ETV Bharat / state

పది వేలు ఎర వేశారు - సాఫ్ట్​వేర్ సొరను ముంచేశారు - IPO షేర్ల పేరిట భారీ మోసం

షేర్లు విక్రయిస్తామంటూ రూ.2.29 కోట్ల దోపిడీ - మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి

cybercriminals_robbed_crore_in_stock_trading_scam
cybercriminals_robbed_crore_in_stock_trading_scam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 11:02 AM IST

Cybercriminals Robbed RS 2 Crore in Stock Trading Scam : సైబర్​ కేటుగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రోజుకో అవతారం ఎత్తి అమాయకుల డబ్బులను కొల్లగొట్టేస్తున్నారు. పోలీసులు వారిని నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా షేర్లు విక్రయిస్తానంటూ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​కు రూ.10 వేలు ఆశ చూపి ఏకంగా రూ.2.29 కోట్లను సైబర్​ నేరగాళ్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్​లో జరిగింది. మోసపోయాయని గ్రహించిన బాధితుడు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సైబర్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్​లోని బాచుపల్లికి చెందిన సాఫ్ట్​వేర్ ​ఫోన్​ నంబర్​ను జులై 10న గుర్తు తెలియని వ్యక్తులు స్టాక్ పేరుతో ఉన్న వాట్సాప్​ గ్రూపులో చేర్చారు. ఆ వాట్సాప్​ గ్రూపు పేరు కేఎస్​ఎల్​ అఫీషియల్​ స్టాక్​. ఈ వాట్సాప్​ గ్రూపులో నారాయణ జిందాల్​ అనే వ్యక్తి కోటక్​ సెక్యూరిటీస్​లో చీఫ్​ ఇన్వెస్ట్​మెంట్​ ఆఫీసర్​గా పని చేస్తున్నారని, షేర్ల విక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని గ్రూపులో తరచూ ఛాటింగ్​ చేసేవారు. ఈ క్రమంలో అక్టోబరు 2 నుంచి కోటక్​ సెక్యూరిటీస్​ లిమిటెడ్​ స్ట్రాటజీ ప్లాన్​ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్​ పేరుతో ఆ వాట్సాప్​ గ్రూపులో ఒక వ్యక్తి పోస్టు చేశారు. ఇందులో చేరాలంటే కోటక్​ ప్రో యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలన్నారు. వీఐపీ ట్రేడింగ్​ ప్లాన్​లో చేరితే లాభాలు వస్తాయని ఆశ చూపించేవాడు.

యాప్​లో సాఫ్ట్​వేర్​ పెట్టుబడి : వారు చెప్పిన ప్లాన్​లో చేరినందుకు తమకు లాభాలు వచ్చాయని గ్రూపు సభ్యుల పేరుతో సందేశాలు పోస్టు చేసేవారు. ఇదంతా నిజమేనని నమ్మిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ యాప్​ డౌన్​లోడ్​ చేసుకున్నాడు. అందులో కస్టమర్​ కేర్​ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపేవాడు. ముందుగా తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు యాప్​లో చూపించారు. దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ దఫదఫాలుగా మరో రూ.90 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు.

ఇలా ఉద్యోగికి అనుమానం : అలాగే రూ.1.5 కోట్ల విలువైన ఐపీవో షేర్లు కేటాయిస్తున్నామని మళ్లీ రూ.80 లక్షలు, ఆ తర్వాత రూ.49.62 లక్షలు, రూ.5 లక్షలు కలిపి ఇలా మొత్తంగా రూ.2.29 కోట్లు బదిలీ చేసుకున్నారు. దీనికి వారు కేవలం రూ.10 వేలు విత్​డ్రా చేసుకునే అవకాశం మాత్రమే ఇచ్చారు. మీరు పెట్టుబడి పెట్టిన రూ.2.29 కోట్లకు రూ.1.10 కోట్ల లాభం వచ్చిందని ఖాతాలో చూపించారు. ఈ మొత్తం విలువ రూ.3.29 కోట్లు విత్​డ్రా చేసుకోవాలంటే మరో రూ.40 లక్షలు కట్టాలన్నారు. డబ్బు మొత్తం విత్​డ్రా చేసుకోవాలంటే రకరకాల నిబంధనలు చెప్పడంతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి అనుమానం వచ్చింది. తనకు తెలిసిన వారిని వాకబు చేయగా, అంతా మోసమని తేలింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లైక్‌ చేసి, షేర్ చేస్తే డబ్బులు రావు - ఎవరైనా చెబితే నమ్మకండి

ఈడీ కేసు అంటూ ఫేక్ సీబీఐ ఫోన్ కాల్ - వ్యాపారవేత్త నుంచి రూ.28.50లక్షలు స్వాహా - 28 lakhs Cyber Crime In Name of CBI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.