Crops Damaged in Krishna District Due to Rains for Three Days : ఈ ఖరీఫ్‌లో ఎన్నో ఆశలతో సాగు ప్రారంభించిన రైతులకు ఆదిలోనే విఘాతం ఏర్పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో నారుమళ్లు, వరి పొలాలు నీట మునిగాయి. పామర్రు, అవనిగడ్డ, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల్లో పొలాలు మునిగిపోవడంతో వరి నాట్లు ఎంత వరకు చేతికందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే నేటికీ వెంటాడుతోందని అన్నదాతలు అంటున్నారు. ఈ ఐదేళ్లలో పంట కాలువల్లో పుడిక తీయకపోవడం వల్ల వరద పొలాలను ముంచెత్తుతోందంటున్నారు రైతులు. సాగు కోసం ఇప్పటికే 10వేల రూపాయల వరకు ఖర్చు చేశామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కర్షకులు కోరుతున్నారు.
'పొలాల్లో ఉన్న నీరు బయటకు పోయే వెసులుబాటు ఉంటే మాకు ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. నీరు ఇలాగే మరోక రెండు రోజులు ఉంటే మళ్లీ నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆదే కనుక జరిగితే ఎద పద్దతిలో వరిసాగు చేస్తున్న రైతులు వేల రూపాయలు నష్టపోతారు. ఈ నష్టంతో పాటు మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయడం అదనపు భారంగా ఉంటుంది.' -రైతులు
Farmers Problems Due To Heavy Rains : గత ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలను నేటికీ వెంటాడుతోంది. ఐదేళ్ల పాలనలో పంట కాలువల్లో కనీసం పుడిక తియ్యకపోవడం రైతులకు శాపంగా మారింది. వర్షాలు వచ్చిన ప్రతిసారి రైతులు నష్టపోతున్నారు. గుర్రపుడెక్క, కర్రనాచు వల్ల మురుగు కాలువలో నీరు ఎగదన్ని పంట పొలాలను ముంచెత్తింది. ఫలితంగా నాట్లు, వరి పైరు నీటిపై తేలియాడుతోంది. రైతన్నలు పెట్టుబడులు లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వాపోతున్నారు. కొత్త ప్రభుత్వం తమ సమస్యలకు పరిష్కారం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో నీటమునిగి పంటతో నష్టపోయామని ప్రజలు తెలిపారు. వానల ఉద్ధృతి పెరిగితే మరింత పంట మునిపోయే ప్రమాదముందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు - తప్పని గిరిజనుల కష్టాలు - Heavy Rains Streams Flowing in AP