Difficulties of Handloom Workers During YSRCP Government: తాను సీఎం అయితే చేనేతల కష్టాలన్నీ తీరిపోయినట్లే అంటూ ఐదు సంవత్సరాల క్రితం జగన్‌రెడ్డి ప్రగల్భాలు పలికారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేతన్నలను వంచనకు గురిచేశారు. నేతన్న నేస్తం అని చెప్పిన పెద్దమనిషి అనేక కొర్రీలు పెట్టి సగం మందికి కూడా సాయం అందించలేదు. నమ్మి ఓట్లేసిన చేనేత కార్మికులను నిండా ముంచేశారు. జగన్ పాలనలో చేనేత రంగం కుదేలైంది. సీఎం వంచన కారణంగా వేలాది చేనేత కుటుంబాలు ఇతర రంగాలకు మళ్లిపోగా ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
వైసీపీ పాపాలకు అంతు లేకుండా పోయింది.. చేనేత వ్యాపారులపై దాడులా !: చంద్రబాబు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.50 లక్షల మంది చేనేత కార్మికులు ఉన్నారు. టీడీపీ హయాంలో ముడిపట్టుపై కిలోకు రూ.500 చొప్పున 4 కిలోల వరకు రాయితీ ఇచ్చేవారు. టీడీపీ హయాంలో చేనేత కార్మికులకు ఆదరణ పథకం కింద పరికరాలు అందించారు. జగన్ వచ్చాక వాటిని ఎత్తేశారు. చంద్రబాబు సీఎం ఉన్న సమయంలో ధర్మవరం, పుట్టపర్తి, ఉరవకొండ ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి చేనేత వృత్తిలో నైపుణ్య శిక్షణ అందించేవారు. వారికి రుణాలు ఇప్పించి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించేవారు. అనంతపురంలోనే 10 వేల మందికి శిక్షణ ఇచ్చి టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఒక్కరికి కూడా శిక్షణ ఇవ్వకపోగా క్లస్టర్లను మూసేశారు.
చేనేతపై జీఎస్టీ రద్దు - కార్మికుల సమస్యలకు శాశ్వత పరిష్కారం: లోకేశ్ - Lokesh meet handloom workers
అప్పుల బాధ తాళలేక ధర్మవరంలో కేతిరెడ్డికాలనీకి చెందిన నాగేంద్ర అనే చేనేత కార్మికుడు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పట్టుచీరలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, ముడిపట్టు ధరలు పెరగడంతో మగ్గం నిర్వహణ, కుటుంబ పోషణకు అధిక వడ్డీకి అప్పులు చేశారు. వడ్డీ కూడా చెల్లించలేక కొంతకాలంగా మనస్తాపం చెందుతుండేవారు. నాగేంద్ర భార్య రామసుబ్బమ్మ అనారోగ్యం బారిన పడటంతో కొంతకాలంగా బూదేడు గ్రామంలో ఉంటోంది. ఇద్దరు కుమారులు గణేశ్, ఎర్రిస్వామి హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
YCP Governmnet Not Provide Financial Support: సోమందేపల్లికి చెందిన చేనేత కార్మికుడు గంగాధర్ అప్పుల బాధతో రెండున్నర సంవత్సరాల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో కుటుంబ భారం ఆయన భార్య లక్ష్మీదేవిపై పడింది. ప్రభుత్వం ఇప్పటికీ రూ.5 లక్షల పరిహారం అందించకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మండలంలోని కుర్లపల్లికి చెందిన ఈరన్న 1994 నుంచి కంబళ్లు తయారు చేస్తుండేవారు. ఒక కంబళి తయారీకి రెండు రోజులు సమయం పడుతుండటమే కాకుండా పెట్టుబడి రూ.400 అవుతుంది. మార్కెట్లో విక్రయిస్తే రూ.600 వస్తాయి. ఇతర ప్రాంతాల్లో అమ్మితే రూ.100 కూడా మిగలడం లేదు. కుటుంబ పోషణ, పిల్లల చదువులు భారమయ్యాయి. నాలుగు సంవత్సరాలుగా చేతివృత్తి కడుపు నింపలేకపోయింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీ అందకపోవడంతో ముడిసరుకు కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వలేక పరికరాలను కట్టి పెట్టి వ్యవసాయ కూలీగా మారారు.
నేతన్న ఉపాధిపై జగనన్న కొరడా - ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకుంటున్న చేనేతలు