ETV Bharat / state

LIVE UPDATES : సభలో బీఆర్ఎస్‌ సభ్యుల ఆందోళన - సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 31, 2024, 10:16 AM IST

Updated : Jul 31, 2024, 3:58 PM IST

Telangana Assembly Session
Telangana Assembly Session Today (ETV Bharat)

Telangana Assembly Session Today : శాసనసభతోపాటు మండలిలో బుధవారం రోజున ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే నేరుగా ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టారు.

LIVE FEED

3:56 PM, 31 Jul 2024 (IST)

సభ రేపటికి వాయిదా

సభ రేపటికి వాయిదా వేసిన సభాపతి

3:51 PM, 31 Jul 2024 (IST)

సబితా మాట్లాడిన తర్వాతే మేము మాట్లాడుతాం : అక్బరుద్దీన్‌ ఓవైసీ

సబిత పేరును ప్రస్తావించినందునే సీఎం, డిప్యూటీ సీఎం ప్రస్తావించారని అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు.

సభానియమాల ప్రకారం పేరు ప్రస్తావించినందున సబితకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు.

సబితా మాట్లాడిన తర్వాతే మేము, ఇతర సభ్యులం మాట్లాడతామని అక్బరుద్దీన్‌ ఓవైసీ తెలిపారు.

3:38 PM, 31 Jul 2024 (IST)

శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన

శాసనసభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన కొనసాగిస్తున్నారు. సబితకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబడ్డారు.

1:12 PM, 31 Jul 2024 (IST)

అధికారం కోసం సబిత పార్టీ మారారు: భట్టి విక్రమార్క

ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరు సరికాదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. 2004లో వేరే పార్టీలో ఉన్న సబితను కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుందని తెలిపారు. 2004 కు ముందు సబిత వేరే పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ సబితకు టికెట్‌ ఇచ్చిందని చెప్పారు. 2004, 2009లో సబితకు కాంగ్రెస్‌ కీలక మంత్రి పదవి ఇచ్చిందని, దశాబ్ద కాలం మంత్రిగా ఉన్న సబితకు 2014లోనూ కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చిందని వెల్లడించారు. 2014లో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని, అధికారం కోసం సబిత పార్టీ మారారని ధ్వజమెత్తారు. 2014లో కాంగ్రెస్‌ ఎస్సీ అయిన తనను సీఎల్పీ నేతను చేసిందని గుర్తు చేసుకున్నారు.

1:04 PM, 31 Jul 2024 (IST)

సబితక్క నన్ను పార్టీలోకి ఆహ్మానించిన మాట వాస్తవం : రేవంత్‌రెడ్డి

సబితక్క తనను పార్టీలోకి ఆహ్మానించిన మాట వాస్తవమేనని సీఎం రేవంత్​ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారని, సబిత సభలో ప్రస్తావించారు కాబట్టే అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలని వ్యాఖ్యానించారు. 2019లో మల్కాజిగిరిలో పోటీచేయాలని కాంగ్రెస్‌ పార్టీ కోరిందని చెప్పారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారని వెల్లడించారు. కాంగ్రెస్‌ తనను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే బీఆర్‌ఎస్‌లో చేరారని తెలిపారు. అధికారం కోసం కాంగ్రెస్‌ను వదిలి బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని మండిపడ్డారు. తమ్ముడిగా తనను మోసం చేశారు కాబట్టే కేటీఆర్‌ను నమ్మవద్దని చెప్పానని పేర్కొన్నారు.

12:59 PM, 31 Jul 2024 (IST)

మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించాను : సబిత

రేవంత్‌రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారని మాజీమంత్రి సబిత ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డిని పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించానని, ఆయనకు నాపై ఎందుకు కక్ష? అని సబిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఆశాకిరణం అవుతావని చెప్పానని, సీఎం అవుతావని కూడా చెప్పానని పేర్కొన్నారు. మనస్ఫూర్తిగా రేవంత్‌రెడ్డిని ఆశీర్వదించాను అని తెలిపారు.

