Dasara Sharan Navaratri Celebrations 2024 : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లును అధికారులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు దుర్గాఘాట్ సమీపంలో కొండరాళ్లు జారిపడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు రోడ్డును సగం వరకు మూసివేస్తూ తాత్కలిక గడ్డర్లను ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ఆలయ సిబ్బంది జాతీయ రహదారిపై మధ్య క్యూలైనుకు ఏర్పాటు చేశారు. అపరిశుభ్రంగా ఉన్న దుర్గాఘాట్‌ను శుభ్రం చేస్తున్నారు. ఈసారి జరిగే ఉత్సవాలకు గడ్డర్లు ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. అమ్మవారి దర్శనానికి కుమ్మరిపాలెం సెంటరు వైపు నుంచి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా క్యూలైను ఏర్పాటు చేశారు.
మల్లేశ్వర ఆలయం సమీపంలో ఐరన్ మెట్లు : ఘాట్ రోడ్డు మార్గంలో దర్శనం చేసుకున్న భక్తులు మల్లేశ్వరాలయ మెట్లు, మల్లికార్జున మహా మండపం ర్యాంపు ద్వారా బయటకు విధంగా ఏర్పాటు చేశారు. గతంలో అత్యవసర సమయంలో మాత్రమే ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. ఏటా అధిక శాతం భక్తులు మల్లేశ్వరాలయ మెట్ల మార్గం నుంచి కనక దుర్గానగర్ ప్రసాదాల కౌంటర్లకు చేరేవారు. ఈ సారి కనకదుర్గానగర్‌లో ఎలివేటెడ్ క్యూలైన్లు, ప్రసాదాల పోటు, అన్నదాన భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా మల్లేశ్వర ఆలయం సమీపంలో ఐరన్ మెట్లు ఏర్పాటు చేశారు. వీటితో పాటు కొత్త ర్యాంపు, భక్తులు పాత మెట్ల మార్గం ద్వారా నేరుగా బ్రాహ్మణ వీధిలోకి చేరేందుకు అవకాశం ఉంది. గతంలో అమ్మవారి దర్శనానికి ఒక ఎంట్రీ, ఒక ఎగ్జిట్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం అభివృద్ధి పనులు జరుగుతుండటంతో అదనంగా మూడు ఎగ్జిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలియజేశారు.
ఇంద్రకీలాద్రిపై ప్రతిష్ఠాత్మకంగా దసరా ఏర్పాట్లు : మంత్రి ఆనం - Dussehra Arrangements
అదనంగా సిద్ధం : దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు సుమారు 7 లక్షల మంది ఉంటారని దేవస్థానం అధికారులు అంచనా వేశారు. భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని 15 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధం చేయనున్నారు. అందుకు అవసరమైన పొయ్యిలు ప్రసాదాల పోటులో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం ప్రసాదాల తయారీకి వినియోగించే వాటికి అదనంగా 30 పొయ్యిలను ఏర్పాటు చేశారు. వాటిని తరలించేందుకు ప్రసాదాల పోటు రెండో ఎగ్జిట్‌కు అడ్డుగా ఉన్న నేతి డబ్బాలను తొలగించారు. అమ్మవారి ప్రసాదాలను ఆలయ ప్రాంగణానికి తరలించే వాహనాలు, సిబ్బంది కోసం కొంత ఖాళీ స్థలాన్ని కూడా వదిలారు.
తుది దశకు చేరాయి : అమ్మవారి ఉత్సవాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజులే సమయం ఉంది. ఈ క్రమంలోనే ఘాట్ రోడ్డు రక్షణ గోడ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ మార్గంలో క్యూలైన్లు ఇప్పటికే మొదటి మలుపు వరకు పూర్తి అయ్యాయి. కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి నుంచి దుర్గగుడి టోల్‌గేటు వరకు క్యూలైను నిర్మాణాన్ని దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. రక్షణ గోడ పూర్తైన వెంటనే టోల్‌గేటు నుంచి గోడ వరకు పది గంటల్లో లైన్ల ఏర్పాటు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు.
దసరా పండుగకు ఇంటికి వెళ్తున్నారా? - అయితే మీకో శుభవార్త - dasara Special Buses