Dastagiri Condemned the Attack on his Father by YCP Activists: అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) బెయిలుపై ఉండటం వల్లే తమ తండ్రిపై దాడికి పాల్పడ్డారని వివేక హత్య కేసులో అప్రూవర్‌గా (Vivekananda Reddy murder case) ఉన్న దస్తగిరి హెచ్చరించారు. వెంటనే ఆయన బెయిలు రద్దు చేసే విధంగా న్యాయస్థానాలు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పులివెందుల వైసీపీ నాయకులకు తనను టచ్ చేసే దమ్ము లేక తన తండ్రి పైన దాడికి పాల్పడ్డారని దస్తగిరి అన్నారు. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి నామాల గుండు ఉత్సవాలలో పాల్గొనేందుకు వెళ్లిన తమ తండ్రి పైన వైసీపీ కార్యకర్తలు దాడులకు (YCP leaders Attacks) పాల్పడినట్లు దస్తగిరి పేర్కొన్నారు. పులివెందులలో సామాన్యుడు ఎన్నికల్లో నిలబడకూడదా అని ప్రశ్నించారు.
వివేకా హత్య కేసులో నిందితుడిని కాదు - సాక్షిని మాత్రమే: దస్తగిరి
దాడి ఘటనపైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా ఎస్పీ, సీబీఐ అధికారులకు కూడా సమాచారం అందించానని చెప్పారు. ఈనెల 12న హైదరాబాద్ సీబీఐ కోర్టులో తన తండ్రిపై జరిగిన దాడి ఘటనపై పిటిషన్ దాఖలు చేస్తానని దస్తగిరి తెలిపారు. పులివెందుల వైసీపీ నాయకులకు నన్ను టచ్ చేయాలి కానీ మా కుటుంబం జోలికి రావాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. మీరు అదేవిధంగా ముందుకెళితే నేను దేనికైనా సిద్ధమేనని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని దస్తగిరి హెచ్చరించారు. తాను తలచుకుంటే పులివెందులలో వార్ వన్ సైడ్ అవుతుందని అన్నారు.
ఎంపీ టికెట్టు విషయంలోనే వివేకాను సీఎం జగన్ చంపించారు: దస్తగిరి
ఇదీ జరిగింది: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా (Vivekananda Reddy murder case approver) ఉన్న దస్తగిరి తండ్రి షేక్ హాజీవలీపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి పులివెందుల సమీపంలోని నామాలగుండు వద్ద దాడిచేశారు. శివరాత్రి జాగరణ కోసం వెళ్లిన దస్తగిరి తండ్రిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకుని సీఎం జగన్‌పై పోటీ చేసేంత ధైర్యం నీ కుమారునికి ఉందా? అంటూ తీవ్రంగా దాడి చేశారని, అసభ్య పదజాలంతో విచక్షణారహితంగా తలపైన తీవ్రంగా కొట్టినట్లు దస్తగిరి తండ్రి తెలిపారు.
ఏపీలో ప్రాణహాని ఉంది - రక్షణ కల్పించండి: తెలంగాణ సీఎంకు దస్తగిరి విజ్ఞప్తి
బాధితుడు ప్రస్తుతం పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పులివెందుల పోలీసులకు దస్తగిరి ఫిర్యాదు చేశారు. ఇటీవలే దస్తగిరి జై భీమ్ భారత్ పార్టీలో (Jai Bheem Bharat Party) చేరాడు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా (Pulivendula MLA candidate Dastagiri) ఆ పార్టీ తరఫున బరిలో దిగుతున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు తమ కుటుంబంపై దౌర్జన్యాలకు తెగ బడుతున్నారని బాధితుడు పేర్కొన్నాడు.