12:51 PM, 31 Jul 2024 (IST)

మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని ముసలికన్నీరు కారుస్తున్నారు : సీఎం రేవంత్‌రెడ్డి

ప్రతిపక్ష నేత సభకే రారని, వారు కలిసి వస్తామంటే ఎలా నమ్మాలని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. 2014 నుంచి 2018 వరకు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. ఐదేళ్లు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని ముసలికన్నీరు కారుస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకరించాలని అనుకుంటే ప్రతిపక్ష నేత సభకు రావాలని డిమాండ్​ చేశారు.

12:50 PM, 31 Jul 2024 (IST)

కేంద్రం నుంచి రూ.800 కోట్లను విడుదల చేయాలి : కేటీఆర్‌

పాలమూరు జిల్లాలో మెుత్తం రిజర్వాయర్లు మేము కట్టామని కేటీఆర్‌ తెలిపారు. కొత్త సర్పంచలు వచ్చేలోపల పాత సర్పంచ్‌ల బకాయిలు త్వరగా చెల్లించాలని, కేంద్రం నుంచి రూ.800 కోట్లను విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.

12:47 PM, 31 Jul 2024 (IST)

మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని కోరుతున్నా: మంత్రి కోమటిరెడ్డి

మూసీ నది కాలుష్యం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరించాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు.

12:44 PM, 31 Jul 2024 (IST)

మూసీ నదికి సంబంధించి సీఎం ఒక ప్రణాళికతో : శ్రీధర్‌బాబు

మూసీ నదికి సంబంధించి సీఎం ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో డీపీఆర్‌ పూర్తికాలేదని, మూసీ నది ప్రక్షాళన విషయంలో పారదర్శకంగా ముందుకెళ్తామని చెప్పారు.

12:37 PM, 31 Jul 2024 (IST)

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం ఉందా? లేదా? : మంత్రి పొన్నం

మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం బీఆర్‌ఎస్‌కు ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రయాణించారని తెలిపారు. మహిళలు బస్సుల్లో ఉరికేనే తిరుగుతున్నారని ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

12:30 PM, 31 Jul 2024 (IST)

గత పదేళ్ల నుంచి మాకు, రేవంత్​కు చెడింది : కేటీఆర్‌

రేవంత్‌రెడ్డి తనకు 18 ఏళ్ల నుంచే తెలుసని, తనకు మంచి మిత్రుడే అని కేటీఆర్‌ తెలిపారు. గత పదేళ్ల నుంచి తనకు, రేవంత్​కు చెడిందని వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం తాము అధికారంలోకి వచ్చినప్పుడు రూ.1800 ఫీజురియింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేశామని చెప్పారు.

12:13 PM, 31 Jul 2024 (IST)

హెల్త్‌ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ వైద్యసౌకర్యాలు కల్పిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

హెల్త్‌ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ వైద్యసౌకర్యాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి తెలిపారు. నిఖత్ జరీన్​కు గ్రూప్‌- 1స్థాయి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఏఐని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి తాము చెబుతామని తెలిపారు. ముచ్చర్లలో ఫోర్త్‌ సిటీ నిర్మించబోతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌ తర్వాత ముచ్చర్లలో ఫోర్త్ సిటీ వస్తుందని పేర్కొన్నారు. పదేళ్ల అనుభవం ప్రజల కోసం వినియోగించాలని, రాజకీయాల కోసం కాదని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రతి విషయంలో పాలసీలు తీసుకువస్తుందని తెలిపారు.

12:03 PM, 31 Jul 2024 (IST)

రేపు స్కిల్‌ వర్సిటీని ప్రారంభిస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

ఎయిర్‌పోర్టుకు ఎంఎంటీఎస్‌ను నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా అని ముఖ్యమంత్రి రేవంత్​ ప్రశ్నించారు. ట్యాంక్‌బండ్‌లోని నీటిని కొబ్బరి నీళ్లు చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. రేపు సాయంత్రం 4 గంటలకు స్కిల్‌ వర్సిటీని ప్రారంభిస్తామని ప్రకటించారు. స్కిల్‌ వర్సిటీని ప్రారంభోత్సవంలో ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి పాల్గొనాలి పేర్కొన్నారు.

