ETV Bharat / state

నాడు-నేడు పనుల్లో వైఎస్సార్సీపీ సర్కార్ జాప్యం - చంద్రబాబు ప్రభుత్వంపైనే భారం! - Incomplete of Nadu Nedu Works - INCOMPLETE OF NADU NEDU WORKS

Delay of Nadu Nedu works is Burden of TDP Government: నాడు- నేడు పేరుతో ప్రభుత్వ బడులను బాగు చేస్తామని జగన్‌ సర్కార్‌ గతంలో చేపట్టిన పనులు పూర్తి కాకుండానే ఆగిపోయాయి. వాటి బాధ్యత ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై పడనుంది. పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ డప్పు కొట్టుకునే జగన్‌ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి.

Delay of Nadu Nedu works
Delay of Nadu Nedu works (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 10:43 AM IST

Delay of Nadu Nedu works is Burden of TDP Government: నాడు- నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశామంటూ డప్పు కొట్టుకునే మాజీ సీఎం జగన్‌ మాటలకు వాస్తవ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల నేటికీ మొదటి విడతలో చేపట్టిన పనులు కూడా పూర్తి కాకపోగా రెండో విడత పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చదువుకోవడానికి సరైన గదులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాల నేతలు కోరుతున్నారు.

నాడు- నేడు పేరుతో ప్రభుత్వ బడులను బాగు చేస్తామని జగన్‌ సర్కార్‌ గతంలో పనులకు శ్రీకారం చుట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. కానీ నేటికీ మొదటి విడత పనులే చాలా చోట్ల పూర్తి కాలేదు. రెండో విడత పనులు ఆరంభదశలోనే ఆగిపోయాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదటి విడత పనులు 80 శాతం మాత్రమే పూర్తైనట్లు అధికార గణాంకాలు చెబుతున్నారు. రెండో విడత పనులు 10 శాతం మాత్రమే జరిగాయి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమై స్కూళ్లకు వెళుతున్న విద్యార్థులు అసంపూర్తి నిర్మాణాలతో అవస్థలు పడుతున్నారు.

నాడు-నేడు పనుల్లో వైఎస్సార్సీపీ సర్కార్ జాప్యం - చంద్రబాబు ప్రభుత్వంపైనే భారం! (Delay of Nadu Nedu works)

'ఇల్లు పీకి పందిరేశారు!' - నాడు, నేడు పనుల్లో అంతులేని నిర్లక్ష్యం - Nadu Nedu School Works

రెండో విడత కింద ఉమ్మడి కర్నూలు జిల్లావ్యాప్తంగా 1,827 పాఠశాలలను ఎంపిక చేశారు. వాటిలో కర్నూలు జిల్లాలో 974 పాఠశాలలు ఎంపిక కాగా వీటిలో 658 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలల్లో పనులు మంజూరయ్యాయి. వివిధ నిర్మాణాల కోసం 425 కోట్ల 94 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. నంద్యాల జిల్లాలో 853 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 608 ప్రాథమిక, 59 ప్రాథమికోన్నత, 186 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు 363 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో చాలా పాఠశాలల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.

నంద్యాల జిల్లాలోని 79 పాఠశాలల్లో 394 అదనపు గదుల నిర్మాణానికి 47 కోట్ల 28 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో చాలా పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. అదనపు గదుల నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ర్యాంపులు, విద్యుత్తు సామగ్రి, ఫ్లోరింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఫర్నీచర్‌ సమకూర్చాల్సి ఉంది. గతేడాది చివర్లోనే ఈ పనులన్నీ ఆగిపోయాయి కొత్త ప్రభుత్వం పాఠశాలలపై దృష్టి సారించి అసంపూర్తి పనులను పూర్తి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ సంఘాల నేతలు కోరుతున్నారు.

నో బిల్స్​ - నిలిచిన నాడు-నేడు పనులు, ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు - Nadu Nedu Works INCOMPLETE

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.