ETV Bharat / state

రామోజీరావు మాట్లాడే విధానం నన్ను చాలా ఆకర్షించింది : పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan About Ramoji Rao - PAWAN KALYAN ABOUT RAMOJI RAO

Pawan Kalyan Speech in Ramoji Rao Memorial Program : ప్రజాస్వామ్యం కోసం ఆఖరి వరకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవరసమో ఆయన పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. స్వేచ్ఛ సామాన్యుల బాగు కోసమే ఉపయోగపడాలని తలపోశారని తెలిపారు. అలాంటి మహోన్నత వ్యక్తి ఆశయాలు, స్ఫూర్తిని భవిష్యత్​ తరాలు కొనసాగించాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Pawan Kalyan About Ramoji Rao
Pawan Kalyan About Ramoji Rao (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 8:00 PM IST

Updated : Jun 27, 2024, 10:18 PM IST

Deputy CM Pawan Kalyan About Ramoji Rao : మొదటిసారి 2008లో రామోజీరావును కలిశానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన మాట్లాడే విధానం తనను చాలా ఆకర్షించిందని చెప్పారు. ప్రజాసంక్షేమం కోణంలోనే ఎప్పుడూ మాట్లాడేవారని, ఆ మాటల్లో జర్నలిజం విలువలే తనకు కనిపించాయని తెలిపారు. విజయవాడలోని కానురూలో ఏర్పాటు చేసిన రామోజీరావు సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రజాసమస్యల గురించే రాసేవారు : అంతకుముందు రామోజీరావు ఛాయాచిత్ర ప్రదర్శనను పవన్ కల్యాణ్ తిలకించారు. అనంతరం ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో రామోజీరావు వివరించారని పవన్ తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఏం జరిగినా ప్రజలకు తెలియాలని ఆయన అనేవారని చెప్పారు. ఎన్ని కష్టాలు వచ్చినా జర్నలిజం విలువలు వదల్లేదన్నారు. పాలన సరిగా లేకుంటే పత్రిక మొదటి పేజీలో విమర్శించేవారని గుర్తు చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా పత్రికలో ప్రజాసమస్యల గురించే రాసేవారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

'2008లో వచ్చిన సమాచార హక్కు చట్టం ప్రజలకు తెలియాలనే అంశంపై రామోజీరావు ఉద్యమకారుడిలా మారారు. సినిమా రంగంలో ఇతర అంశాల్లో రాణించినప్పటికి ఆయన నిజమైన జర్నలిస్టు. కుటుంబాన్ని బెదిరించినా రామోజీరావు వెరవకుండా ఎదురు నిలబడ్డారు. అలాగే చాలా సాహసం చేశారు. ఈనాడు, ఈటీవీలు ఎంత విలువ ఇస్తాయో అంతే స్థాయిలో విమర్శలు చేస్తాయి. విలువలతో కూడిన జర్నలిజం అది. ఆ వారసత్వ ప్రవాహాన్ని అలాగే కొనసాగించాలి' అని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

Pawan Participated Ramoji Rao Memorial Program : రామోజీరావు ప్రజాపక్షపాతి అని పవన్ కల్యాణ్ అన్నారు. దేశానికి, ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ఎంత అవసరమో తరచూ చెప్పేవారని గుర్తు చేశారు. రాజకీయ దాడులెన్నో తట్టుకుని ఎక్కడా రాజీపడని ఆయన తీరు తనకెంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు, తెలుగు రాష్ట్రాలకు రామోజీరావు ఉద్యమకారుడని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించేందుకు ఎంతో కృషి చేశారని, పత్రికా విలువల్లో ఎక్కడా రాజీపడని తీరు సాహసోపేతమని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

"ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎవరి స్థాయిలో వారు రామోజీరావులా పోరాడాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న ఏ పార్టీని ఆయన వదల్లేదు. రామోజీరావు జర్నలిజం వారసత్వ సంపదను ఎంత అందిపుచ్చుకున్నామా అని ప్రతీ ఒక్కరూ గుర్తించాలి. అమరావతిలో రామోజీరావు విగ్రహం నిర్మించాలి". - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

రామోజీరావు చిత్రపరిశ్రమకు చేసిన సేవ మరువలేనిద-సంస్మరణ సభలో సినీ ప్రముఖులు - Ramoji Rao Memorial Program

అమరావతి కోసం రూ.10 కోట్లు విరాళం అందించిన ఈనాడు ఎండీ కిరణ్‌ - Ramoji Rao Memorial Meet

Last Updated : Jun 27, 2024, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.