ETV Bharat / state

సీఎం చేవెళ్ల సభకు భారీ ఏర్పాట్లు - పరిశీలించిన సైబరాబాద్​ సీపీ - సీఎం రేవంత్​రెడ్డి చేవెళ్ల సభ

CM Revanth chevella meeting Arrangements : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈనెల 27న జరగబోయే సీఎం రేవంత్​రెడ్డి సభ స్థలాన్ని సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. ఈ సభకు ప్రియాంక గాంధీ, ఇతర కీలక నేతలు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్, రూట్ మ్యాపింగ్, సభ నిర్వహణ తదితర విషయాలపై పలు సూచనలు చేశారు.

CM Revanth Clarifies on Two Guarantees
CM Revanth chevella meeting Arrangements
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 24, 2024, 4:23 PM IST

CM Revanth chevella meeting Arrangements : రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చూడుతూ ఈనెల 27న ప్రారంభించబోయే సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) చేవెళ్ల సభకు సర్వం సిద్ధమవుతోంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సైబరాబాద్​ సీపీ అవినాష్​ మహంతి(Cyberabad CP) సభ స్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్, రూట్ మ్యాపింగ్, సభ నిర్వహణ తదితర పూర్తి విషయాలపై ఆయన అరా తీశారు, అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూలో రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ కిషన్, సీఐ లక్ష్మారెడ్డి, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

CM Revanth Clarifies on Two Guarantees : రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు ముందడుగు పడింది. గృహజ్యోతి(Gruha jyothi), గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27 న సీఎం రేవంత్​ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి చేవెళ్ల సభలో ప్రారంభించనున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్​ సబ్​ కమిటీ సమావేశంలో రెండు గ్యారంటీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పథకాల ప్రారంభానికి 27 లేదా 29 తేదీలలో, ఏదో ఒక తారీఖున ప్రారంభించునున్నట్లు ప్రకటించారు.

శుక్రవారం మేడారంను సందర్శించిన సీఎం రేవంత్​రెడ్డి 27న ప్రియాంక గాంధీతో కలిసి పథకాలను ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాల అమలుకు సీఎం రేవంత్​రెడ్డి కార్యాచరణ ప్రారంభించారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్​

Gas Subsidy Scheme in Telangana : మహాలక్ష్మి పథకంలో భాగంగా గ్యాస్‌ రాయితీ లబ్ధిదారులకు ‘నగదు బదిలీ’ విధానాన్నే అమలు చేయాలని పౌరసరఫరాల శాఖ తాజాగా నిర్ణయించింది. ఈ విధానం ప్రకారం లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకునేటప్పుడు మొత్తం ధర చెల్లించాలి. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.955గా ఉంది. మహాలక్ష్మి పథకంలో అర్హులకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మిగతా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో బదిలీ చేయాలని నిర్ణయించింది.

ప్రజా పాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ నంబరు తప్పు ఉన్నట్లయితే సవరించుకునే అవకాశమివ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్తు బిల్లు కలెక్షన్ సెంటర్లు, సర్వీస్ సెంటర్లన్నింటా ఈ సవరణ ప్రక్రియను చేపట్టాలని స్పష్టం చేశారు.

తుమ్మిడిహట్టి వద్ద పాత డిజైన్‌తో ప్రాజెక్టు నిర్మాణానికి పరిశీలిస్తున్నాం : సీఎం రేవంత్‌రెడ్డి

మేడారం జాతరపై కేంద్రం వివక్ష చూపడం సరికాదు : సీఎం రేవంత్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.