ETV Bharat / state

దాండియా నృత్యం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు - మరి ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..? - DANDIYA IS THE BEST FITNESS WORKOUT

దాండియా నృత్యం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్ని ప్రయోజనాలు - మరి దాండియా ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..? అది ఎలాగో తెలుసుకుందాం..

DANDIYA TO BURN CALORIE
Dandiya Is The Best Fitness workout (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2024, 2:53 PM IST

Dandiya Is The Best Fitness workout : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎక్కడ చూసినా దాండియా ఆటలే కనిపిస్తాయి. మగ అనే తేడా లేకుండా ఈ నృత్యంలో పాల్గొని పెద్దఎత్తున సందడి చేస్తారు. అయితే దాండియా గర్బా గుజరాతీ సంప్రదాయ జానపద నృత్యాల్లో ఇవి చాలా ప్రత్యేకమైనవి. బృందావనంలో రాధాకృష్టుల లీలా వినోదాన్ని, హోలీ సంబరాల్ని కళ్లకు కట్టినట్లుగా ఈ నృత్యాల ద్వారా ప్రదర్శిస్తారు అక్కడి యువతీయువకులు.

దసరా నవరాత్రుల్లో భాగంగా గుజరాత్​తో పాటు, పశ్చిన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కూడా తొమ్మిది రోజుల పాటు దాండియా నృత్యాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాలానుగుణంగా దేశవ్యాప్తం అవడంతో పాటు ప్రపంచ నలుమూలల్లో స్థిరపడిన భారతీయులు సైతం ఏటా నవరాత్రుల్లో ఈ నృత్యాలను ప్రదర్శింస్తుంటారు.

ఇవి కేవలం అందరూ కలిసి ఆనందించడానికి ఆడుకునే ఆటలు మాత్రమేకావు. ఫిట్​నెస్​పరంగా కూడా ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.శరీరంలోని అనవసర కొవ్వులు కరిగి బరువు తగ్గండంతో పాటు రోజువారీ ఒత్తిళ్లు,ఆందోళనలు వంటివి మాయమై మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ క్రమంలో దాండియా ఆడటం వల్ల ఫిట్​నెస్ పరంగా ఇంకా ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం రండి.

మానసిక ప్రశాంతతకు : దాండియా ఆడటం వల్ల రోజంతా ఎదురయ్యే వ్యక్తిగత, వృత్తిపరమైన ఒత్తిళ్ల నుంచి బయటపడి మానసిక ప్రశాంతత పొందుతుంటారు. అందుకే ఏటా దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా సాయంత్రం పూట యువతులు ఎంతో ఉత్సాహంగా ఈ ఆటలో పాల్గొంటారు. దాండియా ఆడుతున్నప్పుడు మెదడులో ఎండార్ఫిన్లు ఉత్పత్తవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను దూరం చేసి శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే ఎంతో సరదాగా సాగే ఈ ఆట ఒత్తిడిని దూరం చేసి మానసికోల్లాసాన్ని అందిస్తుంది.

పాటకు తగ్గ ఆట : దసరా శరన్నవరాత్రోత్సవాల్లో దాండియా ఆటలతో ఆడ, మగ అనే తేడా లేకుండా పెద్దఎత్తున సందడి చేస్తారు. యువతులంతా దాండియా స్టిక్స్ పట్టుకుని పాటకు తగ్గట్లుగా వాటిని ఒకదానికొకటి తగిలిస్తూ లేదంటే జంటగా ఆడుతూ సవ్య, అపసవ్య దిశలలో తిరుగుతుంటారు. దీంతో చేతులు, కాళ్లు, భుజాలు, నడుము ఇలా శరీరంలోని భాగాలన్నింటికీ చక్కటి వ్యాయామం అందుతుంది. అలాగే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా కొనసాగే ఈ నృత్యం ఒత్తిళ్లను తగ్గించి మానసిక ప్రశాంతతను అందిస్తుంది.

నాజూకైన నడుముకు : కొంత మందికి శరీరమంతా ఎలా ఉన్నా, నడుము దగ్గరికి వచ్చేసరికి మాత్రం కాస్త లావుగా కనిపిస్తుంది. చాలా సేపు కూర్చోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మరి దీన్ని తగ్గించుకుని నాజూకైన నడుమును సొంతం చేసుకోవాలంటే దాండియా ఆడాల్సిందే. ఈ ఆటలో నిల్చున్న చోటే నడుమును కుడివైపుకి, ఎడమవైపుకి తిప్పడం, ముందుకు వంగుతూ లేవడం లాంటి కొన్ని భంగిమలుంటాయి. ఇవి నడుముకు చక్కటి వ్యాయామాన్ని అందిస్తాయి. వీటివల్ల ఆ ప్రదేశంలో పేరుకుపోయిన అనవసర కొవ్వులు క్రమంగా కరిగిపోయి నడుము నాజూగ్గా తయారవుతుంది. ఫలితంగా మంచి శరీరాకృతిని కూడా సొంతం చేసుకోవచ్చు.

అవయవాలకు సరైన రక్తప్రసరణ : దాండియా ఆట వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు సరైన రక్తప్రసరణ జరుగుతుంది. అలాగే దీన్ని ఎంత వేగంగా ఆడితే గుండె కొట్టుకునే వేగం కూడా అంతగా పెరుగుతుంది. తద్వారా శరీరంలోని చెడు కొవ్వులు కరిగి, మంచి కొవ్వులు పెరుగుతాయి. వీటితో పాటు ఈ ఆట వల్ల శరీరంలోని చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.

మానసిక ప్రశాంతత : దాండియా ఆట వల్ల శరీరం అలసటకు గురై రాత్రుళ్లు హాయిగా నిద్రపడుతుంది. తద్వారా అటు ఆరోగ్యంగా, ఇటు దృఢంగా కూడా ఉండచ్చు. అందరూ కలిసి ఆడుకునే ఏ ఆటైనా అది వారి మధ్య ఉండే సంబంధబాంధవ్యాలను రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాండియా కూడా అంతే! దాండియా ఫెస్టివల్స్‌లో మనకు పరిచయం ఉన్న వారితో పాటు పరిచయం లేని వారు కూడా ఉంటారు. వారితో కలిసి దాండియా ఆడడం వల్ల పరిచయాలు పెరుగుతాయి. సంబంధాలు బలపడతాయి. నవరాత్రుల్లో ప్రధానమైన దాండియా నృత్యం వల్ల అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారు కదా! మరి దాండియా ఆడుతూ ఫిట్‌నెస్‌ని పెంచుకుందామా..?

వైరల్​ వీడియో : మల్లారెడ్డి బతుకమ్మ డ్యాన్స్ - మీరూ చూడండి - Malla Reddy Dance with Students

Villa Marie College Navaratri Celebrations : విల్లామేరీలో ముందస్తు నవరాత్రి వేడుకలు.. దాండియాతో విద్యార్థినుల ఆటాపాటా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.