ETV Bharat / state

పోలీసులు మాత్రమే డ్రగ్స్ కంట్రోల్ చేయలేరు - ప్రజలూ సహకరించాలి : భట్టి విక్రమార్క - BHATTI VIKRAMARKA ON DRUGS SUPPLY - BHATTI VIKRAMARKA ON DRUGS SUPPLY

Deputy CM Bhatti Vikramarka on Drugs in Telangana : రాష్ట్రంలో డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మాదకద్రవ్యాలు చాలా ప్రమాదకరమని అందుకే వాటి నిర్మూలనలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

Hyderabad CP on Drugs Control
Bhatti Vikramarka Start Anti Drug Rally in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 1:34 PM IST

Updated : Jun 25, 2024, 2:04 PM IST

Deputy CM Bhatti on Drugs in Telangana : రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. డ్రగ్స్ నిర్మూలించేందుకు నార్కోటిక్ బ్యూరోకు ఎంతైనా బడ్జెట్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏ స్థాయిలోనైనా నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. హైదరాబాద్​లోని నెక్లెస్​ రోడ్​ జలవిహార్​ వద్ద అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మాదకద్రవ్యాల నిరోధక ర్యాలీని ఆయన ప్రారంభించారు.

International Anti Drug Day 2024 : రాష్ట్రంలో మాదకద్రవ్యాలు నిరోధించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. మానవ జీవితానికి డ్రగ్స్​ అత్యంత ప్రమాదకరమని అన్నారు. డ్రగ్స్ విష ప్రయోగం లాంటిదని, కుటుంబ వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంఘ విద్రోహ శక్తుల చేతిలో యువత జీవితాలు ఛిన్నాభిన్నమవుతున్నాయని వాపోయారు. తెలిసీ తెలియని వయసులో పిల్లలు డ్రగ్స్ తీసుకుంటూ వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు కావాలని తమ అక్రమ ఆదాయం కోసం పిల్లలకు, యువతకు డ్రగ్స్ అంటగడుతున్నారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్​లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్​ - రూ.4 లక్షల విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం

Bhatti Speech on Anti Drug in Telangana : దేశాన్ని బలహీన పరచడానికి దేశద్రోహులు చేస్తున్న ప్రయత్నంగా డ్రగ్స్​ను వాడుకుంటున్నారని భట్టి అన్నారు. అందుకే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనపైనే ఉందని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు ఎంతైనా బడ్జెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. మాదకద్రవ్యాల నిరోధానికి కేవలం పోలీస్ ప్రభుత్వ యంత్రాంగం మాత్రమే కాకుండా ప్రజలు కూడా సహకారం అందించాలని కోరారు. ప్రజలు కమిటీలు వేసుకుని ఎక్కడికక్కడ సమాచారం అందిస్తే డ్రగ్స్​ అరికట్టడం కష్టమేమీ కాదని చెప్పారు.

"గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘా ఎల్లప్పుడూ ఉండాలి. విద్యార్థులు పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. విద్యార్థులు తాత్కాలిక సంతోషాల జోలికి వెళ్లి బలికావద్దు. పిల్లలు అడ్డదారులు తొక్కితే కుటుంబమే కాకుండా సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుంది. డ్రగ్స్ నిరోధానికి ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది." - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

TGNAB Director on Drugs Control : పోలీసులు మాత్రమే డ్రగ్స్ కంట్రోల్ చేయలేరని టీజీన్యాబ్‌ డైరెక్టర్‌ అన్నారు. ప్రజలతో పాటు ఇతర విభాగాల సహకారం కూడా కావాలి కోరారు. కలిసికట్టుగా డ్రగ్స్‌పై యుద్ధం చేస్తే డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ చూడొచ్చు అని తెలిపారు. డ్రగ్స్ నిరోధానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సeయం చేస్తోందని పేర్కొన్నారు. 30 వేల మంది యాంటీ డ్రగ్ సైనికులను తయారు చేశామని వివరించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా పట్టుబడిన గంజాయి - ఐదుగురు అరెస్టు

Last Updated : Jun 25, 2024, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.