Devotees Huge Rush in Tirumala Temple: తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో టీటీడీ అధికారులు విఫలమయ్యారు. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. వేసవి, వారంతపు సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం మూడు కిలోమీటర్లకు పైగా ఉన్న క్యూలైన్లలో నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. క్యూలైన్‌లలోకి ప్రవేశించే పురుషులతోపాటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం వేచి ఉండక తప్పడం లేదు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు అంతకు మించి సమయం పడుతోంది. గదుల కోసం అగచాట్లు తప్పడం లేదు.
పద్మావతీ పరిణయోత్సవాలు - గరుడవాహనంపై స్వామిఅమ్మవార్ల ఊరేగింపు - PADMAVATHI MAHOTSAVAM
Piligrims Suffering From no Facilities in Tirumala: భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ అధికారులు బాహ్యవలయ రహదారిపై ఏర్పాటు చేసిన క్యూలైన్లలోకి భక్తులను మళ్లిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర నడిచి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు టీటీడీ తగిన స్థాయిలో వసతులు కల్పించడం లేదు. మండుటెండల్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. తాగునీరు, అన్నప్రసాదాలు అందుబాటులో లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లలోకి చేరుకునే వరకు అన్నప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు వేడుకుంటున్నారు.
తిరుమల వెళ్తున్నారా? - ఈ విషయం తెలుసుకోకపోతే చిక్కులు తప్పవు! - TTD Latest Updates on Devotees Rush
నారాయణగిరి ఉద్యాన వనాల నుంచి గోగర్భం జలాశయం వరకు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న క్యూలైన్లలో దర్శనాలకు వెళుతున్న భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. నిదానంగా కదులుతున్న క్యూలైన్లతో ఆయా ప్రాంతాలకు చేరడానికి గంటల సమయం పట్టడంతో ఆహారం కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అన్న ప్రసాదాల పంపిణీలో ఆలస్యం, క్యూలైన్ల నత్తనడకన సాగడంతో ఎదురవుతున్న ఇబ్బందులను భక్తులు టీటీడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కొరవడింది.
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం - రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది - Two leopards spotted at tirumala