ETV Bharat / state

నీట మునిగిన పంటలు, నేలకొరిగిన తోటలు - చేతికందే పరిస్థితి లేదంటున్న అన్నదాతలు - Crop Loss In Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 7:15 AM IST

Crop Loss In Telangana : వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు పలుచోట్ల అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాగులు, వంకలు, ప్రాజెక్టులు ఉద్ధృతంగా ప్రవహించడంతో పెద్ద మొత్తంలో పంటలు నీటమునిగాయి. వరద ఉద్ధృతి తగ్గినా పంట చేతికందే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Crop Loss Due to Floods in Telangana
Crop Loss Due to Floods in Telangana (ETV Bharat)

Crop Loss Due to Floods in Telangana : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక పంటలు నీట మునిగాయి. జోరు వానలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లావ్యాప్తంగా వాగులు పొంగిపొర్లి పంట పొలాల్లో నుంచి భారీగా వరద నీరు ప్రవహించింది. శ్రీరామసాగర్ వరద ఉద్ధృతికి దాదాపు వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయా నీటి పాలైంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పంటలు రక్షించుకున్నామని, ఇప్పుడు భారీ వానలకు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వరి, మిర్చి, బొప్పాయ రైతులు, మొక్కజొన్న రైతులు అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టాన్ని ప్రభుత్వం ద్వారా కొంత ఆర్థిక సహాయం అందిస్తే తమ పెట్టుబడుల నుంచి కొంత సాయం అందినట్టుగా అవుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వర్షం తాకిడికి బొప్పాయి తోటలు మొత్తం విరిగిపోయాయి. చేతికి వచ్చిన పంటను అందుకోలేక అకాల వర్షంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి, తీరా కాయలు కాసాక కొద్దిరోజుల్లో దిగుబడి చేతికి వస్తుందనగా ఇలా నేల రాలడంతో దుఃఖ సముద్రంలో మునిగిపోతున్నారు.

పొలాల్లో ఇసుక దిబ్బలు, రాళ్లు, రప్పలు - అతలాకుతలమైన రైతుల పరిస్థితి - Floods Damage in Telangana

"పోచంపాడులో వరద ఎక్కువ రావడం వల్ల మా పంటలు నాశనం అయ్యాయి. ఇన్​ ఫ్లో ఎక్కువ ఉండి అవుట్ ఫ్లో తక్కువ పెట్టడం వల్ల ఇలా జరిగింది. అధికారులు ముందుగా అలర్ట్ అయి ఉండి ఉంటే ఇలా జరగకపోయేది. మేం 10 ఎకరాల్లో పంట వేస్తే 8 ఎకరాల వరకు పంట నష్టపోయాం. ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లిస్తే బాగుంటుంది." - బాధిత రైతులు

చాలా మంది వేరే ప్రాంతం నుంచి వచ్చి కౌలుకు తీసుకొని రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి ఇలా నష్టం రావడంతో తమకు చావు తప్ప వేరే మార్గం లేదని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్షం తాకిడికి మిర్చి రైతులు కోలుకోలేని పరిస్థితి వచ్చిందని తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.

వరద ఉద్ధృతికి కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో కౌలు రైతుకు చెందిన వరి పొలం మొత్తం కంకరతో నిండిపోంది. వరద తాకిడికి అరెకరం పొలం నిండా పరచుకోవడంతో దిక్కుతోచని స్థితి నెలకొందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతు కడుపు కొట్టిన వానలు - వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు - HUGE CROP DAMAGE IN TELANGANA

పొలాల నిండా బండరాళ్లు, ఇసుకు మేటలు - భారీ వర్షాలతో ఆనవాళ్లు కోల్పోయిన పంట పొలాలు - Flood Effect To Telangana Crops

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.