ETV Bharat / state

విజయనగరం జిల్లాలో వరదలు - వందల ఎకరాల్లో పంటలు నేలమట్టం - Crop Damage in Vizianagaram - CROP DAMAGE IN VIZIANAGARAM

Crop Damage in Vizianagaram District: అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తాయి. కొన్నిచోట్ల కాలవలు, చెరువులకు గండ్లు పడి లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు నీటమునిగాయి. వందలాది ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడింది. అరటి నేల మట్టమైంది. కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. మన్యం జిల్లాలో పత్తి, మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది.

crop-damage-in-vizianagaram-district
crop-damage-in-vizianagaram-district (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 12, 2024, 1:39 PM IST

Crop Damage in Vizianagaram District : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉమ్మడి విజయనగరం జిల్లాను ముంచెత్తింది. విస్తారంగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో పొలాల్లోకి వరద చేరింది. వరి పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావటంతో పంట నష్టం కూడా అధికంగా సంభవించింది. 17 మండలాల్లో 12వందల 50ఎకరాల్లో వరి పంట ముంపు బారిన పడినట్లు వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా.

Heavy Rains and Floods in AP : అరటి, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. రేగిడి, ఆమదాలవలసలో 1.6హెక్టార్లలో అరటి నేల మట్టమైంది. మెంటాడ, నెల్లిమర్ల, జామి, రామభద్రపురం, బొండపల్లి, డెంకాడ మండలాల్లో కూరగాయ పంటలు తుడుచిపెట్టుకుపోయాయి. బొబ్బిలి మండలం వణుకువలస, నారాయణప్పవల గ్రామాల్లో చెరువులు పొంగటంతో 15 హెక్టార్లలో పత్తి, వరి చేలకు నష్టం వాటిల్లింది. గుర్ల మండలంలో 100ఎకరాల్లో వరి నీట మునిగింది.

వరద సహాయక చర్యల్లో అధికారులు- ధాన్యం దండుకుంటున్న మిల్లర్లు- నెల్లూరు జిల్లాలో రైతుల ఆవేదన - No Rate To Paddy In Nellore

వందల ఎకరాల్లో పంట నష్టం : మెరకముడిదాం, ఎం.రావివలస గ్రామాల్లో వరద ప్రవాహానికి వరి, పత్తి రైతులు నష్టపోయారు. గజపతినగరం మండలం మదుపాడ, గజపతినగరం గ్రామాల్లో 20ఎకరాల వరి పంట ముంపునకు గురైనట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. దత్తిరాజేరు మండలంలో 75ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. సంతకవిటిలో సాయిన్నగెడ్డ పొంగి రామరాయపురంలో 500ఎకరాల్లో వరి ముంపునకు గురైంది. పూసపాటిరేగ మండలం కుమిలిలో 88ఎకరాలు, చౌడువాడలో 83ఎకరాలు, గోవిందపురంలో 25 ఎకరాలు, చల్లవానితోటలో 8ఎకరాల విస్తీర్ణంలోని పంటలు ముంపునకు గురైయ్యాయి. జామి మండలం భీమసింగి, రామయ్యపాలెం గ్రామాల్లో 160 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. డెంకాడ మండలం మోదవలసలో గాడువాని చెరువుకు గండిపడి 20ఎకరాల వరి పంట నీట మునిగింది.

రైతుల ఆవేదన : పార్వతీపురం మన్యం జిల్లాలో వంద ఎకరాల వరకు వరి పంట ముంపునకు గురికాగా, పాచిపెంట, సాలూరు మండలాల్లో కొంతమేర ప్రత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పాచిపెంట మండలంలోనే పత్తికి అధిక నష్టం వాటిల్లింది. పంట ముందుగా సాగు చేసిన పొలాల్లో తొలి విడత దిగుబడి చేతికొచ్చింది. ఈ సమయంలో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పత్తికాయలు బూజుపట్టాయి. దీంతో తొలి దిగుబడి మొత్తం కోల్పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణమ్మ ప్రకోపానికి అన్నదాత విలవిల - వేలాది ఎకరాల్లో తుడిచిపెట్టుకుపోయిన పంటలు - Crops loss due to Krishna Floods

44 చెరువులకు గండ్లు : జిల్లాలో పంట నష్టంతో పాటు, ఆస్తి నష్టమూ సంభవించింది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 67 కిలోమీటర్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు జిల్లాలో 44 చెరువులకు గండ్లు పడ్డాయి. విద్యుత్తు శాఖకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 68 స్తంభాలు నేలకొరిగినట్లు అధికారులు గుర్తించారు.

చెరువులా పంట పొలాలు - చేతికొచ్చిన వరిపైరు కుళ్లిపోయిందని రైతుల ఆవేదన - Crops Damage Due to Floods

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.