CRPF DSP Died in Gun Shot at Kothagudem : ప్రమాదవశాత్తు గన్ పేలి సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు మృతి చెందారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసగుప్ప 81 బెటాలియన్‌లో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ క్యాంపులో అసిస్టెంట్ కమాండెంట్‌గా డీఎస్పీ శేషగిరిరావు విధులు నిర్వహిస్తున్నారు. పూసగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో ఆయన ఉంటున్నారు. అయితే ఈరోజు విధి నిర్వహణలో ఉండగా, తన వద్ద ఉన్న గన్ మిస్‌ఫైర్ అయి ఛాతిలోకి బుల్లెట్ వెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లిన అనంతరం వైద్యులు పరీక్షించి, ఆయన అప్పటికే మృతి చెందారని తెలిపారు.
అయితే గన్ మిస్ ఫైర్ జరిగిందా లేదా డీఎస్పీ శేషగిరిరావు ఆత్మహత్యకు ఏమైనా పాల్పడ్డారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు పూర్తిగా గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శేషగిరిరావు స్వస్థలం ఏపీలోని అనంతపురం జిల్లాగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
నన్ను మన్నించు కన్నా - కళ్లల్లో నీ రూపం నింపుకొని లోకం వీడుతున్నా - Woman dies due to electric shock