12:00 PM, 31 Jul 2024 (IST)

బతుకమ్మ చీరల విషయంలో ఆడబిడ్డలు తిరుగుబాటు చేశారా?లేదా? : సీఎం రేవంత్‌రెడ్డి

పది నెలల పూర్తి కాని మా పాలనపై కొన్ని వందల ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్​ఎస్​ను ఉద్దేశిస్తూ బతుకమ్మ చీరల కాంట్రాక్టు మీ బినామీలకు ఇచ్చి, సూరత్‌ నుంచి తీసుకువచ్చారా? లేదా చెప్పాలని డిమాండ్​ చేశారు. బతుకమ్మ చీరల విషయంలో ఆడబిడ్డలు తిరుగుబాటు చేశారా? లేదా? అని ప్రశ్నించారు. సూరత్‌ నుంచి చీరలు తీసుకువచ్చి పేదలను మోసం చేశారని మండిపడ్డారు.

11:54 AM, 31 Jul 2024 (IST)

మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు : సీఎం రేవంత్‌రెడ్డి

సభ తప్పుదోవ పట్టించడానికే కేటీఆర్‌కు ఇచ్చిన సమయాన్ని వినియోగించుకోవడానికి చూస్తున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ను ఉద్దేశిస్తూ పదేళ్ల మీ పాలనలో మీ అనుభవాలు మీకు ఉన్నాయని ప్రజలకు అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. మీ పాలన అనుభవాలతో ప్రజలు మాకు అధికారం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

11:45 AM, 31 Jul 2024 (IST)

చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి: కేటీఆర్

చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కేటీఆర్​ డిమాండ్​ చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో తప్పులు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. గొర్రెలు ఇవ్వకుండా డీడీలు మాత్రమే ఇచ్చారని, కచ్ఛితంగా గొర్రెలు ఇవ్వాల్సిందేనని ఉద్ఘాటించారు. ఫార్మాసిటీ భూములు వెనక్కు తిరిగి ఇస్తామని చెప్పారని తెలిపారు.

11:42 AM, 31 Jul 2024 (IST)

చేనేత కార్మికల సమస్యను పరిష్కరిస్తాం : మంత్రి పొన్నం

సిరిసిల్ల చేనేత కార్మికల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.

11:37 AM, 31 Jul 2024 (IST)

ఉన్న దళితబంధు చెక్కులే ఆపుతున్నారు : కేటీఆర్‌

శతకోటి సమస్యలకు కారణం కాంగ్రెస్‌ అని కేటీఆర్‌ విమర్శించారు. 6,650 మంది పేద విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఇచ్చి పంపించామని పేర్కొన్నారు. దళితబంధు కాదని, అంబేడ్కర్ అభయహస్తం ఇస్తామన్నారని గుర్తుచేశారు. రూ.10 లక్షలకు కాదని, రూ.12 లక్షలు ఇస్తామని చెప్పారని తెలిపారు. బడ్జెట్‌లో పది పైసలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఉన్న దళితబంధు చెక్కులే ఆపుతున్నారని ఆరోపించారు. రూ.10 లక్షలకు కాదని, రూ.12 లక్షలు ఇస్తామన్న మాటల నిలుపుకోవాలని డిమాండ్​ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక 14 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.

