ETV Bharat / state

అట్లుంటది మరి మాతోని - చికెన్ షాపు యజమానికి చుక్కలు చూపించిన కాకులు - CROWS UNITY IN RAZOLE

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 9:20 AM IST

Updated : Jul 19, 2024, 12:21 PM IST

Crows Unity in Razole : పక్క వాడికి ఏదైనా కష్టం వస్తే ఎందుకు సాయం చేయాలని ఆలోచించే స్వార్థపు మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. కానీ మేం మనుషుల కంటే గొప్పవాళ్లం, మాకు మా స్నేహితుడే గొప్ప అని నిరూపించాయి కాకులు. కాకి కాళ్లకు తాడు కట్టిన చికెన్ షాప్ యజమానితో యుద్ధానికి దిగాయి. తమ కాకిగోలతో సరైన బుద్ధి చెప్పి ఐకమత్యమే మహా బలమని నిరూపించాయి. యాంత్రిక సమాజంలో మరుగున పడుతున్న మానవత విలువలను గుర్తు చేసే సన్నివేశం ఇది. మానవత్వం ఉన్న వారి చేత కంటతడి పెట్టించాయి. మనుషుల్లో నిద్రపోతున్న మానవత్వాన్ని, ఐకమత్యాన్ని తట్టి లేపాయి.

Crows Unity in Razole
Crows Unity in Razole (ETV Bharat)

Crows Unity in Razole : మనిషి వికృత ప్రవర్తన ఈరోజుతో కాకులకు అర్థమైంది అనుకుంటా. ఈ సన్నివేశాన్ని చూసిన మూగజీవాలకు మానవులతో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాయామో. "అందితే జుట్టు అందకపోతే కాళ్లు" పట్టుకునే మానవుల చేష్టలు ఈ రోజు మరోసారి బయటపడ్డాయి. అందుకు నిదర్శనమే ఈ సంఘటన.

"మన పెద్దల పిండాన్ని కాకులు ముట్టుకోవాలని, తినాలని "కావ్.. కావ్" అంటూ అరుస్తూ బతిమాలుతాం. అదే మనం అవసరం తీరాకా.. అదే కాకి ఆకలితో మనం ఇంటి గుమ్మం తొక్కితే దీనికి చావు ఎప్పుడు వస్తుందో అని శాపనార్థాలు పెడతాం." ఈ చికెన్ షాప్ యజమాని నాలుగు ఆకులు ఎక్కువ చదువుకొని కాకి కాళ్లకు తాడు కట్టి వికృత ఆనందాన్ని పొందాడు. తనతో పాటు ఉంటే కాకి మృతి చెందితేనే గొల చేసే కాకులు అతనికి సరైన గుణపాఠం చెప్పాయి. ఐకమత్యమే మహా బలమని ప్రజలకు ఓ మేసేజ్ ఇచ్చాయి. అసలేం జరిగిందంటే..?

మొన్న 'బలగం'.. ఇప్పుడు 'విరూపాక్ష'.. బాక్సాఫీస్​ వద్ద 'కాకి' కాసుల వర్షం!"

Chicken Shop Owner Tied Crows With Rope : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఓ యజమాని చికెన్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆకలితో ఉన్న కాకులు షాప్​లోని వ్యర్థాలను, చికెన్ ముక్కలను ఎత్తుకుపోతున్నాయి. ప్రతిరోజూ ఇలాగే జరగడంతో ఎలాగైనా కాకులను తన షాప్ దరిదాపుల్లోకి రాకుండా చేయాలని పన్నాగం పన్నాడు. ఇదే తరుణంలో మెదడుకు పదును పెట్టడం వల్ల రాక్షస ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా దానికి ఆచరణలో పెట్టాడు. కాకి షాపు దగ్గరకు రావటంతోనే మాటువేసి పట్టుకున్నాడు. ఈ సారి చికెన్ ముక్కలు ఎత్తుకెళ్లకుండా ఉండేందుకు కాకిని బంధించి ప్రదర్శన చేయించాడు.

ఈ విషాద సన్నివేశాన్ని చూసిన తోటి కాకి చలించిపోయింది. వెంటనే ఆలోచించకుండా తన సైన్యాన్ని సంఘటనా స్థలానికి తీసుకుని వచ్చింది. తక్షణమే వందల సంఖ్యలో కాకులు అక్కడకు చేరుకున్నాయి. ఆకాశంలో విహరిస్తూ పెద్దగా "కావ్.. కావ్" అంటూ తమ గోడును ఆ ప్రదేశానికి తెలియజేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తమ స్నేహితుడి కట్టేసిన చికెన్ షాపు యజమానిపై యుద్ధం ప్రకటించాయి. కాకులు అరుపులకు విసుగు చెందిన ప్రజలు చికెన్​ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చేసేదేమీ లేక కాకికి స్వేచ్ఛను ప్రకటించారు. అంతే కాకులన్నీ పట్టలేని ఆనందంతో మనుషులకు దూరంగా వెళ్లిపోయాయి. ఈ సీనంతా చూసిన ప్రజలు కాకులకు ఉన్నంత ఐక్యత మనకు లేకపోయే అనుకుంటూ వెళ్లిపోయారు.

కాకి పిల్ల మనిషికీ ముద్దే.." కావాలంటే మీరే చదవండి!

Last Updated : Jul 19, 2024, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.