- మందు బాటిల్​ సాక్ష్యం- రెండు కేసుల్లో నిందితుడు ఒకరే - MURDER CASE CLUE

హైదరాబాద్​లో కందుకూరు ఫామ్​ హౌస్​లో జరిగిన వృద్ద దంపతుల హత్య కేసు చేధించిన పోలీసులు. నిందితుడే మరో హత్యకు కారకుడని నిరూపించిన వేలిముద్రలు

double_murder_case_on_old_couple_murder_suspect_hyderabad
double_murder_case_on_old_couple_murder_suspect_hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 21, 2024, 12:52 PM IST

Double Murder Case on Old Couple Murder Suspect Hyderabad : పీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజారెడ్డి(42) భర్త కృష్ణారెడ్డి, ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లా కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలోని అరుణ ఫాం హౌస్‌లో పనికి కుదిరారు. 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా ఇంట్లో శైలజారెడ్డి ఒక్కరే ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్‌ ఫాంహౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయాబోయాడు. ఈ క్రమంలో శైలజా ఎదురు తిరిగింది. దీంతో అతడు కత్తితో ఆ మహిళను నరికి చంపాడు.

Police Solved the Case of Brutal Murder of an Elderly Couple : తర్వాత పక్కనే మద్యం సీసా కనిపించగా తాగేందుకు ప్రయత్నించాడు. సీసా చేజారి కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడ నుంచి పరారయ్యాడు. వేలిముద్రలు మినహా ఘటనా స్థలిలో ఎలాంటి ఆధారాలు లభ్యమవ్వలేదు. ఎప్పటికైనా నిందితుడు చిక్కుతాడనే ఉద్దేశంతో పోలీసులు మద్యం సీసా మీద వేలిముద్రలు భద్రపరిచారు. తాజాగా కొత్తగూడ మామిడితోటలో వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమార్‌ నిందితుడని పోలీసులు సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్టు చేశారు. ఇక్కడ సేకరించిన వేలిముద్రల్ని శైలజారెడ్డి హత్య కేసులో నమోదైన వాటిని రెండింటినీ రాచకొండ ఫింగర్‌ ప్రింట్‌ యూనిట్‌తో పోల్చగా సరిపోలాయి. దీంతో పోలీసులు రెండు కేసుల్లోనూ శివకుమార్​ను నిందితుడిగా చేర్చారు.

హైదరాబాద్​లో వృద్ధ దంపతుల దారుణహత్య - నగల కోసమేనా ?

వృద్ద దంపతుల హత్య : నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్ఠిపల్లికి చెందిన మూగ (చింతబాయి) ఉషయ్య (70), అతడి భార్య శాంతమ్మ(60) కొత్తగూడ సమీపంలో వారి స్వగ్రామానికి చెందిన యజమాని మనోహర్‌రావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలాదారులుగా పనిచేస్తున్నారు. మామిడి తోటలో ఓ పక్కన షెడ్లతోపాటు నిర్మించిన గదుల్లో నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపిన ఘటన విదితమే. శాంతమ్మను ఇంట్లోనే మంచంపై గొంతు కోసి హత్య చేశారు. ఉషయ్యను వారు నివాసం ఉంటున్న వంద మీటర్ల దూరంలో మామిడి తోటతో పరుగెత్తించి మెడభాగంపై నరికి చంపారు.

కోతి చేష్టలకు వృద్ధ దంపతులు బలి - అసలేం జరిగిందంటే? - A Couple Died Due To Monkey

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.