ETV Bharat / state

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF - HUGE DONATIONS TO CMRF

Donations from People to Help Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలు, ప్రముఖులు, ఎన్నారైల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. విజయవాడ కలెక్టరేట్​లో సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేస్తున్నారు. దాతలకు సీఎం అభినందనలు తెలిపారు.

huge_donations_to_cmrf
huge_donations_to_cmrf (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 7:49 PM IST

Updated : Sep 9, 2024, 8:05 PM IST

సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ (ETV Bharat)

Donations from People to Help Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడిన తెలుగు వారు బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేయూతనిస్తున్నారు. వరద బాధితులకు అందే సహాయ చర్యలను నిత్యం పర్యవేక్షిస్తూ 9 రోజులుగా విజయవాడ కలెక్టరేట్​లోనే ఉంటున్న సీఎం చంద్రబాబును కలిసి పలువురు విరాళాల చెక్కులను అందజేశారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్న దాతలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నానికి చెందిన జీఎమ్ఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్ రూ.2.5 కోట్లు, ఏఐజీ(AIG) హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి రూ.1 కోటి(ఆన్ లైన్ ట్రాన్సాక్షన్), వెల్ జాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వెలమాటి జనార్థన్ రావు రూ.1 కోటి చెక్కులను సీఎంకు అందించారు. మెప్మా తరపున తేజ్ భరత్ రూ.1 కోటి, ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ రూ.50 లక్షలు, సింగపూర్ ప్రవాస తెలుగువారు రూ.17 లక్షల 50 వేలు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థి డాక్టర్ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్ఆర్ఐలు సురేష్ మానుకొండ, ఉప్పు వినోద్ బాబు, వరదా అమర్ రూ.10 లక్షలు అందించారు.

వరద కష్టాలు తీర్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాం- బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం: సీఎం - CM Visit to Flood Affected Areas

ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి డాక్టర్ బాబ్జి శ్యామ్ కుమార్ రూ.6 లక్షలు, బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ యాజమాన్యం సూర్యదేవరబాబు-వెంకట రమా ప్రసాద్ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్, తేజ్, రూ.5 లక్షలు, మండపేట రైస్ మిల్లర్స్ తరపున రూ.5 లక్షలు, ఛాంబర్ అఫ్ కామర్స్ తరపున రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్ తరపున రూ.75 వేలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రూ.5 లక్షలు, ది అలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున రూ.5లక్షల రూపాయల చెక్కులను సీఎంకు అందజేశారు.

తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టీ.సతిష్ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతిదేవి రూ.3 లక్షలు, ప్రసాద్ నాయుడు రూ.2,00,116, గాంధీ రూ.2,00,016, కొత్తపల్లి గాంధీ రూ.1 లక్ష, కేవీఎస్వీ ప్రసాద్ రూ.1 లక్ష, యలమంచిలి విమలాబాయ్ రూ.1 లక్ష, తోటకూర రాజారత్నం బాబు రూ.1 లక్ష, టి.కిషోర్ కుమార్ రూ.1,11,116లు అందించారు. గారపాటి శ్రీలక్ష్మీ రూ.1 లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.1 లక్ష, కె. ప్రభాకర్ రావు రూ.75 వేలు, కరణం పద్మజ బంగారపు ఉంగరం, దివ్యాంగుడు వీ.బాబూరావు రూ.50 వేలు, కరుసల శైలజా రూ.50 వేలు, ఏ.బాలాజీ ప్రసాద్ రూ.50 వేలు, జీఎన్.బీ.వీ.ప్రసాద్ రావు రూ.50 వేలు, చలసాని సుబ్బారావు రూ.40 వేలు, భార్గవి రూ.32 వేలు, జి.సాంబశివరావు రూ.10 వేలు, ఆర్.రాధాకృష్ణ రూ.10 వేలల అందించారు.

చిన్నారుల పెద్ద మనసు - వరద బాధితుల కోసం పాకెట్ మనీ - SCHOOL CHILDREN HELP

గత ప్రభుత్వ తప్పులను సరిచేయాలి- సుద్దగడ్డ వాగు సమస్యకు పరిష్కారం చూపుతా: పవన్‌ కల్యాణ్ - Pawan Kalyan visit Flooded Areas

Last Updated : Sep 9, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.