11:29 AM, 31 Jul 2024 (IST)

బీఆర్‌ఎస్‌ పార్టీ వారికే దళితబంధు ఇచ్చారు : అడ్లూరి లక్ష్మణ్‌

పేద దళితులకు దళితబంధు ఇవ్వలేదని అడ్లూరి లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వారికే దళితబంధు ఇచ్చారని ఆరోపించారు. అమెరికా వెళ్లవారికి రుణాలు ఇచ్చామని కేటీఆర్ అన్నారని అడ్లూరి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. గతంలో ఎస్సీ ఉపముఖ్యమంత్రిని బర్త్‌రఫ్ చేశారని, బీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు బడ్జెట్‌లో పెట్టిన నిధులను వినియోగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

11:25 AM, 31 Jul 2024 (IST)

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు, మహిళలను కూడా మోసం చేసింది : కేటీఆర్‌

రైతు భరోసా గురించి బడ్జెట్‌లో నిధులు ఎందుకు ఇవ్వలేదని కేటీఆర్​ ప్రశ్నించారు. ఫసల్‌ బీమాను గుజరాత్‌ పట్టించుకోలేదని, గతంలో తాము ఫసల్‌ బీమాను పట్టించుకోలేదని పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రేషన్‌కార్డు, కుటుంబం పేరిట కట్టింగ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. రైతులు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని, పత్రిక ప్రకటనల్లో రెండు, మూడు సార్లు రుణమాఫీ అంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదని, మహిళలను కూడా మోసం చేసిందని విమర్శించారు. కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వాలని, ప్రస్తుతం గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సరిగా లేదని ధ్వజమెత్తారు.

11:17 AM, 31 Jul 2024 (IST)

ఇబ్బంది పెట్టారు అందుకే ప్రజలు మాకు పట్టం కట్టారు : సీతక్క

పదేళ్ల అధికారంలో ఉండి మీరు(బీఆర్​ఎస్​) ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదని సీత్కక ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఆశావర్కర్లు, అంగన్వాడీల, బస్సు డ్రైవర్ల తల్లిదండ్రుల పింఛన్లు తొలగించారని మండిపడ్డారు. చిరు ఉద్యోగాలు తల్లిదండ్రుల పింఛన్ తొలగించిందే బీఆర్ఎస్‌ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో సామాన్యులకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టారని, అందుకే ప్రజలు తమకు పట్టం కట్టారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలకు ఇళ్ల కూడా ఇవ్వలేదని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు ఇవ్వలేదని తెలిపారు.

11:10 AM, 31 Jul 2024 (IST)

రేవంత్‌ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు : కేటీఆర్‌

32 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించారని కేటీఆర్​ మండిపడ్డారు. సభ వాయిదా పడగానే ఆశోక్‌నగర్‌కు సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి వెళ్లేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. ఒక్క ఉద్యోగం అయినా రేవంత్‌ ప్రభుత్వం ఇచ్చిందని చెబితే అక్కడనే రాజీనామా చేస్తామని సవాల్​ చేశారు. రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసకుంటానని వ్యాఖ్యానించారు. తనతో కలిసి అశోక్‌నగర్‌ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే లక్షలమంది యువతతో సన్మానం చేయిస్తామని పేర్కొన్నారు.

11:06 AM, 31 Jul 2024 (IST)

బడ్జెట్‌లో వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లకు నిధులు కేటాయించలేదు : కేటీఆర్‌

కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు కొండంత అని, బడ్జెట్‌లో నిధులు గొరంత అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా ఇవ్వలేదని ఆరోపించారు. ఆడబిడ్డకు 2,500 ఆర్థికసాయం అందించలేదని ధ్వజమెత్తారు. వృద్ధులు, దివ్యాంగుల పింఛన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని మండిపడ్డారు.

11:02 AM, 31 Jul 2024 (IST)

పదేళ్లుగా ఉద్యోగులను మోసం చేసింది బీఆర్‌ఎస్‌ : సీతక్క

ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి, పదేళ్లు ఉద్యోగులను మోసం చేసింది బీఆర్‌ఎస్‌ అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లపాటు ఓయూకు వెళ్లలేని పరిస్థితి తెచ్చుకున్నారని విమర్శించారు.

