ETV Bharat / state

ధవళేశ్వరంలో పడకేసిన పారిశుద్ధ్యం - ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు - Disorganized sanitation in ap - DISORGANIZED SANITATION IN AP

Disorganized Sanitation in Dhavaleswaram: గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా, చెదారం నుంచి దుర్వాసన వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.

Disorganized Sanitation in Dhavaleswaram
Disorganized Sanitation in Dhavaleswaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 9:16 AM IST

ధవళేశ్వరంలో పడకేసిన పారిశుద్ధ్యం - ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్న ప్రజలు (ETV Bharat)

Disorganized Sanitation in Dhavaleswaram : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం దాదాపు 70వేల జనాభా ఉన్న అతిపెద్ద పంచాయతీ. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రమైన ధవళేశ్వరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచీ పెద్దఎత్తున వివిధ పనులపై వస్తుంటారు. ఇంత జనాభా ఉన్న ఊరిలో గత కొన్నేళ్లుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా గోదావరి కాలువల వెంట వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మెండా వారి వీధి, ఉడతా వారి వీధి, కాటన్ పేట, లక్ష్మీ జనార్థన నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త ఎక్కడిక్కడ పేరుకుపోతోంది. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పెద్దఎత్తున చెత్త దర్శనమిస్తోంది. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. డ్రైనేజీల్లో చెత్త వేయడంతో వాటిని తొలగించే వారే కరవయ్యారు.

కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో స్థానికులు చెత్త వేయడంతో వాటిని తొలగించే వారు లేక పెద్దఎత్తున పేరుకుపోతోంది. ఇక వీధుల్లో వేస్తున్న చెత్తను తొలగించే వారే లేరు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోడంతో ఏ వీధిలో చూసినా గుట్టలుగా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు వాపోతున్నారు.

విజయవాడ నగరంలో సమస్యలు విలయతాడవం - ఎన్నికల హడావుడిలో స్తంభించిన వీఎంసీ పాలన - Sanitation Problem in Vijayawada

పంచాయతీ సిబ్బంది సేకరించిన చెత్తను తరలించేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. డంపింగ్ యార్డ్​కు కేటాయించిన స్థలం వివాదంలో ఉంది. దీంతో బొమ్మూరు జాతీయ రహదారి చెంతన ఉన్న డంపింగ్ యార్డుకు తరలించే వారు. గత ఏడాది అగ్ని ప్రమాదం జరగడం, స్థానికులు ఆందోళన చేయడంతో వ్యర్థాల తరలింపు నిలిపేశారు. అప్పటి నుంచి ధవళేశ్వరంతో పాటు, హుకుంపేట, పిడింగొయ్యి పంచాయతీల్లో సేకరించిన వ్యర్థాలను జాతీయ రహదారి చెంతన, కాటన్ బ్యారేజీ సమీపంలోని తూర్పు డెల్టా కాల్వ గట్టున వేస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించే డెల్టా కాల్వలో వ్యర్థాల కలిపోయి నీరు కాలుష్య కాసారంగా మారుతోంది. డంపింగ్ యార్డ్ లేకపోవడంతో ధవళేశ్వరంలో పలు వీధుల్లో చెత్త పేరుకుపోతోంది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో జనం రోగాల బారిన పడుతున్నారు.

పారిశుద్ధ్య కార్మికుల ఎఫెక్ట్ - చెత్తాచెదారంతో నిండిపోయిన ఏపీ సచివాలయం

డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రైవేట్ స్థలం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆ వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్ల్లే రోజువారీ వ్యర్థాల తొలగింపు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.

'మురుగు'తున్న ఆటోనగర్- నెలల తరబడి పేరుకుపోయిన వ్యర్థాలతో స్థానికుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.