ETV Bharat / state

భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కొట్టుకుంటున్నారు: పవన్‌ కల్యాణ్​ - PAWAN KALYAN COMMENTS

పల్నాడు జిల్లాలో సరస్వతి భూములు పరిశీలించిన పవన్‌కల్యాణ్‌ - సహజ వనరులు ఇస్తే ఉద్యోగాలు కల్పించాలి కదా అని నిలదీత

PAWAN_KALYAN_COMMENTS
PAWAN KALYAN COMMENTS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2024, 3:12 PM IST

Updated : Nov 5, 2024, 4:11 PM IST

Pawan Kalyan Inspected YS Jagan Lands : పల్నాడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్​ జగన్మోహన్​ రెడ్డికి గతంలో కేటాయించిన సరస్వతి పవర్​ భూములను డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పరిశీలించారు. ఉద్యోగాలు ఇస్తాం, భూములు అమ్మండంటూ తీసుకున్నారని, ఇష్టం లేకున్నా భూములు అమ్మాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని పవన్ కల్యాణ్​ విమర్శించారు. మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలో భూములను పరిశీలించిన పవన్ కల్యాణ్​, భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడారు. పవన్ వెంట ఎమ్మెల్యే యరపతినేని, కలెక్టర్, అటవీ, రెవెన్యూ అధికారులు ఉన్నారు.

గతంలో పెట్రోల్‌ బాంబులు వేసి భయపెట్టారని, కోడెల శివప్రసాదరావును వేధించి చంపేశారని ఆరోపించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాలను భయపెట్టి తీసుకున్నారని అన్నారు. లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయన్న పవన్, ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారు: భూములిచ్చిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నామన్నారు. 400 ఎకరాల అటవీ భూములుంటే, రెవెన్యూ భూములుగా మార్చేసి లాక్కున్నారని మండిపడ్డారు. 2009లో 30 ఏళ్లకు లీజుకు తీసుకుని, మళ్లీ 50 ఏళ్లకు లీజు పెంచేశారని ఆరోపించారు. 24.78 ఎకరాలు కుంటలు, చెరువులు స్వాధీనం చేసుకున్నారని, భూములు లాక్కొని సొంత ఆస్తి మాదిరిగా కుటుంబంలో కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సహజ వనరులు ఒకరి సొంతం కాదని, సహజ వనరులు ఇస్తే ఉద్యోగాలు కల్పించాలి కదా అని ప్రశ్నించారు. నిర్మించని సిమెంటు కంపెనీకి 196 కోట్ల లీటర్ల నీరా అని నిలదీశారు.

ఇంకా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు: పోలీసు అధికారులు మెత్తబడిపోయారా లేదా భయపడుతున్నారా అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్​, గత ప్రభుత్వం ఇక్కడున్న యువతను భయపెడితే ఊరుకుంటారా అని మండిపడ్డారు. పెట్రోల్‌ బాంబు, నాటు బాంబులు వేసి బెదిరిస్తుంటే ఏం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత, రౌడీయిజాన్ని అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు ఇంకా వాళ్లే ప్రభుత్వంలో ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారని, శాంతిభద్రతలు అంటే ఎంత బలంగా ఉంటాయో వాళ్లకు చేసి చూపించాలని అన్నారు.

పవన్​ పల్నాడు జిల్లా పర్యటన - సరస్వతి పవర్ భూముల పరిశీలన

Last Updated : Nov 5, 2024, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.