ETV Bharat / state

ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తా: పవన్ కల్యాణ్‌ - Pawan Kalyan meeting in Gollaprolu

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 7:00 PM IST

Deputy CM Pawan Kalyan Meeting with JanaSena Leaders: శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్ గొల్లప్రోలులో జనసేన వీరమహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కాదు ఎన్డీఏకు అండగా నిలబడ్డ వ‌క్తిని అని పవన్ అన్నారు.

pawan_kalyan_visit_pithapuram
pawan_kalyan_visit_pithapuram (ETV Bharat)

Deputy CM Pawan Kalyan Meeting with JanaSena Leaders: పిఠాపురాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్‌ పంపిణీ కార్యక్రమం అనంతరం వీరమహిళలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన అఖండ విజయం దేశంలో కీలక పాత్ర పోషించే శక్తిని ఇచ్చిందన్నారు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేనే కాదు ఎన్డీఏకు అండగా నిలబడ్డ వ‌్యక్తినని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగా ఉంటానని అన్నారు. పొట్టి శ్రీరాములు బలిదానం వల్లే మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని పవన్ గుర్తుచేశారు.

డొక్కా సీతమ్మ సేవలను మనమంతా నిత్యం స్మరించుకోవాలని పవన్ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ పేరుతో కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అన్నారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చానని ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి ఏం చేయగలనా అనే నిత్యం ఆలోచిస్తున్నానని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చాకే నన్ను ఊరేగించండిని పవన్ అన్నారు.

నా దేశం, నేల కోసం పని చేస్తా - జీతం వద్దు : పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Speech in Gollaprolu

చులకనగా చూస్తే మాత్రం ఊరుకోము: కేంద్ర పథకం జల్ జీవన్ మిషన్‌ గురించి అధికారులతో మాట్లాడానని ఈ మిషన్‌కు కేంద్రం నుంచి బాగా నిధులు వస్తాయని పవన్‌ తెలిపారు. దీనికి రాష్ట్ర వాటా ఇస్తే చాలని కేంద్రం నుంచి పూర్తిగా నిధులు వస్తాయని అన్నారు. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖ పనులను గత పాలకులు విస్మరించారని మండిపడ్డారు. ఎవరైనా ముందు అభిప్రాయాలు పూర్తిగా వినాలని సూచించారు. నాకు భయం తెలియదని అందరూ ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నాతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చులకనగా చూస్తే మాత్రం ఊరుకోమని పవన్ హెచ్చరించారు. కొన్ని విషయాల్లో గట్టిగా ఉండటం తప్పదని శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కఠినంగానే ఉంటానని పవన్ కల్యాణ్‌ అన్నారు.

దేశం కోసం ఏదైనా చేస్తా: పిఠాపురం నేతలు అండగా లేకుంటే ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవని పవన్ కల్యాణ్‌ అన్నారు. దేశమంటే నాకు ఎంతో అభిమానం ఉంజని అలాంటి దేశం కోసం ఏదైనా చేస్తానని తెలిపారు. సమాజానికి ఏదైనా ఇవ్వాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. ఓటములు చవిచూశాం ధైర్యంగా నిలబడ్డామని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో భగవంతుడు మనకు అఖండ విజయం ఇచ్చాడని అన్నారు. సనాతన ధర్మం పాటిస్తామని అన్ని మతాలనూ గౌరవిస్తామని వ్యాఖ్యానించారు. పిఠాపురం ప్రజలంతా కలిసి నన్ను దీవించారని దేశ చరిత్రను మార్చేటంత శక్తిని ఇచ్చారని పవన్ కొనియాడారు.

జనసేన నుంచి మరో ఇద్దరికి పదవులు- సీఎం చంద్రబాబుకు పవన్​ లేఖ - Pawan Kalyan letter to Chandrababu

సీఎం 4.0ను చూస్తారు - చంద్రబాబు, లోకేశ్​ మధ్య ఆసక్తికర సంభాషణ - Chandrababu and Lokesh Conversation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.