10:58 AM, 31 Jul 2024 (IST)

కాంగ్రెస్‌కు మిగుల బడ్జెట్‌తోనే ప్రభుత్వాన్ని అప్పగించాం : కేటీఆర్​

ఆరు నూరైన 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట తప్పనందుకు మిమ్మల్ని అభినందించాలని కాంగ్రెస్​ నేతలను ఉద్దేశిస్తూ కేటీఆర్​ పేర్కొన్నారు. 420 హామీలు తుంగలో తోక్కినందుకు అభినందించాలని, అభినందించడం కాదని, తాము అభిశంసించాలని వ్యాఖ్యానించారు. తిరిగి రీకాల్‌ పద్ధతి లేదని, అందుకే మిమ్మల్ని ఐదేళ్లు భరించాల్సిందేనని విమర్శించారు. కాంగ్రెస్‌కు మిగుల బడ్జెట్‌తోనే ప్రభుత్వాన్ని అప్పగించామని పేర్కొన్నారు.

10:54 AM, 31 Jul 2024 (IST)

కేసీఆర్‌ ఆనవాళ్లను చేరిపేస్తామనడం సరికాదు : కేటీఆర్​

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌తో తలసరి ఆదాయంలో తెలంగాణ పోటీపడడం మన గర్వకారణ కాదా అని కేటీఆర్​ ప్రశ్నించారు. ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇవ్వమని కేంద్రాన్ని మీరు అడగండి అర్థం చేసుకుంటారని ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేయడానికి పడుతున్న కష్టం తమకు తెలిసని, పెద్ద మెుత్తంలో డబ్బులు సమకూర్చడంలో ఎంత కష్టమో తమకు తెలుసని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఆనవాళ్లను చేరిపేస్తామనడం సరికాదని హెచ్చరించారు.

10:49 AM, 31 Jul 2024 (IST)

తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్‌ : కేటీఆర్​

రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.14.65 లక్షల కోట్లకు పెరిగిన విషయం ఎందుకు విస్మరిస్తున్నారని కేటీఆర్​ ప్రశ్నించారు. 2014లో ద్రవ్య లోటు 1.9 శాతం, 2023-24లో 2.5 శాతం ఉందని, తలసరి ఆదాయంలో నంబర్ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాలు ముందున్నాయని తెలిపారు.

10:44 AM, 31 Jul 2024 (IST)

రెవెన్యూ మిగులు ఉంటే జీతాలు ఎందుకు ఆలస్యంగా అందించారో చెప్పాలి : భట్టి

రెవెన్యూ మిగులు ఉంటే జీతాలు ఎందుకు ఆలస్యంగా అందించారో చెప్పాలని భట్టి డిమాండ్​ చేశారు. ఆద్భుతంగా ఉన్న రెవెన్యూ నిధులను ఎక్కడి మళ్లించారో కేటీఆర్‌ చెప్పాలని వ్యాఖ్యానించారు.

10:40 AM, 31 Jul 2024 (IST)

ఎన్నికలు అయిపోయాయి, ఇప్పటికి అప్పుల అంటూ విమర్శించడం సరికాదు : కేటీఆర్​

కరోనాతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యిందని కేటీఆర్​ పేర్కొన్నారు. కరోనాకు ముందు తాము కూడా జీతాలు సక్రమంగానే ఇచ్చామని గుర్తుచేశారు. కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా రైతుబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి ఆగవద్దని అనుకున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే డబ్బులు ఆగవద్దని వాటికి నిధులు మళ్లించి ఉండవచ్చుని చెప్పారు. ఇప్పటికి కాంగ్రెస్‌ పాలనలో కాంట్రాక్ట, మెడికల్‌ ఆఫీసర్లకు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. తమ పాలనలో అప్పులు రెవెన్యూ బిల్లులకు లోబడి ఉన్నాయని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయని, ఇప్పటికి అప్పుల అంటూ విమర్శించడం సరికాదని హెచ్చరించారు. తాము చేసిన నికర అప్పు రూ.3,85,340 కోట్లు మాత్రమే అని తెలిపారు.

