Green Mat On Scooty TO Prevent Sun Burn : సూర్యుడు తన ఉగ్రరూపాన్ని భూతలంపై చూపిస్తున్నాడు. నిత్యం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ భూమిపై వేడి పెరిగిపోతుంది. మునుపెన్నడు చూడని ఉష్ణోగ్రతలను 2024లో ముఖ్యంగా ఏప్రిల్, మే నెలలో చూస్తున్నాం. దీంతో మానవాళితో పాటు జంతువులు, పక్షులు, కీటకాలు అల్లాడిపోతున్నాయి. ఏదైనా అవసరానికి బయటకు వెళ్దామంటే జంకే పరిస్థితికి జనాలు వచ్చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే ఎంతో ఆలోచిస్తున్నారు. వెళ్లక తప్పదు అన్నప్పుడు ఇక తలపై టోపీలు ధరిస్తూ, స్కార్ఫ్ చుట్టుకుంటూ వెంట నీళ్ల సీసా తీసుకెళ్తూ ఇలా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరిస్తున్నా, దాని వల్ల ఇంకా ఉక్కపోత ఎక్కువవుతోంది తప్ప తగ్గడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇక ట్రాఫిక్ జామ్‌లో ఎదురుచూడాల్సి వచ్చినప్పుడు ఆ భానుడి భగభగలకు మండిపోతున్నామని వాపోతున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ వాహనదారుడు ఎండకు మండకుండా తన వాహనం కోసం ఓ ఉపాయం ఆలోచించాడు. వినూత్నంగా ఆలోచించి ఎండల నుంచి తాత్కాలిక ఉపశనం కలిగేలా తన ద్విచక్ర వాహనంపై గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేశాడు మంచిర్యాల జిల్లా నస్పూర్ కాలనీకి చెందిన దివ్యాంగుడు గోళ్ల శంకరయ్య. ఎండ, వేడిగాలులు తగలకుండా తన ద్విచక్ర వాహనానికి గ్రీన్ మ్యాట్‌ను ఏర్పాటు చేసుకొని, దానికి ఇరువైపులా మనీప్లాంట్ నాలుగు మొక్కలను పెంచుతున్నారు.
ఎంత ఎండలో ప్రయాణించినా చల్లగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. గ్రీన్ మ్యాట్‌తో ఉన్న శంకరయ్య స్కూటీ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు, ఫొటోలు చూసి నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు. శంకరయ్య ఐడియాకు ఫిదా అవుతున్నారు. ఏం ఐడియా గురూ అంటూ ప్రశంసిస్తున్నారు. సూర్య బ్రోకే షాకిచ్చినవ్లే శంకరయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎండల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
- ఎండలోకి ఏదైనా అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లవద్దు.
- ఎండలోకి వెళ్లేటప్పుడు గొడుగు వంటికి రక్షణ కోసం పట్టుకుని వెళ్లాలి.
- మంచి నీటి వాటర్ బాటిల్‌ను పట్టుకుని వెళ్లాలి.
- వడదెబ్బ తగులకుండా కొబ్బరి నీళ్లు, లెమన్ వాటర్ వంటివి తీసుకోవాలి.
- ముఖ్యంగా మసాలా పదార్థాలు, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.
- ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ క్రీంలు వంటివి శరీరానికి పూసుకోవాలి.
- వాటర్ మిలాన్, బొప్పాయి వంటి పండ్లను తీసుకోవాలి.
సమ్మర్లో ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఎందుకో తెలుసా? - Summer Effects On Phone Charging