Deputy CM Pawan Kalyan Tweet on Drugs Issue in AP : రాష్ట్రంలో మాదకద్రవ్యాలు పెనుముప్పుగా మారాయని, చాలా నేరాలకు ఇవి కూడా ఓ కారణమని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అవినీతి, నేర పాలన నుంచి ఎన్డీఏ కూటమికి ఈ వారసత్వ సమస్య వచ్చిందని అన్నారు. ఈ పోస్టుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేశారు. డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
Drug Mafia in YSRCP Government : కొద్ది రోజుల క్రితం విశాఖపట్నం ఓడ రేవులో చేపల మేత పేరిట భారీగా కొకైన్ పట్టుబడిన విషయం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాగే దేశంలోని వేరే చోట పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక వ్యాపార సంస్థతో సంబంధాలు బయటకు వచ్చాయని తెలిపారు. ఇలాంటి నేరాలు అరికట్టాలన్నా, నేరగాళ్లను నియంత్రించాలన్నా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు.
Drugs have become a menace in the state. Another legacy issue our NDA govt inherited from previous corrupt and criminal regime. A special focus is needed to curb drug mafia, ganja cultivation and related criminal activities in the state.
— Pawan Kalyan (@PawanKalyan) November 9, 2024
Sometime back,seizure of a cocaine…
అక్రమ మద్యం నియంత్రణ, డ్రగ్స్ బాధితుల పునరావాసంపై మంత్రుల కమిటీ
కఠిన చర్యలు తీసుకోండి : నెల్లూరులో 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటనపైనా పవన్ స్పందించారు. పోలీసులు దయచేసి దోషిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటన జరగ్గానే జనసేన నేతలు వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు. మిగతా ప్రాంతాల్లో ఏదైనా నేరం జరిగితే వ్యక్తిగతంగా లేదా సమూహంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పరిస్థితులను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడుతానని పోస్టులో పేర్కొన్నారు.
Please, take firm action on the culprit @APPOLICE100
— Pawan Kalyan (@PawanKalyan) November 9, 2024
I appeal to communities and individuals to come and report to police without fear. And I will speak to higher officials, how to involve and take the help of community to prevent such situations. https://t.co/y5k32lPr5h
పవన్ కల్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ : గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అరెస్టులపై డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు సమాచారం. గతంలో సామాజిక మాధ్యమాల్లో వైఎస్సార్సీపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల తీరుని పవన్ కల్యాణ్ తప్పుబట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో డీజీపీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.