10:32 AM, 31 Jul 2024 (IST)

మిగులు బడ్జెట్‌లో అప్పగిస్తే అప్పుల కుప్పగా ఇచ్చారని పదేపదే విమర్శిస్తున్నారు : కేటీఆర్​

మిగులు బడ్జెట్‌లో అప్పగిస్తే అప్పుల కుప్పగా ఇచ్చారని పదేపదే విమర్శిస్తున్నారని కేటీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ రెవెన్యూ మిగులు రూ.369 కోట్లని, 2022-23 రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లు ఉందని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు 209 కోట్లు అని వెల్లడించారు. అప్పటి కాంగ్రెస్‌ మాకు రూ.369 కోట్లతో అప్పగించారని, తాము రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో అప్పగించామని తెలిపారు. జీతాలు ఇచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి చెబుతున్నారని, బడ్జెట్‌లో మాత్రం రెవెన్యూ మిగులు ఉందని చెబుతున్నారని తెలిపారు. మంత్రులు సభలో చెబుతున్న మాటలు తప్పా బడ్జెట్‌లో ఉన్న లెక్కలు తప్పా అనేది చెప్పాలని డిమాండ్​ చేశారు.

10:27 AM, 31 Jul 2024 (IST)

ఎన్నికలకు ముందు అభయహస్తం- అధికారంలోకి వచ్చాక శూన్య హస్తం : కేటీఆర్​

ప్రజల కోసం ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తీసుకునే అంశాలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేటీఆర్​ స్పష్టం చేశారు. స్కిల్ వర్సిటీని తప్పుకుండా స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అభయహస్తం, అధికారంలోకి వచ్చాక శూన్య హస్తం అని ఎద్దేవా చేశారు. రాష్ట్రం క్యాన్సర్‌, ఎయిడ్స్‌ రోగిలాగా దివాలా తీసిందన్న మాటలు సరికావుని ఆక్షేపించారు.

10:21 AM, 31 Jul 2024 (IST)

ఆంధ్ర-తెలంగాణ మత ఘర్షణలు వస్తాయన్నారు : కేటీఆర్​

విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారని కేటీఆర్​ చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావు ఉన్న పెట్టుబడులు పోతాయన్నారని గుర్తుచేశారు. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్య ఉంటుందన్నారని పేర్కొన్నారు. ఆంధ్ర-తెలంగాణ మత ఘర్షణలు వస్తాయన్నారని, తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారని తెలిపారు. తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా అని అన్నారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పాడిన తర్వాత ఉత్పత్తులు, సంపద పెరిగిందని భట్టి విక్రమార్క సభలో చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణ దేశానికి ఎకనామిక్‌ ఇంజిన్‌ అని శ్రీధర్‌బాబు చెప్పారని, రాష్ట్ర పురోగతిపై వాస్తవాలు చెప్పినందుకు మంత్రులను అభినందిస్తున్నాని వ్యాఖ్యానించారు. ఉద్యమాలకు ఉదయించిన తెలంగాణ ఇప్పుడు ఉజ్వలంగా వెలుగుతోందని చెప్పారు.

10:17 AM, 31 Jul 2024 (IST)

పదేళ్లలో రాష్ట్రసంపద పెరిగిందని భట్టి విక్రమార్క గతంలో చెప్పారు, అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారు : కేటీఆర్​

పదేళ్ల క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ చీకట్లతో నిండిపోతుందని చెప్పారని కేటీఆర్​ పేర్కొన్నారు. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా అని ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది అన్నారని గుర్తుచేశారు. పదేళ్లలో రాష్ట్రసంపద పెరిగిందని భట్టి విక్రమార్క గతంలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర సందప రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్లకు పెరిగిందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పిందని తెలిపారు.

10:12 AM, 31 Jul 2024 (IST)

చర్చను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. చర్చను బీఆర్‌ఎస్‌ సభ్యుడు కేటీఆర్ ప్రారంభించారు. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.

Last Updated : Jul 31, 2024, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.