ETV Bharat / state

నిర్వహణ పేరిట వసూళ్ల మోత- కనీస సదుపాయాల కోత- డైట్​ 'డర్టీ' డైరీస్​ - DIET Collage Rajamahendravaram

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 20, 2024, 7:18 AM IST

DIET Collage Problems Rajamahendravaram Bommuru : చిట్టడవిని తలపించేలా చుట్టూ పిచ్చి మొక్కలు, విరిగిన కిటికీలు, ఊడిన తలుపులు, నెర్రెల్చిన గోడలు, పెచ్చులూడుతున్న శ్లాబులు ఇదీ రాజమహేంద్రవరం బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిస్థితి. కనీసం బోధన సరిగ్గా ఉందా అంటే అదీ అరకొరే అంటున్నారు విద్యార్థులు..

diet_collage_problems_rajamahendravaram
diet_collage_problems_rajamahendravaram (ETV Bharat)

DIET Collage Problems Rajamahendravaram Bommuru : ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దాల్సిన శిక్షణ కళాశాల సమస్యల నిలయంగా మారింది. అపరిశుభ్ర వాతావరణం అరకొర సౌకర్యాలకుతోడు ఉపాధ్యాయ శిక్షణ తప్ప ఇక్కడ మిగిలిన అన్ని పనులు నేర్పిస్తున్నారు. పేరుకే ప్రభుత్వ డైట్‌ కళాశాల అయినా నిర్వహణ పేరిట ఒక్కో విద్యార్థి నుంచి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఇదీ రాజమహేంద్రవరంలోని డైట్‌ కళాశాల దుస్థితి.

Teacher Training Institutes in Bommuru : చిట్టడవిని తలపించేలా చుట్టూ పిచ్చి మొక్కలు, విరిగిన కిటికీలు, ఊడిన తలుపులు, నెర్రెల్చిన గోడలు, పెచ్చులూడుతున్న శ్లాబులు ఇదీ రాజమహేంద్రవరం బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ పరిస్థితి. భవిష్యత్‌లో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు తెచ్చుకోవాల్సిన ఛాత్రోపాధ్యాయులు అపరిశుభ్ర వాతావరణంలో అరకొరగా శిక్షణ పొందుతున్నారు. డైట్ కళాశాలల్లోమౌలిక సదుపాయాలు లేక ఇబ్బందిపడుతున్నారు. కళాశాల నిర్వహణ పేరిట ఒక్కొక్కరి నుంచి నాలుగున్నరవేల రూపాయలు వసూలు చేస్తూ కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసం తాగునీరు, వాడుకునేందుకు నీరు, ఫ్యాన్లు లేవని శిక్షణ అభ్యర్థులు వాపోతున్నారు. బాల బాలికల వసతి గృహాల్లో వార్డెన్లు, నైట్‌ వాచ్‌మెన్‌లు లేకపోవడంతో రాత్రివేళ భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం 6 దాటితే వసతి గృహాల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఉందంటున్నారు.
Intermediate Free Books Distribution: ఉచిత పుస్తకాల పంపిణీ బటన్ నొక్కు జగన్​ మామయ్య..!

District Institute OF Education & Training Govt. DIET Bommuru :ఇటీవల వచ్చిన కొత్త పిన్సిపల్ వ్యవహారశైలి, వీరికి మరింత ఇబ్బందిగా మారిందని విద్యార్థులు వాపోతున్నారు. నిమిషం ఆలస్యమైనా ఫైన్‌లరూపంలో భారీగా వసూలు చేస్తున్నారని, నెలలు నిండిన గర్భిణీలకూ సెలవులు ఇవ్వడం లేదంటున్నారు. కూలీలతో చేయించాల్సిన పనులన్నీ తమతో చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'బాల, బాలికల వసతి గృహాల్లో అన్నీ సమస్యలే, ఆడవారి వసతిగదులకు వార్డెన్లు కూడా లేరు. భయం భయంగా హాస్టల్లలో ఉంటున్నాం. బాత్రుమ్​ కడిగేవాళ్లు కూడా ఉండరు. చెత్త ఎత్తడం దగ్గర నుంచి అన్ని పనులు మేమే చెయ్యాలి. క్యాంపస్​లోపల గడ్డి, పిచ్చి మొక్కలు, పందులు ఉంటాయి. అపరిశుభ్ర వాతావరణం, అసౌకర్యాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నాం.' - విద్యార్థులు

'క్రమశిక్షణతో కూడిన ఉత్తమ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం కోసమే కొంత కఠినంగా వ్యవహరిస్తున్నామని ప్రిన్సిపల్ తెలిపారు.' -జయశ్రీ, ప్రిన్సిపల్

ఐదు తరగతులు - ఒకే గది - ఇవేమీ చదువులు - Government School Problems

వసతి గృహాల్లో బిక్కుబిక్కుమంటున్న మెడికోలు- వసతి గృహాల నిర్వహణ గాలికొదిలేసిన వైసీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.