Deputy CM Bhatti Vikramarka Discussion with Group 2 Candidates : సచివాలయంలో గ్రూపు -2 అభ్యర్థులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చర్చలు జరిపారు. గ్రూపు-2 అభ్యర్థులతో ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ చర్చించారు. గ్రూపు -2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ ఛైర్మన్‌కు ఫోన్ చేసి గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. డిసెంబరు నెలలో పరీక్ష నిర్వహణకు పరిశీలిస్తామని చెప్పారు.
ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. అలాగే విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నామని అన్నారు. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసులు పాలైతే మీరే నష్టపోతారని హెచ్చరించారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దన్నారు.
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటు : విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడొద్దు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం." అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.
ఆన్లైన్లో కాంపిటేటివ్ పాఠాలు బోధన : హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. ప్రివేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్‌నగర్‌లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం. మీరు మా బిడ్డలు రాష్ట్ర సంపద. మీ మేధస్సు నిరూపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది. పరిష్కరిస్తోంది. గ్రూప్ 2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
"మీరు చెప్పే సమస్యను చాలా లోతుగా అధ్యయనం చేశాం. దీని కంటే ముందు కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకురావాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాల్లో సాధ్యమైనన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే ఒక అర్థం ఉండేది. మీరు కూడా జీవితంలో స్థిరపడేవారు. ఉద్యోగాలు లేక యువత ఎంతో నష్టపోయింది." - భట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం
గ్రూప్- 2 పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగుల ధర్నా - Unemployed Protest on Group 2 Exams