Disable People Struggled in YCP Government : వైసీపీ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క అవకాశం అన్న, జగన్ మాయమాటలు నమ్మి ఓటేసిన ఆభాగ్యులకు నరకం చూపించారు. దివ్యాంగులకు వర్తించే పథకాల్లోనూ వివిధ నిబంధనలు పెట్టి వారికి సాయం అందకుండా కుట్ర పన్నారు. కాళ్లూచేతులు ఆడని దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 8 లక్షల 7వేల మంది దివ్యాంగ పెన్షనర్లు ఉన్నారు. దివ్యాంగులకు 3 వేల రూపాయల పింఛన్ ఇస్తానంటూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. 2014కి ముందు 40 శాతం నుంచి 79 శాతం వరకూ వైకల్యం ఉన్న దివ్యాంగులకు 500 రూపాయల పింఛన్ ఇచ్చేవారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 500 రూపాయల పింఛనును వెయ్యికి పెంచారు. 80 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి 1500 రూపాయలు చేశారు. 2019లో 79శాతం లోపు వైకల్యం ఉన్న వారి పింఛనును రూ.2000లకు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి రూ.3000 చేశారు.
దివ్యాంగులకు 6 వేల పింఛన్- చంద్రబాబు భరోసా - CBN meeting with divyang people
అంటే దివ్యాంగుల పింఛనును టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో కొందరికి 4 రెట్లు, మరికొందరికి 6 రెట్లు పెంచింది. కానీ 80 శాతంపైగా వైకల్యమున్న వారికి జగన్ పైసా కూడా పెంచలేదు. 2019లో వైకల్య శాతంతో సంబంధం లేకుండా అందరికీ 3 వేలు పింఛన్ ఇస్తున్నట్టు జగన్ ప్రకటించారు. అంటే 80 శాతానికి పైగా వైకల్యమున్న వారికి ఎలాంటి పెరుగుదల లేదు. వైకల్యం 79 శాతం కన్నా తక్కువ ఉన్న దివ్యాంగులకూ నాలుగేళ్లు గడిచినా పింఛన్ పెంచలేదు.
"దివ్యాంగులకు ‘పెళ్లికానుక’ పథకంలోనూ జగన్ కోత పెట్టారు. వధూవరులిద్దరూ పదో తరగతి ఉత్తీర్ణులయితేనే ఆర్థికసాయం అందిస్తామని షరతు విధించారు. ఆదాయ పరిమితి, భూమి, ఇంటి విస్తీర్ణం, ఇలా ఆరు నిబంధనలు పెట్టి మాకు సాయం అందకుండా కుట్రపన్నారు. జగన్ కొర్రీలతో పెళ్లికానుక పథకానికి నోచుకోలేకపోయిన మా లాంటి ఎంతో మంది దివ్యాంగులు అసలు వివాహానికి, చదువుకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2019 నుంచి 2022 అక్టోబరు వరకు ఈ పథకం కింద ఒక్కరికి కూడా సాయం అందించలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయనే కారణంగా గత ఏడాదిన్నరగా 499 మందికి మాత్రమే పంపిణీ చేశారు. తెలుగుదేశం 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్ల కాలంలో 5253 మంది దివ్యాంగ యువతకు 34 కోట్ల రూపాయల మేర పెళ్లికానుక కింద అందజేశారు." - దివ్యాంగురాలు
Divyang People Problems in AP : తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల మాదిరిగానే దివ్యాంగులకూ రాయితీ రుణాలు అందజేసింది. 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకూ రుణాలు అందించారు. అందులో లక్ష నుంచి 2 లక్షల వరకూ రాయితీ ఇచ్చారు. ఐదేళ్లలో 3540 మంది లబ్ధిదారులకు 26 కోట్ల రూపాయలు అందించి ఆర్థిక భరోసా ఇచ్చింది. దివ్యాంగులు, సొంతకాళ్లపై నిలబడటం ఇష్టం లేని జగన్ తెదేపా ప్రభుత్వం అందజేసిన రాయితీ రుణాల మంజూరును నిలిపివేశారు.
దివ్యాంగులు ఆగ్రహించడంతో జగన్ జిత్తులు ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాల్ని రాష్ట్రంలోని దివ్యాంగులకు వర్తింపజేశారు. ఆసక్తి ఉన్న ఒక్కో దివ్యాంగుడికి దీని ద్వారా 50 వేల నుంచి 5 లక్షల వరకు రుణం ఇప్పించారు. ఐతే రుణం తీసుకున్న వారికి ఎలాంటి రాయితీ ఉండదు. మొత్తం రుణాన్ని లబ్ధిదారుడు నెల వాయిదాల రూపంలో చెల్లించాల్సిందే. ఇలా చూసినా జగన్ ఏలుబడిలో రుణాలు అందింది కేవలం 347 మంది దివ్యాంగులకే.
కళ్లు లేకున్నా కుటుంబానికి అండగా, మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం, లక్షల్లో జీతం
దివ్యాంగుల కోసం స్పెషల్ గర్బా ఈవెంట్.. ఒకే వేదికపై 700 మంది సందడి