ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవిగా దుర్గమ్మ - దర్శనానికి పోటెత్తిన భక్తులు - DEVI NAVARATRI CELEBRATIONS

మూలా నక్షత్రం సంద‌ర్భంగా సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ

DEVI_NAVARATRI_CELEBRATIONS
DEVI_NAVARATRI_CELEBRATIONS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 12:13 PM IST

Dasara Sharan Navaratri Celebrations in Vijayawada : ఇంద్రకీలాద్రిపై ఏడో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పటిష్ఠ భద్రత చర్యలు తీసుకుంది.

మూలా నక్షత్రం పురస్కరించుకొని అదనంగా 1100 మంది పోలీసులు, 110 హోల్డింగ్​ టీంలతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ అన్ని రకాల ప్రత్యేక టికెట్​ దర్శనాలతోపాటు అంతరాలయ దర్శనాన్నీ దేవస్థానం అధికారులు రద్దు చేశారు. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఇందుకు పోలీసులు, దేవస్థానం అధికారులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు.

వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - ఆలయాలకు క్యూ కట్టిన భక్తులు

మూలా నక్షత్రం విశిష్టత : దుర్గాదేవి అలంకారాలన్నిటిలో మూలానక్షత్రం నాటి సరస్వతీదేవి అలంకారానికి ఎనలేని ప్రాముఖ్యత ఉందని ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత శర్మ తెలిపారు. నరుణ్ణి నరోత్తముడిగా చేసి, నారాయణ తత్త్వాన్ని ప్రసాదించే చదువుల తల్లి సరస్వతీదేవిగా భక్తులు అమ్మవారిని ఆరాధన చేస్తారని పేర్కొన్నారు. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు అన్నిటికీ సరస్వతీదేవి అధిష్ఠాన దేవత అని అన్నారు. ఋగ్వేదం, దేవీభాగవతం, బ్రహ్మవైవర్త పురాణాల్లో సర్వసతీదేవి గురించి అనేక గాథలు విస్తారంగా వర్ణితమై ఉన్నాయని అన్నారు. కచ్ఛపి అనే వీణ, పుస్తకం, అక్షమాల, ధవళ వస్త్రాలు ధరించి, నెమలిని అధిరోహించిన రూపంలో ఈ తల్లి దర్శనమిస్తుందని తెలిపారు. అనంత స్వరూపిణి, సర్వశక్తి స్వరూపిణి, సర్వాంతర్యామిని, విజ్ఞానదేవత, వివేకదాత్రిగా శాస్త్రాలు, పురాణ, ఇతిహాసాలు సరస్వతీదేవిని వర్ణిస్తున్నాయని పేర్కొన్నారు.

శ్రీమహాచండీ అలంకారంలో కనకదుర్గమ్మ - వేద పండితులు ఏం చెప్తున్నారంటే! - Navaratri celebrations 5th day

సరస్వతీ దేవి ఉపాసనతో లౌకిక విద్యలతో పాటు అలౌకికమైన మోక్షవిద్య కూడా అవగతమవుతుందని యనమండ్ర ఉమాకాంత శర్మ అన్నారు. సకల చరాచర కోటిలో వాగ్రూపంలో ఉంటూ, వారిని చైతన్యవంతులుగా చేసే శక్తి అమ్మవారికి ఉందని పేర్కొన్నారు. సరస్వతీదేవి జ్ఞానాన్ని అందించి, భవసాగరాన్ని దాటిస్తుందన్నారు. సకల బుద్ధులను ప్రకాశింపజేస్తుంది అని ఋగ్వేదం సరస్వతీదేవిని స్తోత్రం చేస్తోందని వెల్లడించారు. 'అ' నుంచి 'క్ష' వరకు ఉన్న అన్ని అక్షరాలతో ఏర్పడే సకల వాజ్ఞ్మయము, సంగీతాది సకల కళలూ ఈ తల్లి వరప్రసాదమేమని తెలియజేశారు. అందుకనే సరస్వతీ ఉపాసన ద్వారా సకల విద్యలూ కరతలామలకం అవుతాయని పెద్దలు చెబుతారని తెలిపారు. వ్యాసుడు, వాల్మీకి, యాజ్ఞవల్క్యుడు మొదలైన ఋషులందరికీ ఈ తల్లి అనుగ్రహం ద్వారానే లోకోత్తర చరితులయ్యారని పండితులు వివరించారు.

లలితా త్రిపుర సుందరీదేవిగా దుర్గమ్మ - అమ్మవారి సేవలో సినీప్రముఖులు - Dasara Navaratri 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.