ETV Bharat / state

దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ - ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్​, డీజీపీ - CS Santhi Kumari Formation Day - CS SANTHI KUMARI FORMATION DAY

Telangana Decade Celebrations 2024 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అందుకు కావల్సిన ఏర్పాట్లను చేస్తోంది. సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్​లో జరిగే ఈ వేడుకలు నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పరేడ్ మైదానంలో రిహార్సల్స్​ను తిలకించారు.

Telangana Decade Celebrations 2024
CS Santhi Kumari on Formation Day (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 27, 2024, 8:02 PM IST

Updated : May 27, 2024, 10:36 PM IST

దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్న తెలంగాణ - ఏర్పాట్లను పర్యవేక్షించిన సీఎస్​, డీజీపీ (ETV BHARAT)

Telangana Decade Celebrations 2024 : పదేళ్ల ఆవిర్భావ సంబురానికి తెలంగాణ ముస్తాబవుతోంది. జూన్‌ 2న ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించనున్న సీఎం పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

CS and DGP on Formation Day Arrangements : రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లపై సీఎస్ శాంతి కుమారి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం డీజీపీ రవిగుప్తాతో కలిసి పరేడ్‌ గ్రౌండ్‌ వెళ్లిన సీఎస్‌ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసుల కవాతు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున స్టేజిని సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారులను సన్మానించనున్నారు.

నేడు దిల్లీకి సీఎం రేవంత్ - దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నేతలకు ఆహ్వానం!

Telangana Formation Day 2024 : వేడుకల కోసం పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పరేడ్ మైదానంలో రిహార్సల్స్ నిర్వహిస్తున్నాయి. ప్రత్యేకంగా ఆకర్షించే పోలీస్ కవాత్ కోసం రక్షకభటులు వారం రోజల పాటు రిహార్సల్స్ చేస్తున్నారు. ఇందులో అక్టోపస్ బలగాలు, టీఎస్​ఎస్​పీ బెటాలియాన్, ఏఆర్, కార్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో పాటు విద్యార్థులు పాల్గొంటున్నారు.

Formation Day Events 2024 : జూన్ 2న జరిగే కార్యక్రమాల షెడ్యుల్‌ను సీఎస్​ నిర్ణయించారు. ఉదయం గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళి సీఎం అర్పించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే వేడుకల్లో పాల్గొని రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఆవిష్కరిస్తారు. ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 వరకు కళారూపాల కార్నివాల్ 5 వేల మంది శిక్షణ పోలీసుల బ్యాండ్ ప్రదర్శన ఉండనుంది. ట్యాంక్‌బండ్‌పై హస్త, చేనేత కళలు, స్వయం సహాయక బృందాలతో పాటు హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్ల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం సందర్శకులను ఆకట్టుకునేలా బాణసంచా, లేజర్ షో జరగనుంది. ఈ వేడుకలకు కాంగ్రెస్​ నేత సోనియా గాంధీ ముఖ్య అతిథిగా రానున్నారు.

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గ్రాండ్​గా జరిపేందుకు రేవంత్ పక్కా ప్లాన్ ​ - మరి ఈసీ అనుమతి ఇస్తుందా? - TS Formation Day Celebrations 2024

Last Updated : May 27, 2024, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.